breaking news
Top seedings
-
భారత ఆర్చరీ జట్లకు టాప్ సీడింగ్
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీ కాంపౌండ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు టాప్ సీడింగ్ లభించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఆసియా క్రీడల చాంపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణిత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు 2100 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఫలితంగా టీమ్ విభాగంలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. జ్యోతి సురేఖ 705 పాయింట్లతో రెండో స్థానంలో, అదితి 699 పాయింట్లతో 10వ స్థానంలో, పరీ్ణత్ 696 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. ప్రియాంశ్ (710 పాయింట్లు), అభిషేక్ వర్మ (710 పాయింట్లు), ప్రథమేశ్ (705 పాయింట్లు) లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు క్వాలిఫయింగ్ రౌండ్లో 2125 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
సానియా జంటకు టాప్ సీడింగ్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడింగ్ దక్కింది. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో సానియాకు టాప్ సీడింగ్ దక్కడం ఇదే తొలిసారి.