breaking news
Teugu desam party
-
పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?
గుంటూరు: చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తారని చెప్పుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుచేశారు కాబట్టే ఆయన భయపడుతున్నారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన నేరానికి ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టు భయం పుట్టుకున్న చంద్రబాబు ప్రజల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని నాకు అనిపిస్తోందన్నారు. బహుశా ఆయనను అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారు, అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని అన్నారు. అలాగని చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరని అన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు సరికదా ఆయన హీరోనే అంటాడని వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చిన ఇదే అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వచ్చిందా.. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నార్నయి అన్నారు. . అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలు చెప్పాలి.. అంతే తప్ప చంద్రబాబు సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవడమేంటో నాకైతే అర్ధం కాలేదన్నారు. మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానంటారు కానీ చంద్రబాబు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టలదొర లేని లోటుని ఆయన తీరుస్తున్నారని రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు -
ఆ నైతిక విలువలు ఏవి బాసు?
పశువులు సంతలో కొన్నట్టు కొంటారా... ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు ... సిద్ధాంతం నాకు ముఖ్యం. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ నియమాలకు కట్టుబడి ఉండాలి. ప్రజా జీవితంలో నేను నీతి, నిజాయతీగా బతికాను. ఆ విధంగా ముందుకు పోతాను. పశువులను సంతలో కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొంటారా...ఇదేనా ప్రజాస్వామ్యం. మూడు రోజుల కిందట మహా సంకల్ప సభలో చంద్రబాబు చెప్పిన మాటలు. నైతిక విలువలకు తనదే పేటెంట్ హక్కు అన్నట్టుగా మాట్లాడుతున్న చంద్రబాసు వైఎస్సార్ సీపీ తరుపున గెలిచి జెడ్పీ పీఠాన్ని అధిష్టించిన నూకసాని బాలాజీని ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలోనే ముందస్తుగా తమ పార్టీలోకి చేర్పించుకోవడం ఏ సిద్ధాంతాలకు ప్రాతిపదిక. ఈ సమయంలో పశువుల సంతలు...కొనుగోళ్లు...బేరసారాలు... వలువలు ఊడిపోతున్న ప్రజాస్వామ్యం నారా సారుకు గుర్తుకు రావేమో. ‘కూతురు’ తప్పు గూట్లో దాచి కోడలు తప్పు ‘నట్టేట’ చాటిన చందంగా బాబు తీరు ఉందని జిల్లా ప్రజలే ఛీత్కరించుకుంటున్నారు. నాడు పార్టీని వీడే ప్రశ్నేలేదు ‘నేను విలువలతో కూడిన రాజకీయాలే చేస్తున్నాను. నాకు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి ముఖ్యం కాదు. అభివృద్ధిని సైతం రాజకీయాలతో ముడిపెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చదు. నేను పార్టీని వీడే ప్రశ్నేలేదు... నాకు పదవిని కట్టబెట్టిన పార్టీలోనే కొనసాగుతా. ఒక వేళ పార్టీని వీడాల్సి వస్తే నాకు పార్టీ ద్వారా వచ్చిన అన్ని పదవులను త్యజించిన తరువాతే వెళ్తా...‘ ఇవి గత ఏడాది అక్టోబర్ 11న మొదటి జెడ్పీ సమావేశం ముగిసిన తరువాత అదే సమావేశం హాలులో జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ మీడియాతో మాట్లాడిన మాటలు. నేడు కోట్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి ఓటుకు నోటు పేరుతో కేసీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని దారుణంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది బాబుపై జరుగుతున్న కుట్ర. అందుకు నిరసనగానే వైఎస్సార్సీపీకి రాజీనామా చేశాను. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ కోటీశ్వరుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలే కదా, ఓటుకు నోటు తప్పని ఎందుకు అనుకుంటారు. పార్టీకి సుశిక్షితులుగా పనిచేసిన వారికి కాకుండా ఎన్నికల సమయంలో కోటీశ్వరులకు సీట్లు ఇవ్వడమంటే దాని అర్థమేమిటి? డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నట్టు కదా.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : తాను విలువలకు కట్టుబడి ఉన్నానని, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ వస్తున్నానని పదేపదే చెబుతూ వచ్చిన జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ఆ విలువలు వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు. బీసీ కార్పొరేషన్ పదవి ఇస్తామని తెలుగుదేశం నేతలు ఆశ చూపడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు గోడ దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గురువారం ఉదయం చంద్రబాబునాయుడి సమక్షంలో తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు. ఓసీకి కేటాయించిన జెడ్పీ ఛైర్మన్ పదవికి ఒక బీసీని ప్రతిపాదించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆయన గుడ్‌బై చెప్పారు. మెజారిటీ ఉన్నా తనను జెడ్పీ ఛైర్మన్ కాకుండా విశ్వప్రయత్నాలు చేసి జెడ్పీటీసీలను కొనుగోలు చేసి, వినని వారిని తప్పుడు కేసుల్లో అరెస్టు చేయించిన విషయాన్ని సైతం విస్మరించి అధికార పార్టీలోనే చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. జెడ్పీ ఛైర్మన్ హోదాలో ఏర్పాటు చేసిన మొదటి జెడ్పీ సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు నూకసాని బాలాజీని ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరించడంతో ఆయన సీరియస్ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను విలువలకు కట్టుబడి ఉన్నానని, ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను వేరే పార్టీలోకి వెళ్తే ప్రస్తుతం ఉన్న పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నీ వదులుకుంటానని తెగేసి చెప్పారు. ఆరు నెలలు గడిచేసరికి పరిస్థితిలో మార్పువచ్చింది. జెడ్పీ పదవిలో కొనసాగేందుకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిస్సిగ్గుగా ద్వారాలు తెరిచారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ను రాత్రి సమయంలో కలిసి చర్చలు జరుపుతూ వచ్చారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిసి వచ్చారు. అయితే తాను పార్టీలో చేరడం కోసం కాదని, జిల్లా అభివృద్ధి కోసమనంటూ బుకాయించారు. వేసవికాలంలో జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న సమయంలో ఏర్పాటు చేసిన జెడ్పీ సమావేశానికి జిల్లా కలెక్టర్‌గాని, జెడ్పీ సీఈవో ఇతర ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. కీలకమైన అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడంలో అర్ధం లేదని భావించిన విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి బాయ్‌కాట్ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న బాలాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తి, తెలుగుదేశం నాయకులతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుకు రావడంతో తెలుగుదేశం నాయకులతో చర్చలు జరిపారు. జెడ్పీ ఛైర్మన్ పదవిపై పార్టీ హామీ ఇవ్వలేదు. భవిష్యత్‌లో బీసీ కార్పొరేషన్ పదవిని ఇస్తామన్న హామీతో పార్టీ మారుతున్నట్లు సమాచారం. పదవి కోసమే పార్టీ మారుతున్నారా అన్న ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇవ్వని నూకసాని, పదవినిస్తే ఎందుకు వద్దంటానని ఎదురు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మీరు పార్టీ మారడం కూడా ఓటుకు నోటుగానే భావించవచ్చా అని ప్రశ్నిస్తే తాను నిజాయతీ గల నాయకుడ్ని అంటూ చెప్పుకున్నారు. తాను జెడ్పీటీసీగా పోటీచేసినా, కందుకూరు ఎంఎల్ఏగా పోటీచేసినా పైసా ఖర్చుపెట్టకుండా గెలిచే సత్తా తనదంటూ మీడియాపై ఫైరయ్యారు. -
ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుల పేర్లను టీడీపీ గురువారం వెల్లడించింది. పార్టీ ఖరారు చేసిన జల్లా అధ్యక్షుల పేర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. - శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా శిరీష నియామకం - విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ద్వారపురెడ్డి జగదీష్ నియామకం - విశాఖ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా వాసుపల్లి గణేష్ కుమార్ నియామకం - విశాఖ రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా పప్పల చలపతిరావు నియామకం - తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పర్వతనేని చిట్టిబాబు నియామకం - పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా తోట సీతారామలక్ష్మి నియామకం - విజయవాడ సిటీ టీడీపీ అధ్యక్షుడిగా బుడ్డా వెంకన్న నియామకం - విజయవాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడిగా బత్తుల అర్జునుడు నియామకం - గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జీవీఎస్ అంజనేయులు నియామకం - ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా దామచర్ల జనార్థన్ నియమాకం - నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీదా రవీచంద్రాయాదవ్ నియామకం - కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శిల్పా చక్రపాణి నియమాకం - కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసులురెడ్డి నియామకం - అనంతరంపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బీకే పార్థసారథి నియామకం - చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జి. శ్రీనివాసులు నియామకం