breaking news
T - hab
-
టీ హబ్‌తో భారత ఆర్మీ ఒప్పందం
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ హబ్ తాజాగా భారత ఆర్మీకి చెందిన సెంట్రల్ కమాండ్‌తో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. రక్షణ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేపడుతున్న స్టార్టప్‌లకు సైన్యంతో కలిసి నేరుగా క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది. భారత రక్షణ రంగాన్ని ఆధునీకరించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు సరికొత్త సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, వాటిని ధ్రువీకరించడానికి ఇది దోహదపడనుంది.భారత ఆర్మీ వెస్ట్రన్ కమాండ్‌తో టీ హబ్‌కు ఇప్పటికే ఉన్న భాగస్వామ్యానికి కొనసాగింపుగా ఈ తాజా ఒప్పందం నిలిచింది. దీంతో కమాండ్ స్థాయిలో రక్షణ దళాలతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన అతికొద్ది జాతీయ సంస్థలలో టీ హబ్ ఒకటిగా చేరింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐడెక్స్ పథకాన్ని అమలు చేస్తున్న 28 సంస్థలలో టీ హబ్ దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందింది.ఇప్పటివరకు 100కు పైగా రక్షణ స్టార్టప్‌లతో పనిచేస్తూ, 70కి పైగా ఛాలెంజ్‌లను పూర్తిచేసింది. ఈ పథకం ద్వారా టీ హబ్ స్టార్టప్‌లు రూ.4.2 కోట్లకు పైగా గ్రాంట్లు, రూ.9 కోట్ల విలువైన ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ డెలివరీల సహకారంతో సుమారు రూ.250 కోట్లకు పైగా వాణిజ్య రక్షణ ఆర్డర్లను సాధించాయి. ఈ భాగస్వామ్యం కింద ఆర్మీ సెంట్రల్ కమాండ్ అందించే నిర్దిష్ట సమస్యలను పరిష్కరించే స్టార్టప్‌లను టీ-హబ్ ఎంపిక చేస్తుంది. స్టార్టప్‌లు, సైనిక భాగస్వాముల మధ్య కార్యక్రమాల సమన్వయాన్ని ఒక సంయుక్త పర్యవేక్షణ కమిటీ పర్యవేక్షిస్తుంది.ఈ సందర్భంగా టీ-హబ్ సీఈవో కవికృత్ మాట్లాడుతూ ‘సాంకేతికతలు క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే వ్యవస్థాపకులకు సైన్యంతో ప్రత్యక్ష సమన్వయం తప్పనిసరి. ఈ ఒప్పందం దానికి మార్గం సుగమం చేస్తుంది. భారతీయ రక్షణ స్టార్టప్‌ల నైపుణ్యంతో పాటు సంక్లిష్ట అవసరాలను తీర్చే సాంకేతికతలను రూపొందించడంలో హైదరాబాద్ సామర్థ్యంపై ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు. దేశీయ సాంకేతికతలను ప్రోత్సహించడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి తెలిపారు. క్షేత్రస్థాయి అవసరాలను తీర్చే స్టార్టప్‌ల ఆవిష్కరణలు సాయుధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తాయని వివరించారు.ఇది కూడా చదవండి: ఓణం హిందూ పండుగ కాదా?.. తెరపైకి కొత్త చర్చ! -
ఫ్రాన్స్‌తో భారత్‌కు విడదీయరాని బంధం
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్‌తో భారత్‌కు విడదీయరాని బంధ ముందని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలున్నా యని, పలువురు ఫ్రెంచ్ జాతీయులు హైదరాబాద్‌లో ఉన్నా రని పేర్కొన్నారు. దేశంలో ఫ్రాన్స్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. అలెగ్జాండర్ జిగ్లర్ శుక్రవారం హైదరా బాద్‌లోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిగ్లర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి చాలా సానుకూల అంశాలు విన్నట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు కార్యకలాపాల్లోనూ ఫ్రాన్స్ కంపెనీ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఫ్రాన్స్ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సానుకూలమైన ఫీడ్‌బ్యాక్ వచ్చిందని పేర్కొ న్నారు. మూడేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతికి అభినందనలు తెలిపారు. ఇక్కడి ఇన్నోవేషన్ వల్లే ఫ్రాన్స్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇన్నోవేషన్ రంగంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందన్నారు. టీ–హబ్‌కు పొగడ్తల వర్షం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ–హబ్‌ను పొగడ్తలతో ముంచె త్తారు. తమ దేశంలోని బోర్డో నగరంతో కలసి హైదరాబాద్‌లో మొబిలిటీ అంశంపై పరస్పర సహకారం అందించుకు నేందుకు, ట్రామ్ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే 50 ప్రముఖ ఫ్రెంచ్ పెట్టుబడిదారుల బృందం రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు అనుసంధానకర్తగా పని చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను జిగ్లర్‌కు మంత్రి వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం, అనుమతుల ప్రక్రియల ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి ఫ్రెంచ్ పెట్టుబడులు వచ్చేందుకు సహకరించాలన్న మంత్రి విజ్ఞప్తికి జిగ్లర్ సానుకూలంగా స్పందించారు. ఫ్రెంచ్ నుంచి రానున్న పెట్టుబడిదారుల బృందానికి తమ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ, ఫార్మా రంగాల్లో ఫ్రెంచ్ పెట్టుబడులను ఆశిస్తోందని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
యువతకు ఇలాంటి వేదికలు అవసరం
దేశ విదేశాల్లోని యువ పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు జీఈఎస్ అనేది ఒక వేదిక మాత్రమేనని.. దీనిని ఉపయోగించుకుని ఏ స్థాయికి వెళతారన్నది వారి సమర్థతపై ఆధారపడి ఉంటుందని అమెరికా ప్రభుత్వ యువజన వ్యవహారాల గ్లోబల్ అడ్వైజర్ ఆండీ రబెన్స్ పేర్కొన్నారు. భారతీయుల పారిశ్రామికతత్వం అద్భుతమని.. టీ–హబ్ ద్వారా యువతకు భారీగా అవకాశాలు వస్తున్నాయని కొనియాడారు. పదేళ్లుగా అమెరికా ప్రభుత్వ యువజన వ్యవహారాల సలహాదారుగా వివిధ ఖండాల్లో పనిచేసిన రబెన్స్.. జీఈఎస్ కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ.. –సాక్షి, బిజినెస్ బ్యూరో సాక్షి: ఈ పారిశ్రామిక సదస్సు వల్ల యువతకు కొత్త అవకాశాలేమైనా వస్తాయా? రబెన్స్: తప్పకుండా వస్తాయి. నేను ఇండియాకు ఇంతకుముందు కూడా కొన్నిసార్లు వచ్చా. యువత సమస్యలేంటి..? ఎలా పరిష్కరించగలమన్నది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించా. ఇక్కడి (భారత) యువతకు పారిశ్రామికవేత్తలవ్వాలనే ఆసక్తి అధికం. కానీ సొంత వ్యాపారాలు సృష్టించుకోవాలన్నా, ఉన్న వ్యాపారాల్ని వృద్ధి చేసుకోవాలన్నా.. నిధుల సమీకరణ, తగిన మార్గదర్శకత్వం, అవసరమైన వారితో సంబంధాల వంటివి అవసరం. అవి అంది పరిశ్రమలు సాకారమైతే మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. భారీగా పెట్టుబడులు రావటానికి, ఎంవోయూలు జరగటానికి ఇది బిజినెస్ సదస్సు కాదు. దీని ద్వారా మీరేం సాధించాలనుకున్నారు? అనుకున్నది జరుగుతోందా? రబెన్స్: అక్షరాలా జరుగుతోంది. అసలు మేం సాధించాలనుకున్నదల్లా.. పారిశ్రామికవేత్తలకు, ప్రత్యేకించి మహిళలకు కావాల్సిన వేదికను, వారి పరిశ్రమలకు తగిన అనుకూల వ్యవస్థను (ఎకో సిస్టమ్) సృష్టించటమే. ఈ సదస్సులో పాల్గొన్న వారిలో మెజారిటీ మహిళా పారిశ్రామికవేత్తలే. వారి వ్యాపారాల విస్తరణకు కావాల్సిన నిధులను సమీకరించడానికి, వారి ఆలోచనలతో మరిన్ని సాధించటానికి.. వారిని పెట్టుబడిదారులతో అనుసంధానించాలనుకున్నాం. అది జరుగుతోంది. మరి ఇండియాలో పరిశ్రమల అనుకూల వ్యవస్థ ఉందని భావిస్తున్నారా? రబెన్స్: తప్పకుండా! అద్భుతమైన స్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో టీ–హబ్‌ను చూశాను. ఈ ఇంక్యుబేటర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయికి విస్తరిస్తున్నారు. ఇది తప్పకుండా త్వరలోనే సాకారమవుతుంది. నాకు అమెరికాలోను, ఇక్కడ చాలామంది భారతీయ మిత్రులున్నారు. వారిలో దూసుకుపోయే తత్వం, పారిశ్రామిక ఆకాంక్షలు నాకు అద్భుతంలా కనిపిస్తుంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొంత మార్గదర్శకత్వం అవసరమని అనిపిస్తుంది. అమెరికన్ల తరహాలో ‘అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగేలా చేయటమెలా..?’అనే రీతిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేస్తున్న పనిలో లోటుపాట్లను గుర్తించి, దిద్దుకునే మార్గాలను అన్వేషించటం, మనకున్న పరిమితమైన, విశ్వసనీయమైన వనరులతోనే ఇవన్నీ చేయటం వంటి విషయాల్లో కొంత మార్గదర్శకత్వం కావాలి. సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో చాలామంది ఇక్కడి పరిస్థితుల్ని చూడటానికి వచ్చామని.. కావాల్సిన వనరులను గుర్తించి, సంబంధీకులతో సంప్రదిస్తున్నామని చెప్పారు. మరి ఈ సంబంధాలు తదుపరి దశకు వెళతాయా? ఎంత సమయం పట్టొచ్చు? రబెన్స్: తదుపరి దశకు వెళతాయా..? వెళితే ఎప్పుడనేది నిజంగా వాళ్ల సమర్థత మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అలాంటి సంబంధాలు ఏర్పర్చుకోవటానికి కావాల్సిన వాతావరణాన్ని మేం సృష్టించాం. వేదికను ఏర్పాటు చేశాం. ఎంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల్ని సాధిస్తారు.. ఎంత మంది పెట్టుబడిదారులు తమకు తగ్గ వెంచర్లను వెతుక్కుని పెట్టుబడులు పెడతారనేది వారు చేసే కృషిపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అమెరికా, కెన్యా, టర్కీ, యూఏఈ, మొరాకో తదితర దేశాల్లో గ్లోబల్ సదస్సులు నిర్వహించాం. అక్కడి పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల కోసం ఆయా సదస్సుల వేదికపై ప్రయత్నించారు. చాలామంది విజయం సాధించారు. అమెరికాగానీ, అమెరికన్ ఇన్వెస్టర్లు గానీ ఇండియాలో ఏయే రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? రబెన్స్: ఈ సదస్సుకు చాలా మంది అమెరికన్ ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ఇక్కడ చాలా అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలూ ఉన్నాయి. సదస్సు కోసం ఎంచుకున్న ప్రాధాన్య రంగాలు.. హెల్త్‌కేర్– లైఫ్ సైన్సెస్, డిజిటల్ ఎకానమీ – ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ – ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీడియా–ఎంటర్టైన్మెంట్.. ఈ నాలుగింటిపైనా వారు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో 130 కోట్ల జనాభా ఉన్నారు. అమెరికాలో ఇందులో 25 శాతం జనాభా ఉంది. ఎన్నెన్నో కొత్త ఆలోచనలు, అవకాశాలు ఇద్దరికీ ఉన్నాయి. ఇండియన్లు అటు అమెరికా సంస్థలతో బంధాలేర్పరచుకుని అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇటు అమెరికా సంస్థల నుంచి పెట్టుబడులు పెడుతున్నారు. వచ్చే కొన్నేళ్ల పాటు యువతకు ఏ రంగాలు బాగుండొచ్చు? రబెన్స్: నా ఉద్దేశం ప్రకారం యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి ఇష్టపడుతున్నారు. ఇక ఏ రంగమనేది వారి అర్హతలు, ఫోకస్‌పైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకుంటేనే రాణించగలుగుతారు. అందులో కొన్ని లోపాలుండొచ్చు. వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్లాలి. పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో సదస్సుతోనే సరిపెడతారా? తదుపరి చర్యలేమైనా ఉంటాయా? రబెన్స్: ఈ సదస్సు చాలా చిన్నది. ఎందుకంటే 130 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియాలో ఇక్కడకు వచ్చింది కేవలం 500 మంది పారిశ్రామికవేత్తలు. భారత పారిశ్రామికవేత్తల్లో సాధికారత తేవటానికి పెను ప్రయత్నాలు జరగాల్సి ఉంది. వారిని తగిన గురువులతో అనుసంధానించటం, నిధుల లభ్యత కల్పించటం, భాగస్వామ్యాలు ఏర్పాటు చేయటం వంటివి అవసరం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలేమైనా చేపడుతున్నారా? రబెన్స్: మా ఎంబసీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ల ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఎప్పటికప్పుడు నిపుణుల్ని పిలిపించి మార్గదర్శకత్వం అందిస్తోంది. ప్రత్యేక అవకాశాలు కల్పించటం, పలువురితో నెట్వర్కింగ్ ఏర్పాటు చేయటం వంటివి జరుగుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం అమెరికాకు వచ్చిన భారత పారిశ్రామికవేత్తలైతే నిజంగా ఇక్కడ కింది స్థాయిలో ఏం జరుగుతోందనేది చెప్పగలరు. అసలు అమెరికాలో, ఇక్కడ ఒకే రకమైన సవాళ్లు ఉండవకపోవచ్చు. ఇక్కడున్న కొన్ని సమస్యలు ప్రత్యేకమైనవి కావచ్చు. కాకపోతే పరస్పర సహకారం, నెట్వర్కింగ్ ద్వారా అనుకున్నది సాధించొచ్చు. -
టీహబ్‌తో పరిశ్రమలకు ప్రోత్సాహం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీహబ్‌తో పారిశ్రామిక వేత్తలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోందని అమెరికా ప్రభుత్వ మధ్య, దక్షిణ ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అంజెలా ఆంగ్లర్ కొనియాడారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..రెండేళ్లలో హైదరాబాద్‌లో 27శాతం పెట్టుబడులు పెరగటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల క్రితం తాను వచ్చినప్పడు ఉన్న హైదరాబాద్‌కు ఇప్పటి హైదరాబాద్‌కు ఎంతో తేడా ఉందని..ఇప్పుడు నగరం గణనీయమైన అభివృద్ది సాధించిందని ఆమె చెప్పారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం...తదనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. భారత, అమెరికా సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని...రెండు ప్రభుత్వాల సంప్రదింపులతోనే ఇది సాధ్యమవుతోందని చెప్పారు.


