నేటి ముఖ్యవార్తలు..
♦ నేడు రాఖీ పౌర్ణమి. రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు.
♦ ఇవాళ చంద్ర గ్రహణం. రాత్రి 10.52 గంటలకు ప్రాంభమై ఆర్ధరాత్రి 12.48 గంటలకు పూర్తికానుంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను మూసివేయనున్నారు.
♦ ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో వైఎస్సార్సీపీ సమక్షంలో చేనేత సదస్సు జరగనుంది.
♦ నేటితో ఏపీ మెడికల్ రెండో విడత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లకు గడువుంది.
♦ ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
♦ తూర్పుగోదావరి: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. 42, 48 డివిజన్లను మినహాయించి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేశారు.
♦ నేటి ప్రోకబడ్డీ లీగ్‌లో జూనియర్ కబడ్డీ మ్యాచ్‌లు జరగనున్నాయి. రేపు రాత్రి 8 గంటలకు గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్‌తో హర్యానా స్టీలర్స్, రాత్రి 9 గంటలకు బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ జట్లు తలపడతాయి.