కోప్రాది గ్యాంగ్‌ రేప్‌: నిందితులకు ఉరి శిక్ష | Death Sentence to 3 Convicts in Kopardi Rape Case | Sakshi
Sakshi News home page

కోప్రాది గ్యాంగ్‌ రేప్‌: నిందితులకు ఉరి శిక్ష

Nov 29 2017 1:28 PM | Updated on Nov 29 2017 1:49 PM

Death Sentence  to 3 Convicts in Kopardi Rape Case - Sakshi

సాక్షి, ముంబై : కోప్రాది గ్యాంగ్‌రేప్‌, హత్య కేసులో ముగ్గురు నిందితులకు అహ్మద్‌నగర్‌ జిల్లా సెషన్సు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా గత ఏడాది సంచలనం సృష్టించిన కోప్రాది గ్యాంగ్‌రేప్‌, హత్య కేసులో జితేంద్ర బాబూలాల్‌ షిండే, సంతోష్‌ గోర్కా బవాల్‌, నితిన్‌ గోపీనాథ్‌ భలూమే నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారించేందుకు 2016 డిసెంబర్‌ 20న స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర్లలోని అహ్మద్‌ నగర్‌ జిల్లా కోప్రాదిలో 2016 జులై 13న 15 ఏళ్ల మైనర్‌ బాలికను ముగ్గురు దుండుగులు గ్యాంగ్‌రేప్‌ చేసి, ఆపై హత్య చేశారు. రక్తమోడుతున్న బాలిక మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని ఒక చెట్టు దగ్గర ప్రజలు గుర్తించారు. బాధిత బాలిక మారాఠా వర్గానికి చెందినది.

కేసు తీర్పు వెలువడ్డాక.. నిందితుల తరపు న్యాయవాది బాలాసాహెబ్‌ ఖోప్డే.. నేరం చేసినా ఇంతటి తీవ్రమైన శిక్ష విధించడం భావ్యం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్‌ తరఫున కేసు వాదించిన న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ మాత్రం తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదైన కేసుల్లో ఒకటని.. నిందితులకు ఉరి శిక్షే సరైన శిక్ష అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement