మండలి ఎన్నికకు రెండు నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి బుధవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. బీఎస్పీకి చెందిన ఎ.లక్ష్మ య్య, స్వతంత్ర అభ్యర్థిగా నర్ర భూపతిరెడ్డిలు ఈ నామినేషన్లు దాఖలు చేశారు. మండలి ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 20తో ముగుస్తుందని, 23వ తేదీన ఉపసంహరణ, మార్చి 9న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వివరించారు. శాసన మండలి ఎన్నికల వ్యయంపై ఈసీ ఎలాంటి పరిమితి విధించలేదని స్పష్టం చేశారు. ఈ సమావే శానికి అదనపు కమిషనర్ రామకృష్ణారావు, ఎస్పీ సుదర్శన్‌రెడ్డి, వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.