breaking news
tiolet
-
భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి ప్రాణం తీసిన భార్య!
సాక్షి,నిజామాబాద్: ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవాళ్లు. కట్టుకున్న భార్యే ఆ ఇంటికి మహాలక్ష్మి అనుకునేవాళ్లు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు దారి తప్పుతున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి, కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తలను కూడా మరిచిపోతున్నారు. తమ చీకటి బంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రాణంగా చూసుకోవాల్సిన భర్తనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు.ప్రియుడితో కలిసి మొగుడిని చంపి, శవాన్ని బ్లూ డ్రమ్‌లో పెట్టి సిమెంట్ పోసిన మీరట్ దారుణం, పూణే లోహ్‌గఢ్ కోట నుంచి కాబోయే భర్త కేతన్ అర్వాల్ను తోసేసి ప్రాణం తీసిన ఘటన మరువకముందే.. నిజామాబాద్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. బిల్డింగ్ పైనుంచి తోసేసినా చావలేదని, ఆస్పత్రిలో సెలైన్ బాటిల్లో ఏకంగా ‘హార్పిక్’ ఎక్కించి భర్తను చంపేసింది. దీంతో మన ఇంట్లోప్రాణం తీసే ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య దంపతులు. కుటుంబ పోషణ కోసం, భార్యాపిల్లల భవిష్యత్తు కోసం ప్రశాంత్ కన్నవారిని, కట్టుకున్న దేశాన్ని వదిలి సౌదీ అరేబియా (గల్ఫ్) వెళ్లాడు. అక్కడ పగలు రాత్రి కష్టపడుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. అయితే, ఇక్కడ నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న భార్య సంధ్య మనసు మాత్రం పక్కదారి పట్టింది. ఇంద్రాపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త దూరంగా ఉండటంతో వీరి చీకటి బంధం అడ్డూఅదుపూ లేకుండా సాగింది. ఈ విషయం కాస్తా గల్ఫ్‌లో ఉన్న ప్రశాంత్‌కు తెలియడంతో, అతడు ఫోన్ చేసి భార్యను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఫోన్లలోనే గొడవలు మొదలయ్యాయి.గల్ఫ్ నుంచి రాక... మృత్యుపాశమై నిలిచిన భార్యతమ మధ్య గొడవలు సర్దుమణిగించుకుందామనో ఏమో గానీ, జూన్ 27వ తేదీన ప్రశాంత్ గల్ఫ్ నుంచి తన సొంతూరికి తిరిగి వచ్చాడు. భర్త ఇండియాకు రావడంతో తన అక్రమ బంధానికి అడ్డుకట్ట పడుతుందని సంధ్య భావించింది. అతడిని శాశ్వతంగా వదిలించుకుంటేనే తాను, తన ప్రియుడు హ్యాపీగా ఉండొచ్చని క్రూరమైన పథకం రచించింది. ఇందుకోసం తనకు పరిచయమున్న న్యాల్కల్ గ్రామానికే చెందిన వెంకట సాయి అలియాస్ బంటి అనే యువకుడిని పురమాయించింది. దాబా పైనుంచి తోసేసినా తప్పిన ముప్పుపథకం ప్రకారం... జూన్ 29వ తేదీ రాత్రి ప్రశాంత్, బంటి కలిసి ఇంటి దాబాపై కూర్చుని మద్యం తాగేలా సంధ్య ఏర్పాట్లు చేసింది. ప్రశాంత్ ఫుల్లుగా మద్యం మత్తులోకి జారుకోగానే... సంధ్య, బంటి కలిసి అతడిని బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేశారు. కింద పడిన ప్రశాంత్ రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ, ఒళ్లంతా తీవ్ర గాయాలవ్వడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నర్సు బుద్ధి పోనిచ్చుకోలేదు... సెలైన్‌లో హార్పిక్!పైనుంచి పడినా భర్త బతికాడే అని సంధ్య కళ్లల్లో భయం, కసి పెరిగాయి. ఆస్పత్రిలో కోలుకుంటే తన గుట్టు రట్టవుతుందని భావించింది. తను నర్సు అన్న విషయాన్ని, ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిని దారుణంగా వాడుకుంది. ఆస్పత్రిలో భర్తకు ఎక్కుతున్న సెలైన్ బాటిల్‌ను గమనించిన సంధ్య... ఎవరూ లేని సమయం చూసి టాయిలెట్ క్లీన్ చేసే ‘హార్పిక్’ను సిరంజి ద్వారా సెలైన్ బాటిల్లోకి ఎక్కించింది. ఆ విషపూరిత కెమికల్ ప్రశాంత్ శరీరంలోకి పాకడంతో పరిస్థితి విషమించి అతడు ఆస్పత్రిలోనే కన్నుమూశాడు.పోలీసుల స్టైల్ విచారణ... కటకటాల వెనక్కి కిరాతకులుప్రశాంత్ హఠాన్మరణంతో అనుమానం వచ్చిన అతడి తల్లి... కోడలు సంధ్యతో పాటు మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. సంధ్య, బంటి, అనిల్‌ను అదుపులోకి తీసుకుని గట్టిగా నిలదీసేసరికి పాపం పండింది. తామే పక్కా ప్లాన్‌తో ప్రశాంత్‌ను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో భార్య సంధ్య, ఆమెకు సహకరించిన బంటి, ప్రియుడు అనిల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఈ దారుణ హత్య కేసులో భర్త ప్రశాంత్‌ను చంపడానికి భార్య సంధ్య ఎంతలా దిగజారిందో చెప్పే ఆడియో సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె తన ప్రియుడు అనిల్‌తో మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. వాడికి ఫుల్లుగా మందు తాగించి ప్రాణం తీసేయ్.. మేడ మీద నుంచి కిందకి తోసేయ్ అంటూ సంధ్య ఆ ఆడియోలో ప్రియుడికి స్కెచ్ చెప్పింది. దానికి అనిల్ భయపడుతూ.. నా వల్ల కాదు.. నేను చేయలేను అంటూ తప్పుకోవాలని చూశాడు.కానీ, మోహంతో కళ్లు మూసుకుపోయిన సంధ్య మాత్రం వదలకుండా.. ప్లీజ్‌రా.. నా మొగుణ్ని చంపేయ్ అంటూ ప్రియుడిపై పదే పదే ఒత్తిడి తెచ్చింది. చివరికి ప్రియురాలి కోరిక తీర్చడానికి అనిల్ సరేనన్నాడు.అయితే, హత్య చేయాల్సిన రోజు రాత్రి ఇంకొక ఊహించని ట్విస్ట్ జరిగింది. ప్లాన్ ప్రకారం ప్రశాంత్‌తో కలిసి మద్యం తాగిన ప్రియుడు అనిల్,హత్యకు సహకరించిన బంటి ఆ మత్తు తట్టుకోలేక తనే స్పృహ కోల్పోయాడు. దీంతో అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుందని భయపడిన ఆ రాక్షస భార్య.. స్వయంగా రంగంలోకి దిగింది. భర్త ప్రశాంత్ మద్యం మత్తులో మేడ అంచున నిలబడి ఉన్న సమయంలో.. వెనుక నుంచి వెళ్లి ఒక్కసారిగా అతడి రెండు కాళ్లను పైకి పట్టుకుని బిల్డింగ్ పైనుంచి కిందకు నెట్టేసింది. ఈ కుట్రకు సహకరించిన బంటి పోలీసుల విచారణలో ఈ షాకింగ్ నిజాలన్నింటినీ పూసగుచ్చినట్లు ఒప్పుకున్నాడు. -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీన్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
Hyderabad: ఆమె కోసం.. ఎలక్ట్రిక్ మొబైల్ టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మహిళల సదుపాయార్థం ఇప్పటికే షీ టాయ్లెట్లు, మొబైల్ టాయ్లెట్లు వంటివి అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల మొబైల్ టాయ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ మెట్రో నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల కోసం ‘నిర్భయ’ ఫండ్స్ నుంచి నిధులు అందజేస్తోంది. అలా అందిన నిధులతో మహిళల మొబైల్ టాయ్లెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సమకూర్చుకున్న పోలీసు శాఖ.. వాటి నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించింది. గ్రేటర్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఉంచారు. సికింద్రాబాద్ జోన్లో 3 వాహనాలు, ఎబీనగర్‌లో జోన్లో 3, ఖైరతాబాద్‌జోన్‌లో 2, చారి్మనార్ జోన్లో 2, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్ మొబైల్ బస్సులను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్, ధర్నాచౌక్, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్రగతిభవన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీని బట్టి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితోపాటు శానిటరీ నాప్కిన్స్ వంటివి ఉంటాయని పేర్కొన్నారు. షీ గెస్ట్‌హౌస్.. సేఫ్‌సిటీ ద్వారా అందే నిధులతో నగరంలో మహిళా యాత్రికుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌ను కూడా నిర్మించనున్నారు. నాంపల్లి సరాయి వద్ద 1900 చదరపుగజాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయంతోపాటు అయిదంతస్తులతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ పాలకమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. మొత్తం 187 బెడ్స్ కలిగి ఉండే గెస్ట్‌హౌస్‌లో సింగిల్ బెడ్స్, షేరింగ్ బెడ్స్ ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లో ఏసీతోపాటు వైఫై, లాకర్లు, లిఫ్టులు, ఇంటర్నెట్ కియోస్క్‌లు, ఎమర్జెన్సీ క్లినిక్ తదితర సదుపాయాలుంటాయి. అంచనా వ్యయం రూ.11 కోట్లు. (చదవండి: ‘ఫార్మా’లిటీస్ దందా! ) -
హవ్వా.. ఇంత అధ్వానమా
సాక్షి, పెదవేగి(పశ్చిమగోదావరి) : పైన పటారం..లోన లొటారం అన్న చందంగా ఉంది జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం పరిస్థితి. ప్రసిద్ధి చెందిన పెదవేగిలోని ఈ విద్యాలయంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బాత్రూమ్లు అధ్వానంగా ఉన్నాయి. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన పిల్లలు పాఠశాలకు వెళ్లబోమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే మరుగుదొడ్ల సమస్య దారుణంగా ఉందని చెబుతున్నారన్నారు. తాము స్వయంగా వెళ్లి చూస్తే పరిస్థితి పిల్లలు చెప్పిన దానికన్నా అధ్వానంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి అపారిశుద్ధ్య వాతావరణంలో తమ పిల్లలు ఉంటే రోగాల బారినపడతారని వారంతా భయపడుతున్నారు. 560 మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జవహర్ నవోదయ పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థులతో పనులు జవహర్ నవోదయ విద్యాలయంలో వసతులు, విద్య, అన్ని రంగాల్లో భేష్ అంటూ ఊదరగొట్టే యాజమాన్యం తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులతో పనులు చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మత్తులో భాగంగా విద్యార్థులు ఐరన్ ఊసలు పట్టుకుని సిబ్బందికి సహకరిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. తరగతి గదుల్లో ఉండాల్సి విద్యార్థులు ఇలా పనులు చేస్తూ కనిపించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌తో మాట్లాడి మరమ్మతులు చేయిస్తాం నవోదయ విద్యాలయంలో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. నవోదయ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలు అందులో సీటు కోసం ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. కాని సదుపాయాలు ఇలా ఉన్నాయని తెలీదు. జిల్లా కలెక్టర్‌కు చెప్పి మరమ్మతులు చేపడతాం. – కోటగిరి శ్రీధర్, ఎంపీ, ఏలూరు సమస్య 10 రోజుల్లో పరిష్కరిస్తాం అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్, బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలని విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడతున్నాం. కలెక్టర్ దగ్గర నుంచి అనుమతులు ఇప్పించి పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తాం. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు శాసనసభ్యుడు పనివాళ్లు దొరకడం లేదు విద్యాలయంలో మరుగుదొడ్లు బాలేని మాట వాస్తవమే. నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. దానికి ఆరు నెలల సమయం పడుతుంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పనివాళ్లు దొరకడం లేదు. దాంతో సక్రమంగా శుభ్రం చేయించలేకపోతున్నాం. – డాక్టర్ వైఎస్ఎస్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్, నవోదయ విద్యాలయం -
కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టండి..
వన్‌టౌన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ బాబు.ఏ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేసి డబ్బులు కాజేయాలని చూస్తే ఊరుకుంటామనుకుంటున్నారా...అంటూ తీవ్రంగా హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అందులో భాగంగా 1800 మరుగుదొడ్ల ఏర్పాటుకు పూనేకు చెందిన లాల్జీ అనే కాంట్రాక్టర్ రూ.రెండు కోట్లకు కాంట్రాక్ట్ పొందాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, నిర్వహణ వారే చూడాలి. ఆ సంస్థ మరుగుదొడ్ల నిర్వహణలో పూర్తిగా విఫలం చెందింది. దానిపై కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు వివరించారు. ఆయన స్వయంగా పరిశీలించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు, సబ్‌కలెక్టర్ సృజన, ఇతర అధికారులు దుర్గాఘాట్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశమయ్యారు. కమిషనర్ కాంట్రాక్టర్‌ను పిలిపించి జిల్లా కలెక్టర్ ముందు నిలబెట్టాడు. కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పని చేయకుండా డబ్బులో కాజేయాలని చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. అటువంటి ట్రిక్‌లు ఎక్కడైనా జరుగుతాయోమో.. ఈ జిల్లాలో జరగదంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఎస్పీని కార్పొరేషన్ వారు ఫిర్యాదు చేస్తారని, కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయాలంటూ సూచించారు.


