tenth class spot valuation
-
టెన్త్ స్పాట్.. ఫెయిల్
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాలు వికటించాయి. ముఖ్యంగా సంస్కరణల పేరుతో రూ.కోట్లు ఖర్చు పెట్టి పదో తరగతి పరీక్షల విషయంలో అమలు చేసిన విధానాలు బెడిసి కొట్టాయి. ఈ విద్యా సంవత్సరంలో ఆటోమేషన్ పేరుతో అడ్డదిడ్డంగా ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశారు. అప్పుడు జరిగిన తప్పులను సరిచేసుకోకుండానే అదే ఆటోమేషన్‌ను పదో తరగతి మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) విధులకు కూడా వర్తింపజేశారు. దీంతో సబ్జెక్టులు బోధించని వారికి కూడా స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలు పడ్డాయి. ఉపాధ్యాయులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా పేపర్లు దిద్దాల్సిందేనని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మార్కులు ఏ విధంగా వస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కనీస శిక్షణ లేకుండానే విధులు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగాయి. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనం పది రోజుల్లో (ఏప్రిల్ 16లోపు) పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకనం విధుల్లో చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది 20 వేల మందిని ఆటోమేషన్ ద్వారా నియమించారు. వారికి కేడర్ల ఆధారంగా చేయాల్సిన విధులపై కనీస శిక్షణ కూడా ఇవ్వకుండా మూల్యాంకనం సెంటర్లకు పంపించారు. వాస్తవానికి మూల్యాంకనం ప్రారంభమయ్యే నాటికి సిబ్బంది ఎంపిక, శిక్షణ పూర్తవ్వాలి. కానీ, మంగళవారం కూడా చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లను ఎంపిక చేసి స్పాట్ కేంద్రాలకు పంపినట్లు తెలిసింది. దీనినిబట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనిచేయని ట్యాబులు, ఇంటర్నెట్! ఈ ఏడాది కొత్తగా పదో తరగతి మూల్యాంకనం కేంద్రాల్లోనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.50 లక్షలతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు వేల్యూ చేసిన అనంతరం మార్కులను ట్యాబ్‌లలో నమోదు చేయాలి. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు మరో ట్యాబ్‌లో రెండోసారి నమోదు చేస్తే, అవి లీప్ యాప్‌లో అప్లోడ్ అవుతాయి. కానీ, స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లలో అందుబాటులో ఉంచిన ట్యాబ్‌లు, ఇంటర్నెట్ పనిచేయడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మూల్యాంకనం సాయంత్రం 4 గంటలకల్లా పూర్తవ్వాలి. కానీ, ట్యాబ్‌లు, ఇంటర్నెట్ సక్రమంగా పని చేయకపోవడంతో సోమవారం అర్ధరాత్రి 11 గంటలు దాటినా మార్కుల నమోదు పూర్తికాలేదని తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు దిద్దిన జవాబు పత్రాలను తిరిగి స్ట్రాంగ్ రూములకు తరలించారని సమాచారం. ఇవన్నీ పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
‘టెన్త్ క్లాస్ స్పాట్ వాల్యూయేషన్’ సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా
సాక్షి, విజయవాడ: పదవ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను స్పాట్ మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఎండల తీవత్రను దృష్టిలో పెట్టుకుని మూల్యాంకన విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా సీఎం జగన్ ఆదేశాలతో మూల్యాంకన కేంద్రాల్లోని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలను స్పాట్ మూల్యాంకనం చేస్తున్న 25,000 మంది ఉపాధ్యాయులకు కల్పించిన సౌకర్యాలపై సీఎం జగన్ ఆరా తీశారని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు ఏప్రిల్ 26 వరకు కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాలను సందర్శించాలని తనతో పాటు ఇతర సీనియర్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా స్పాట్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాల పని తీరును ఆయన పరిశీలించారు. ముందుగా గుంటూరు జిల్లా నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్, పల్నాడు జిల్లాలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ను సందర్శించి, మూల్యాంకనం లో పాల్గొన్న ఉపాధ్యాయులందరితో సంభాషించారు. ప్రభుత్వం వారికి అందించిన అన్ని సౌకర్యాలను వ్యక్తిగతంగా తనిఖీ చేశారు. బల్లలు, కుర్చీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి వసతి, టాయిలెట్ల నిర్వహణ తదితరాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ మేరకు అదే సమయంలో ఇతర జిల్లాల్లోని కేంద్రాలను కూడా సందర్శించాలని ప్రవీణ్ ప్రకాష్ సీనియర్ అధికారులను కోరారు. కొన్ని మూల్యాంకన కేంద్రాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని,ప్రస్తుత అవసరాలకు వాటిని మరింత మెరుగు పరిచాల్సి ఉందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కోసం కొత్త పాలసీని రూపొందించేందుకు విశాఖపట్నం, విజయనగరం కేంద్రాలను సందర్శించి తగు ఇన్పుట్స్ తీసుకుంటామని, వీలైనంత త్వరగా కొత్త విధానాలు రూపొందిస్తామని మంత్రి తెలిపినట్లు ప్రవీణ్ ప్రకాష్ ఈ సందర్భంగా తెలిపారు. -
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీపై కన్ను
► పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం ► పదో తరగతి స్పాట్ కేంద్రంగా రాజకీయాలు ► బిజీబిజీగా ఉపాధ్యాయ సంఘాల నేతలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి స్పాట్ కేంద్రంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజకీయానికి తెరతీశారు. 2017 మార్చిలో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో పేపర్లు దిద్దే ఉపాధ్యాయులను సమస్యల పేరుతో పలకరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే కత్తినరసింహారెడ్డి(ఎస్టీయూ), రామస్వామి(ఆర్జేయూపీ), ఎమ్మెల్సీ గేయానంద్(యూటీఎఫ్), మాజీ ఎమ్మెల్సీ(ఎస్టీయూ) పోచంరెడ్డి సుబ్బారెడ్డి స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఏడాదంతే ప్రచారమే.. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంటుంది. మూడు జిల్లాలు కావడంతో అభ్యర్థులు ఏడాది ముందు నుంచే ప్రచారం మొదలు పెడతారు. ఒక్కో జిల్లాలో సుమారు 15 వేల ఓట్లుంటాయి. ప్రతి ఒక్కరినీ కలుసుకునేందుకు ఆ మేరకు సమయం కావాల్సి ఉండడంతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులు.. పీఆర్టీయూ: పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బచ్చల పుల్లయ్య ఎస్టీయూ: సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి ఆర్జేయూపీ: 2011లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన రామస్వామి యూటీఎఫ్: ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్ వైఎస్సార్‌టీఎఫ్: సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీయూ(రెబల్): గత ఎన్నికల్లో ఓడిపోయిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి


