breaking news
Swachhata Award
-
నిజాయితీపరులకు చౌకీదార్‌ను: మోదీ
కురుక్షేత్ర: దేశంలో అవినీతిని అంతం చేసేం దుకు తమ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అవినీతిపరులకు తనతో సమస్య ఉందన్న ఆయన.. నిజాయితీపరులు మాత్రం కాపలా దారు (చౌకీదారు)గా తనను నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చ డంలో గ్రామీణ మహిళల నాయకత్వ పాత్రను గుర్తించే కార్యక్రమం ‘స్వచ్ఛ్‌శక్తి–2019’ మంగళవారం కురుక్షేత్రలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. హర్యానాలోని అవినీతిపరులపై ప్రస్తుతం సాగుతున్న దర్యాప్తులతో కొందరు కలవరం చెందుతున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మహా కూటమిని కల్తీ కూటమి (మహా మిలావత్)గా అభివ ర్ణించిన ఆయన.. ‘కల్తీ కూటమిలోని నేతలంతా కలిసి కోర్టులను, మోదీని, దర్యాప్తు సంస్థలను దూషించడం, బెదిరించడంలో పోటీలు పడు తున్నారు. కానీ, ఈ చౌకీదారు వారి దూష ణలు, బెదిరింపులకు అదరడు బెదరడు, ఆగ డు, లొంగడని మీకు తెలుసు. దేశానికి పట్టిన అవినీతి మరకలు, బురదను తొలగించే శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. అందుకు మున్ముందు కూడా మీ ఆశీస్సులు కావాలి’ అని ప్రధాని మోదీ కోరారు. -
కలెక్టర్ అమ్రపాలికి స్వచ్ఛతా అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేసింది. స్వచ్ఛత విషయంలో ఉత్తమ పనితీరు కనబర్చిన విద్యాసంస్థలకు, మోడల్ గ్రామాలను తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డులు అందజేసింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లాలో శంభునిపల్లి గ్రామాన్ని, మెదక్ జిల్లాలో ముజ్రంపేట గ్రామాన్ని స్వచ్ఛత పాటించడంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు ఆ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, భారతి హోళీకేరికు ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులు అందజేశారు.