breaking news
talari rangaiah
-
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్‌లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్‌దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కుప్పం చేసిన పుణ్యం ఏంటి..? కళ్యాణదుర్గం చేసిన పాపం ఏంటి..?
-
Talari Rangaiah: ఉన్న సంపదను టీడీపీ నేతలే పీక్కుతింటున్నారు ..
-
కూటమి నేతల అరాచకం.. పరిశ్రమలు విలవిల: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్ట్‌లు, కమీషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీపైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్ట్‌లన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఇప్పుడు కియా ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో, ఇక్కడి నుంచి తరలించుకుని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటున్న విజనరీ చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే..పెట్టుబడులు తెచ్చే విధానం ఇదేనా?కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదను విచ్చలవిడిగా పంచుకుని తింటున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, లిక్కర్, ఉద్యోగాలు, కాంట్రాక్టులు.. ఏదీ వదలకుండా దోచేస్తున్నారు. ఇవి చాలదంటూ పరిశ్రమలపైన కూడా కూటమి నేతలు దృష్టి సారించారు. అన్ని పరిశ్రమల్లోనూ తమకే కాంట్రాక్ట్‌లు, కమిషన్లు, ఉద్యోగాలు ఇవ్వాలంటూ దౌర్జన్యాలకు దిగుతున్నారు.రాయలసీమలో పలువురికి ఉపాధిని కల్పిస్తున్న కియా కంపెనీపైనా ఇదే తరహాలో వేధింపులు ప్రారంభించారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా బెదిరించి, బయటకు పంపిస్తున్నారు. ప్రభుత్వం మారగానే గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, తమకు చెందిన వారికే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి కియాను కూడా తరిమేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు సింగపూర్ వంటి దేశాలకు వెళ్ళి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తమ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఆయనకు కనిపించడం లేదు.పథకాలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తులు:పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అనేది గత మూడు దశాబ్దాలుగా వింటున్నదే. కొత్తగా ఇంకో 'పీ' ని చేర్చి ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తెరదీశారు. అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు సాధికారత కల్పించడమే ఎజెండాగా ఉండాలే కానీ వారిని రాజకీయ పార్టీల వారీగా వర్గీకరించడం, కేవలం తన పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని చెప్పడం దుర్మార్గం. రాష్ట్రంలోని ప్రజలందరినీ సమానంగా చూస్తానని, ఎవరిపైనా పక్షపాతం చూపించను అని రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు ఈ రకంగా మాట్లాడటం ద్వారా తన పదవికే మచ్చ తెచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినెలా పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్త పింఛన్ కోసం టీడీపీ నాయకుల ఇళ్లకు కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, యానిమేటర్లు, డీలర్లను తొలగించేశారు. ఏడాదికి 4 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ నాయకులు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను వరుసపెట్టి పీకిపారేస్తున్నారు.నాడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు:వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సీఎంగా సంక్షేమ పథకాల కోసం కేటాయించిన ప్రతి రూపాయి ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ప్రజలను ఆత్మగౌరవంతో బతికేలా వెన్నుదన్నుగా నిలిచారు. పావర్టీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ (పీఐపీ), పావర్టీ రూరల్ అప్రైజల్ (పీఆర్ఏ)ల ద్వారా పేదరికంలో ఉన్న నిజమైన లబ్దిదారులను గుర్తించి సామాజిక అసమానతలు లేకుండా చేశారు. కులాలు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. -
‘నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే’
తాడేపల్లి : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణాలకు దిగారని, మద్యం దుకాణాలపై కమీషనల్ల గుంజుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఇతరులకు వచ్చిన మద్యం షాపుల్ని సైతం లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, కళ్యాణదుర్గంలో ఎక్కడ చూసినా కళ్యాణి వైన్స్ అనే పేరుతోనే మద్యం షాపులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. ఈ రోజు(గురువారం, జూలై 17) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తలారి రంగయ్య.. ‘ దినేష్ అనే సాధారణ వ్యక్తికి వచ్చిన మద్యం షాపుని కూడా లాగేసుకున్నారు. ఒక ప్రజాసంఘాల నాయకుడిని సైతం బెదిరించి తమవైపు తిప్పుకున్న చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది. కళ్యాణదుర్గంలో మూడు వేల బెల్టు షాపులు ఏర్పాటయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పిన సీఎంలను గతంలో చూశాం. కానీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే. గ్రామాల్లో మంచినీరు దొరకటం లేదుగానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. బెల్టుషాపుల కోసం వేలం వేసి రూ.12 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి మద్యం సీసా మీద అధికంగా వసూలు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ జనం చనిపోతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏం పట్టడం లేదుబెల్టు షాపులు పెడితే బెండు తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?, రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తుంటే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ కట్ అయిపోతాయంటూ జనాన్ని భయపెడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.