breaking news
Three-match series
-
వైభవ్‌కు చాన్స్ దక్కేనా!
న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌పై వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... సిరీస్ పట్టేసిన టీమిండియా చివరి మ్యాచ్‌లో రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టి20ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. గురువారం ఇరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో చివరి టి20 మ్యాచ్ జరగనుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచి లక్ష్యఛేదనకు మొగ్గుచూపిన టీమిండియా... ఈసారి అవకాశం వస్తే మొదట బ్యాటింగ్ చేస్తూ తమ బలాన్ని సరిచూసుకోవాలని భావిస్తోంది. అలాగే రిజర్వ్ ప్లేయర్లను ఈ మ్యాచ్‌లో పరీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ఎంత పోరాడినా గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియాకు సరైన పోటీనివ్వలేకపోయింది. ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నా... వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రెండో టి20లో రషీద్ ఖాన్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకోవడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో పాటు గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డార్విష్, అజ్మతుల్లా, నబీ కలిసి కట్టుగా రాణించాల్సిన అవసరముంది. గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే పిచ్ బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఆటకు వర్షం ఆటంకం కలిగించే అవకాశలు పెద్దగా లేవు. భిన్నమైన కూర్పుతో... ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందా చూడాలి. రెండో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... చివరి పోరులో భిన్నమైన కూర్పును ప్రయత్నిస్తామని వెల్లడించాడు. ఏషియన్ గేమ్స్ ప్రారంభానికి ముందు ప్లేయర్లందరికీ తగినంత మ్యాచ్ టైమ్ దక్కాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ చెరో మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీలు బాదిన నేపథ్యంలో ఎవరి స్థానంలో సూర్యవంశీని తీసుకుంటారనేది ఆసక్తికరం. ఇంగ్లండ్, జింబాబ్వేలో అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్... సొంతగడ్డపై ఇంతవరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలి కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తున్న ఇషాన్‌కు విశ్రాంతినిస్తారా చూడాలి. బౌలర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు అదనపు బౌలర్‌ను పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే బ్యాటింగ్ ఆర్డర్లో ఓ ప్లేయర్ తగ్గనున్నాడు. దీంతో పేస్ ఆల్‌రౌండర్, ఆంధ్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై బ్యాటింగ్ భారం పెరగనుంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతుండగా... అర్ష్ దీప్ సింగ్ అతడికి అండగా నిలుస్తున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే యశ్ ఠాకూర్‌కు మరోసారి అవకాశం దక్కొచ్చు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్‌కు దూరం కాగా... అతడి స్థానంలో అవకాశం దక్కించుకున్న రవి బిష్ణోయ్ రెండో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా... ఫీల్డింగ్‌లో మాత్రం టీమిండియా మరింత మెరుగవ్వాల్సిన అవసరముంది. భారత జట్టుతో జపాన్ రాయబారి భేటీ ఈనెల 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జపాన్ జట్టుతో భారత జట్టు తొలిసారి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం భారత్‌లో జపాన్ రాయబారి ఒనో కెచీ బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌తో పాటు భారత క్రికెటర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్‌కు జపాన్‌లో అదృష్ట చిహ్నానికి ప్రతీకగా భావించే ‘దారుమా’ బొమ్మను ప్రదానం చేశారు. తుది జట్లు (అంచనా) భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సామ్సన్, అభిషేక్, ఇషాన్/వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, అక్షర్, నితీశ్ రెడ్డి, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అర్ష్ దీప్, బుమ్రా. అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, సాధిఖుల్లా, నైబ్, డారి్వష్, అజ్మతుల్లా, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్/నవీన్, ఫజల్హక్ ఫారూఖి. -
ప్రాక్టీస్‌లో టీమిండియా
వడోదర: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్లో కోహ్లి, రోహిత్ మంచి టచ్‌లో కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కూడా నెట్స్‌లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
IND W vs AUS W 3rd T20: సిరీస్ ఎవరిదో?
నవీ ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్, ఆ్రస్టేలియా మహిళా జట్లు చెరొకటి గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు సిరీస్‌ను గెలుచుకునేందుకు ఫైనల్ లాంటి పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన భారత అమ్మాయిలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కోల్పోడానికి సిద్ధంగా లేరు. ఆఖరి పోరులో ఎలాగైనా నెగ్గాలనే లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం బరిలోకి దిగుతోంది. తద్వారా కొత్త ఏడాదిలో క్లీన్‌స్వీప్ పరాభవాన్ని మరిచేలా ఈ టి20 సిరీస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నెగ్గినట్లే ఈ ఆఖరి పోరులోనూ దాన్ని పునరావృతం చేస్తే సిరీస్ కష్టం కానేకాదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమాలు రాణిస్తే తొలి మ్యాచ్‌ను గెలుచుకున్నంత సులభంగా సిరీస్‌నూ గెలుచుకోవచ్చు. గత మ్యాచ్‌లో వీరి వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. దీంతో పాటు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారాయి. ఈ నలుగురు కీలకమైన చివరి మ్యాచ్‌లో రాణిస్తే మాత్రం మన మహిళా జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్ నిలకడగా రాణిస్తున్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే భారత ఫీల్డింగ్ సాధారణంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్కు ఫీల్డింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముంది. మరోవైపు ఏకైక టెస్టు మ్యాచ్ ఓడాక అలీసా హీలీ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు దెబ్బతిన్న పులిలా వన్డేల్లో పంజా విసిరింది. తాజా టి20 సిరీస్‌లోనూ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడినా... రెండో మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో భారత గడ్డపై రెండో సిరీస్ విజయంపై కన్నేసింది. -
WI Vs BAN, 3rd T20: పూరన్ ధనాధన్
జార్జిటౌన్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (39 బంతుల్లో 74 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మూడో టి20 మ్యాచ్‌లో విండీస్ 10 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అఫీఫ్ హుస్సేన్ (38 బంతుల్లో 50; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్ దాస్ (41 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసి విజయం సాధించింది. కైల్ మేయర్స్ (38 బంతుల్లో 55; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. మేయర్స్, పూరన్ నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరుగుతుంది. -
20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్ సొంతం
కెప్టెన్ బాబర్ ఆజమ్ (105 నాటౌట్; 12 ఫోర్లు), ఇమామ్ (89 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ 2–1తో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై పాక్ తొలిసారి వన్డే సిరీస్ దక్కించుకుంది. ముందుగా ఆసీస్ 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్‌కాగా... పాక్ 37.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. -
దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 42 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత సఫారీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (44 బంతుల్లో 75 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ 19.3 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. షమ్సీ, బోర్న్ ఫోర్టీన్ చెరో మూడు వికెట్లు సాధించి ప్రత్యర్థిని కట్టడి చేశారు. -
మెరిసిన లిటన్, షకీబ్
హరారే: లిటన్ దాస్ స్ఫూర్తిదాయక సెంచరీ (114 బంతుల్లో 102; 8 ఫోర్లు)కి బౌలింగ్‌లో షకీబుల్ హసన్ (5/30) ప్రదర్శన తోడవ్వడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 155 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా జట్టు 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 276 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 28.5 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. చకాబ్వ (54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. 200వ మ్యాచ్ ఆడుతోన్న జింబాబ్వే కెప్టెన్ బ్రెండన్ టేలర్ (24; 3 ఫోర్లు) వికెట్ తీయడం ద్వారా బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షకీబ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ మష్రఫె మొర్తజా (269 వికెట్లు) పేరిట ఉండేది. షకీబ్ ఇప్ప టి వరకు 213 వన్డేల్లో 274 వికెట్లు తీశాడు. -
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల తొలి టి20
నార్తాంప్టన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇక టి20ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు భారత్,ఇంగ్లండ్‌ల మధ్య తొలిటి20 జరుగనుంది. వన్డేల్లాగే ఈ ఫార్మాట్లోనూ ప్రత్యర్థి జట్టు మనకంటే బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫామ్‌లో లేని కెప్టెన్ హర్మన్‌పైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభంపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్నేహ్ రాణా, రిచా ఘోష్‌లతో పాటు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మరో వైపు స్టార్ ప్లేయర్ డానీ వ్యాట్ పునరాగమనంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా తయారైంది. -
ఇంగ్లండ్ శుభారంభం
కార్డిఫ్: శ్రీలంకతో ఆరంభమైన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి టి20లో ఇంగ్లండ్ 8 వికెట్లతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. దసున్ శనక (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కుశాల్ పెరీరా (26 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్యామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలుపొందింది. జోస్ బట్లర్ (55 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. డేవిడ్ మలాన్ (7) త్వరగా అవుటైనా... బెయిర్‌స్టో (13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి బట్లర్ మ్యాచ్‌ను పూర్తి చేశాడు. బట్లర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు లభించింది. -
న్యూజిలాండ్‌దే విజయం
వెల్లింగ్టన్: పాకిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు విజయంతో ఆరంభించింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హెన్రీ నికోల్స్ (82; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు టెయిలెండర్ల అద్భుత బ్యాటింగ్‌తో సోమవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు పాక్‌పై 70 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 280 పరుగులు చేసింది. అనంతరం పాక్ 46 ఓవర్లలో 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ (62; 6 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. బౌల్ట్‌కు నాలుగు, ఇలియట్కు మూడు వికెట్లు దక్కాయి. -
రికార్డుల మోత
సెంచరీలతో చెలరేగిన రామ్‌దిన్, బ్రేవో బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ బస్సేటెర్రె (సెయింట్ కిట్స్): దినేశ్ రామ్‌దిన్ (121 బంతుల్లో 169; 8 ఫోర్లు, 11 సిక్సర్లు), డారెన్ బ్రేవో (127 బంతుల్లో 124, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బస్సేటెర్రెలో సోమవారం జరిగిన మూడో వన్డేలో 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిం ది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది.


