విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి : పురందేశ్వరి
రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవశ్యకత ఎంతైన ఉందని కేంద్ర మంత్రి డి.పురందేశ్వరి స్పష్టం చేశారు. అందుకోసం ఈ ప్రాంత ప్రజా ప్రనిధులంతా కేంద్రంతో పోరాడి ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. విశాఖ- జోధ్‌పూర్, విశాఖ-గాంధీగామ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను మంగళవారం ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆమె ప్రారంభించారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లులో రైల్వే జోన్‌పై కేంద్రం ఏటువంటి హామీ ఇవ్వలేదన్న సంగతిని ఈ సందర్బంగా పురందేశ్వరి గుర్తు చేశారు.
భువనేశ్వర్‌లో ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం రైల్వే ఉద్యోగులు ఇటు స్థానికులు ఎన్నో ఉద్యమాలు, నిరసనలు చేశారు. అయిన ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరించింది. అయితే రాష్ట్ర విభజనపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అది విజయవాడ లేక విశాఖ అనేది మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.