breaking news
Tamil Nadu farmers
-
ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిపై మాధవన్ ప్రశంసలు
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.. తన సోషల్ మీడియాలో ఓ స్ఫూర్తిదాయక నిజజీవిత కథని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతాప్ మురుగన్ చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రతాప్.. జిల్లాలో వేల సంఖ్యలో పాడుబడ్డ బోర్‌వెల్స్ గమనించారు. ఓవైపు రైతులు నీటి కోసం మరింత లోతుగా బోర్‌వెల్స్ తవ్వుతుంటే ఫలితం ఉండట్లేదు. మరోవైపు వర్షాకాలంలో భారీగా వర్షపు నీరు కాలువలు, డ్రైనేజీల ద్వారా వృథాగా సముద్రంలో కలుస్తోందని కలెక్టర్ గుర్తించారు.(ఇదీ చదవండి: గురుపౌర్ణమి నాడు బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి)దీనికి పరిష్కారంగా జిల్లాలోని 1200కు పైగా పాడుబడ్డ బోర్‌వెల్స్‌ని వర్షపు నీటి సంరక్షణ యూనిట్లుగా మార్చే ప్లాన్ అమలు చేశారు. ఇప్పటికే ఉన్న బోర్వెల్స్నే ఉపయోగించి వర్షపు నీటిని భూమిలోకి చేరేలా ఏర్పాటు చేశారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రాజెక్టు అమలు చేయడంలో స్థానిక ప్రజలని కూడా భాగస్వాములని చేయడం విశేషం. ఇలా తక్కువ ఖర్చులోనే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.తొలి వర్షాకాలం తర్వాతే ఈ ప్రాజెక్టు ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూగర్భజలాల మట్టం ఐదు నుంచి పది అడుగుల వరకు పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన బావుల్లో మళ్లీ నీరు చేరింది. పనిచేయని చేతి పంపులు తిరిగి పనిచేయడం మొదలుపెట్టాయి. రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.విరుదానగర్ జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన ప్రతాప్ మురుగన్.. చిన్నప్పటి నుంచే నీటి విలువను దగ్గర నుంచి తెలుసుకున్నారు. పెరిగి పెద్దయిన తర్వాత ఐఏఎస్‌గా ఈ కార్యక్రమాన్ని మరింత పక్కాగా అమలు చేయడంలో విజయం సాధించారు. ఇక మాధవన్ ప్రశంసలతో ప్రతాప్ మురుగన్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. (ఇదీ చదవండి: ఈ టాలీవుడ్ బోల్డ్ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?) -
స్టాలిన్ భారీ ర్యాలీ
తమిళనాడు : కావేరీ వాటర్ బోర్డు ఏర్పాటు కోసం తమిళపార్టీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నిన్నటివరకూ కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ.. తమిళనాడు ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. శుక్రవారంతో పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడటంతో రాష్ట్ర వేదికగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావేరీ బోర్డు ఏర్పాటు కోరుతూ... డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ శనివారం ముక్కుంబులో భారీ ర్యాలీను ప్రారంభించారు. కావేరీ డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. స్టాలిన్ ప్రారంభించిన ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ముత్తారాసన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌తో పాటు డీఎంకే కార్యకర్తలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ఓ వైపు నుంచి స్టాలిన్ ఈ ర్యాలీని ప్రారంభించగా, మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా ఆయాలూరు నుంచి మరో ర్యాలీని ప్రారంభించారు. ఈ రెండు ర్యాలీలు ఏప్రీల్ 13న కడలూరులో డీఎంకే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కలువనున్నాయి. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయని స్టాలిన్ విమర్శించారు. -
ప్రధాని కార్యాలయం ఎదుట నగ్నంగా ఆందోళన!
వినూత్న ఆందోళనలతో హోరెత్తిస్తున్న తమిళ రైతులు న్యూఢిల్లీ: తమ గోడును కేంద్రానికి వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో తమిళనాడు రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. తాజాగా రైతులు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఎదుట వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. పీఎంవో సహా కీలక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే సౌత్‌బ్లాక్ ఎదుట రైతులంతా నగ్నంగా గుమిగూడి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరువు ఉపశమన ప్యాకేజీ మంజూరు చేయాలని, తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు నెలరోజులుగా తమిళనాడు రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆక్రందనను వినిపించేందుకు వినూత్నరీతిలో అన్నదాతలు ఇక్కడ నిరసనలు చేపడుతున్నారు. గతంలో పుర్రెలు, ఎముకలతో ఆందోళన నిర్వహించి మీడియా దృష్టి ఆకర్షించిన రైతులు.. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2,014.45 కోట్ల సాయాన్ని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.


