breaking news
Syrups
-
వామ్మో దగ్గు మందు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోల్డ్రిఫ్ కేసులో ఇప్పుడు సంచలన విషయం ఒకటి బయటపడింది. చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్‌ను అప్రమత్తం చేసింది. ఆ విభాగం కాంచీపురంలోని కోల్డ్రిఫ్ దగ్గు మందు(Coldrif Syrup) తయారైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్‌లో(Sresan Pharmaceuticals) అక్టోబర్ 1, 2 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 16 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ తయారీని చూసి అధికారులు సైతం విస్తోపోయారట!. ఎన్డీటీవీ ఇచ్చిన కథనం ప్రకారం.. తయారీ కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఆ యూనిట్లో గ్యాస్ స్టవ్‌లపైనే రసాయనాలను వేడి చేస్తున్నారు. తుప్పుపట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు. గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారే ఉన్నారు. వీటికి తోడు.. స్వచ్ఛత పరీక్షలు జరపకుండానే సిరప్‌ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్ఈపీఏ(HEPA) వ్యవస్థ(అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌ను 99.97% వరకు తొలగించగలిగే శుద్ధి వ్యవస్థ)లు లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచిందట. అలాగే.. చెన్నైలోని రెండు ప్రముఖ కంపెనీల నుంచి కెమికల్స్‌ను నగదు రహిత లావాదేవీల ద్వారా ఇండస్ట్రీయల గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రొపైలీన్ గ్లైకోల్ లాంటి కీలక పదార్థాన్ని ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అన్నింటికి మించి.. డైఈథిలీన్ గ్లైకాల్(Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా సిరప్‌లలో కలిపారు.SR-13 డేంజర్ బ్యాచ్.. కోల్డ్రిఫ్ కఫ్ సిరప్.. SR-13 బ్యాచ్ ఈ యూనిట్లోనే ఈ ఏడాదిలోనే తయారయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఈ సిరప్లు.. మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్లోకి వెళ్లాయి. అయితే.. ఇందులో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. ఈ పదార్థం.. కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు–సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించారని తెలుస్తోంది. ఫార్మాకోవిజిలెన్స్ లేకపోవడం, అనుభవం లేని సిబ్బంది, నీటి స్వచ్ఛత పరీక్షలు లేకపోవడం, వెంటిలేషన్,, పెస్ట్‌కంట్రోల్ లేకపోవడం.. ఇలా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ఏర్పాటు చేసింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు.. శ్రేసన్ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం: ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసింది. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్ఫర్ చేసింది. సిరప్‌ను రిఫర్ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: సిరప్‌తో చనిపోతే.. డాక్టర్ తప్పెలా అవుతుంది? -
సిరప్లు తాగి కిడ్నీ సమస్యలతో చిన్నారులు మృతి.. టానిక్లపై బ్యాన్!
ఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిరప్లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్ సయారిల్ మన్సూర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. ఇండోనేషియాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. The Indonesian government has announced a ban on all syrup and liquid medicine prescription and over-the-counter sales, after the deaths of nearly 100 children from acute kidney injury this year https://t.co/0rVL5yYGwg — RTÉ News (@rtenews) October 19, 2022 -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
-
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
మలక్‌పేట: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చిన్నపిల్లల న్యూట్రిషన్ ఫుడ్, సిరప్లు తయారు చేస్తున్న కేంద్రంపై ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల విలువైన న్యూట్రిషన్ సిరప్లు, కెమికల్స్ కలిపిన ద్రావణం, ముడి సరుకులు, యంత్ర సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చైతన్యకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మూసారంబాగ్ డివిజన్, ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీలోని ఓ ఇంట్లో అనుమతులు లేకుండా ఆహార పానీయాలు, సిరప్లు, న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు. గాబ మనీశ్ అనే వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ హిమాలయ లైఫ్‌లైన్ పేరుతో గత 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నకిలీ సిరప్లు తయారు చేస్తూ ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దాదాపు 43 రకాల ఫ్లేవర్స్‌తో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. 2012లో వీటికి లైసెన్స్ లీసుకున్నట్లు పత్రాలు ఉన్నా, రెన్యువల్ చేయించుకోలేదని, దీనిపై విచారణ చేపడుతామన్నారు. ఈ ఉత్పత్తులపై ఎలాంటి హెచ్చరికలు, సూచనలు లేవని, వీరు తయారు చేస్తున్న సిరప్‌లను తెలిసిన వ్యక్తుల ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న సరుకుతో పాటు నిందితుడు మనీశ్‌ను మలక్‌పేట పోలీస్‌లకు అప్పగించారు. దాడుల్లో ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ మోహన్ కుమార్, మలక్‌పేట ఎస్హెచ్ఓ గంగా రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ లు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, రమేశ్, గోవింద్ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. మనీశ్ తయారు చేస్తున్న ఉత్పత్తుల శాంపిల్స్‌ను ఫుడ్ ఇన్స్పెక్టర్ సేకరించారు. తయారీ కేంద్రానికి లేబర్, జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్, లేవని సమాచారం. -
ఎంత ఘాటు ప్రేమయో!
తిండి గోల చూడటానికి చిన్నగా ఉన్నా, రుచికి మాత్రం ఘాటే. కొన్ని వంటకాలలో అవి పడకపోతే రుచించదు. అవే మిరియాలు. రాములోరి పానకంలో మిరియాల పొడి పడలేదా... ఇక అది పానకం కాదు... కల్లుకిందే లెక్క! చక్రపొంగలిలో, దధ్యోదనంలో, తిరుమలేశునికి నివేదించే పులిహోరలో పంటికింద మిరియాలు తగిలితేనే పసందు. బ్లాక్ పెప్పర్‌గా ఆంగ్లేయులు పిలుచుకునే మిరియాలకు ఓ స్పూను జీలకర్ర చేర్చి, వాటిని కచ్చాపచ్చాగా దంచి, ఓ స్పూను నేతిలో వేసి వేగించామా... ఎంత జటిలమైన జలుబూ ఎగిరిపోవాల్సిందే! ఈ క్రోసిన్లు, కోల్డారిన్లు రాకముందు పడిశం పడితే అదే పెద్ద మందు. అంతేనా.. అజీర్తితో నోటికి అరుచిగా అనిపించినప్పుడు చిటికెడు ఉప్పూ మిరియాల పొడీ జీలకర్ర, చిన్న అల్లంముక్క కలిపి నేతిపోపు పెట్టి మొదటి ముద్దలో తింటే... ఆకలి... అని గెంతవలసిందే ఇక! మిరియాల చారెడితే ఎంతదూరంలో ఉన్నా గుబాళిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నీళ్లలో కొన్ని మిరియాలు, చక్కెర కలుపుకుని తాగితే జ్వరం తొందరగా తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.. -
షర్బత్‌లతో జీసీసీ ఖుషీ
ఇప్పటికే నన్నారీకి గిరాకీ సరికొత్తగా మార్కెట్లోకి ‘మారేడు’ విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ)కి షర్బత్‌లు ఆదరణ తెచ్చిపెడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఔషధ గుణాల నన్నారి (సుగంధిపాలు) షర్బత్‌కు అనూహ్య డిమాండ్ వచ్చింది. 2015లో 10 వేల నన్నారి బాటిళ్లను అమ్మాలనుకుంటే ఏకంగా లక్ష బాటిళ్లు అమ్ముడైపోయాయి. దీంతో అలాంటి ఔషధ లక్షణాలున్న మరో సమ్మర్ డ్రింకుకు జీసీసీ శ్రీకారం చుడుతోంది. దానికి మారేడు (బిళ్వ) షర్బత్‌గా నామకరణం చేసింది. దీనిని ఈ నెల 29న రాజమండ్రిలో విడుదల చేయనుంది. మారేడు పండ్ల గుజ్జు నుంచి దీనిని తయారు చేస్తారు. ఈ మారేడు షర్బత్‌లో మధుమేహం, డయేరియా, అల్సర్‌ను నయం చేయడంతోపాటు బరువును తగ్గించే గుణం ఉందని, మలబద్ధకాన్ని నివారించే లక్షణాలున్నాయని చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో మారేడు చెట్లు అధికంగా ఉన్నాయి. షర్బత్ తయారీకి అక్కడ నుంచి 50 క్వింటాళ్ల మారేడు పండ్లను జీసీసీ కొనుగోలు చేసి ఉంచింది. కిలోకు ఎనిమిది బాటిళ్ల మారేడు షర్బత్ వస్తుంది. చిత్తూరులో ఉన్న తేనె ప్రాసెసింగ్ యూనిట్లోనే నన్నారి షర్బత్ తయారవుతోంది. కొత్త మారేడు షర్బత్‌ను కూడా అక్కడే తయారు చేస్తున్నారు. త్వరలో రాజమండ్రి కంబాలచెరువులో ఉన్న తేనె ప్లాంట్‌లోనే ఈ షర్బత్‌ను తయారు చేయడానికి రూ.10 లక్షలు వెచ్చించి యంత్ర పరికరాలను ఆధునీకరిస్తున్నారు. ఇప్పటిదాకా నన్నారి, మారేడు షర్బత్‌లను ఏ ఇతర కంపెనీలు తయారు చేయడం లేదు. 750 మి.లీ. బాటిల్ ధరను రూ.100లుగా నిర్ణయించారు. నన్నారి కూడా ఇదే ధరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం రెండు లక్షల నన్నారి సీసాలు అమ్ముడవుతాయని జీసీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.


