breaking news
Suzuki Motor Corporation
-
పెళ్లితో మలుపు తిరిగిన జీవితం: దిగ్గజ వ్యాపారవేత్తగా..
దిగ్గజ పారిశ్రామిక వేత్త 'ఒసాము సుజుకి' (Osamu Suzuki) తన 94ఏళ్ల వయసులో ఈ రోజు (డిసెంబర్ 25) తుదిశ్వాస విడిచారు. జపనీస్ వ్యాపారవేత్త.. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అయిన ఈయన 2021లో పదవీ విరమణ చేశారు. ఇంతకీ ఈయన ప్రస్థానం ఎలా మొదలైంది? సుజుకి కంపెనీలోకి ఎలా వచ్చారు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.పెళ్లితో మలుపు తిరిగిన జీవితం1930 జనవరి 30న మత్సుడా.. షుంజో దంపతులకు జన్మించిన ఒసాము.. 1953లో చువో యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఆ తరువాత బ్యాంకులో పనిచేశారు. అయితే 'మిచియో సుజుకి' (Michio Suzuki) మనవరాలు 'షోకో సుజుకి' (Shoko Suzuki)ని వివాహం చేసుకోవడంతో ఈయన జీవితం మలుపు తిరిగింది.సుజుకి కుటుంబంలో వారసులు లేకపోవడం వల్ల మిచియో సుజుకి.. ఒసాము కుటుంబంలో తన మనవారికి వివాహం చేశారు. జపనీస్ ఆచారాన్ని అనుసరించి ఒసాము.. సుజుకి ఇంటిపేరును స్వీకరించారు. దీంతో ఒసాము మత్సుడా.. ఒసాము సుజుకి అయ్యారు.జూనియర్ మేనేజ్మెంట్ నుంచి డైరెక్టర్ స్థాయికిఒసాము సుజుకి 1958లో సుజుకి మోటార్ కార్పోరేషన్లో చేరారు. కంపెనీలో జూనియర్ మేనేజ్మెంట్ పోస్టులతో సహా వివిధ విభాగాల్లో పనిచేస్తూ.. 1963లో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 2000లో సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేపట్టారు.సుజుకి మోటార్ కార్పోరేషన్ అధిపతిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన.. ఒసాము సుజుకి ప్రపంచ ఆటో పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతి తక్కువ కాలంలోనే సుజుకి కార్పొరేషన్‌ను ప్రపంచంలోని అతి పెద్ద చిన్న కార్ల తయారీదారులలో ఒకటిగా మార్చారు. చిన్న కార్ల మార్కెట్‌ను విస్తరించడం ద్వారా సుజుకి కంపెనీ గణనీయమైన పురోగతిని సాధించింది. సుజుకి కంపెనీని భారతదేశంలోని తీసుకొచ్చిన ఘనత కూడా ఒసాము సొంతం.యూరోపియన్ మార్కెట్లోకి ప్రవేశంసుజుకి మోటార్ కార్పోరేషన్ ఉనికిని విస్తరిస్తూ.. విదేశాలలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ప్రారభించారు. ఇలా ఏర్పడిన ప్లాంట్లలో మొదటిది థాయిలాండ్‌లో ఉంది. ఆ తరువాత ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్లలో కూడా కంపెనీ ప్లాంట్స్ ఏర్పాటు అయ్యాయి. అదే సమయంలో జనరల్ మోటార్స్‌తో కలిసి ప్రయాణం మొదలు పెట్టిన.. సుజుకి కార్పొరేషన్‌ను యూరోపియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. జపాన్‌కు మాత్రమే పరిమితమైన సంస్థను ఒసాము నలుదిశలా వ్యాపింపజేశారు.31 దేశాలలో 60 ప్లాంట్లుఒసాము సుజుకి సారథ్యంలో ఎదిగిన కంపెనీ 21వ శతాబ్దం ప్రారంభం నాటికి 31 దేశాలలో 60 ప్లాంట్లను కలిగి ఉంది. సుమారు 190 దేశాలలో విక్రయాలను సాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీ చిన్న కార్ల విభాగంలో మాత్రమే కాకుండా.. టూ వీలర్ విభాగంలో కూడా ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తోంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!పారిశ్రామిక రంగంలో ఒసాము సుజుకి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్'తో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం.. సితార ఏ పాకిస్తాన్ అవార్డును ప్రధానం చేసింది. ఓ బ్యాంకు ఉద్యోగి స్థాయి నుంచి ప్రపంచమే గుర్తించేలా ఎదిగిన 'ఒసాము'.. పారిశ్రామిక రంగంలో ఓ ధ్రువతార అనే చెప్పాలి. -
మారుతీ చేతికి గుజరాత్ ప్లాంట్
న్యూఢిల్లీ: మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీకి వాటాదారులు అనుమతించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పార్టీ లావాదేవీకింద సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకుగాను రెండు ప్రత్యేక అంశాలపై పోస్టల్ బ్యాలట్ ద్వారా మారుతీ గత నెలలో వాటాదారుల నుంచి అనుమతిని కోరింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం(సంబంధిత పార్టీ లావాదేవీ)తోపాటు.. నగదుకాకుండా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల కేటాయింపుపై ఓటింగ్‌కు తెరతీసింది. ఈ రెండు అంశాలకూ వాటాదారుల నుంచి 98 శాతానికిపైగా అనుకూలంగా ఓట్లు లభించినట్లు మారుతీ తాజాగా వెల్లడించింది. గత నెలలో రూ. 12,841 కోట్లకు ఎస్ఎంజీని కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకీ దాదాపు రూ. 10,241 ధరలో మొత్తం 1.23 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదముద్ర వేసింది. వెరసి ఎస్‌ఎంజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకునే బాటలో ప్రిఫరెన్షియల్ జారీకి మారుతీ బోర్డు తెరతీసింది. ఈ లావాదేవీతో మారుతీలో ఎస్‌ఎంసీకిగల వాటా 56.4 శాతం నుంచి 58.28 శాతానికి బలపడనుంది. మరోవైపు ఎస్ఎంజీ మారుతీకి పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించనుంది. -
జపాన్‌లో ప్రధాని మోదీ: పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా..
Narendra Modi Japan Tour: భారతదేశాన్ని ఆధునికీరించే సంస్కరణలను ప్రధాని మోదీ తీసుకువస్తున్నారు. పిఎం మోదీ స్వయం-విశ్వాస దీక్షకు జపాన్ కంపెనీలు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి అని సుజుకీ మోటర్ కార్పొరేషన్ చైర్మన్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ పేర్కొన్నారు. క్వాడ్ సదస్సు, ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి వరుసభేటీలు అవుతున్నారు. ముందుగా నోబుహిరో ఎండోతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. జపానీస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ దిగ్గజం ఎన్ఈసీ కార్పొరేషన్‌కు హెడ్ ఆయన. భారతదేశ సంస్కరణల పథాన్ని హైలైట్ చేస్తూ.. డిజిటల్ లెర్నింగ్, ఫిన్‌టెక్, ఇన్ఫ్రా మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల వంటి రంగాలలో అవకాశాల గురించి ఆయన మాట్లాడారు అంటూ ప్రధాని కార్యాలయం ట్విటర్ హ్యాండిల్ వివరాలను పోస్ట్ చేసింది. అదే విధంగా భారత్‌లో టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎన్ఈసీ అందిస్తున్న సేవలకు.. ప్రత్యేకించి చెన్నై-అండమాన్ నికొబార్‌లో, కొచ్చి-లక్షద్వీప్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. "PM Narendra Modi met Chairman of NEC Corporation Dr. Nobuhiro Endo in Tokyo. Appreciated NEC’s role in India’s telecommunication sector and discussed opportunities in new and emerging technologies in India," tweets MEA Spokesperson Arindam Bagchi. pic.twitter.com/9D3DmMeQvC — ANI (@ANI) May 23, 2022 యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానైతోనూ మోదీ భేటీ అయ్యారు. టెక్స్టైల్స్ తయారీ కేంద్రంగా, ప్రత్యేకించి టెక్స్టైల్ తయారీలో సాంకేతికతలను ఉపయోగించుకునే దిశగా భారతదేశ ప్రయాణంలో మెరుగైన భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి యునిక్లో సానుకూలంగా స్పందించింది. PM Modi interacts with Tadashi Yanai, Chairman, President and CEO of UNIQLO in Tokyo "Mr. Yanai appreciated the entrepreneurial zeal of the people of India. PM Modi asked Mr. Yanai to take part in the PM-Mitra scheme aimed at further strengthening the textiles sector," says PMO. pic.twitter.com/Xelu0qVN47 — ANI (@ANI) May 23, 2022 భారతదేశంలో ఉత్పత్తి & రిటైల్ పరిశ్రమలో ఎలా పెట్టుబడి పెట్టాలనే దాని గురించి మేము చర్చించాం. ప్లాంట్ నుండి డిజైన్ నుండి ఫాబ్రిక్ వరకు ఎండ్-టు-ఎండ్ ఉత్పత్తులపై దృష్టి సారించగలం. భారతదేశంలో భారత ఐటీ ప్రతిభ అద్భుతమైనది. కాబట్టి, సానుకూలంగానే మేం ప్రధాని మోదీకి సమ్మతిని తెలిపాం అని యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానై వెల్లడించారు. Tokyo | PM Modi is bringing reforms which are changing India into a modern landscape. The self-reliance initiative of PM Modi is being strongly supported by Japanese companies: Toshihiro Suzuki, Chairman & President, Suzuki Motor Corp pic.twitter.com/OK190xenHh — ANI (@ANI) May 23, 2022 #WATCH Prime Minister Narendra Modi meets Osamu Suzuki, Adviser, Suzuki Motor Corporation in Tokyo pic.twitter.com/kJsgkA0Eun — ANI (@ANI) May 23, 2022 -
టయోటా, సుజుకీ జట్టు
టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908 డాలర్లు, జపాన్ కరెన్సీ విలువ పరంగా 96 బిలియన్ యెన్) టయోటా కైవసం చేసుకోనుంది. ఇదే క్రమంలో సుజుకీ, టయోటాలో 454 డాలర్లు (48 బిలియన్ యెన్) పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీలో ఉండే భారీ వ్యయాలను తట్టుకోవడం కోసం ఇరు సంస్థలు జట్టుకట్టాయి. 2017లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా.. సుజుకీ బలంగా ఉన్న భారత మార్కెట్లో రెండు సంస్థలు పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. -
భారత్‌లో సుజుకీ 2 కోట్ల కార్లు...
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) తాజాగా భారత్‌లో మొత్తంగా 2 కోట్ల యూనిట్ల వాహనాలను తయారు చేసినట్లు ప్రకటించింది. జపాన్ తర్వాత భారత్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నట్లు తెలిపింది. ఇండియాలో 1983 డిసెంబర్లో కార్యకలాపాలు ప్రారంభించామని, 34 ఏళ్ల 5 నెలల కాలంలో 2 కోట్ల యూనిట్ల మైలురాయిని అందుకున్నామని తెలిపింది. జపాన్‌లో ఈ మార్క్‌కు చేరుకోవడానికి 45 ఏళ్ల 9 నెలలు పట్టిందని తెలిపింది. ప్రస్తుతం ఎస్ఎంసీకి.. మారుతీ సుజుకీ ఇండియాలో 56.21% వాటా ఉంది. ఆల్టోనే టాప్..: భారత్‌లో ఆల్టో కార్లను ఎక్కువగా తయారు చేశామని, 2 కోట్ల వాహనాల్లో 31.7 లక్షలు ఇవేనని కంపెనీ తెలిపింది. ఆల్టో తర్వాత ‘మారుతీ 800’ 29.1 లక్షలు, వేగనార్ 21.3 లక్షలు, ఓమ్ని 19.4 లక్షల యూనిట్లు, స్విఫ్ట్ 19.4 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. మారుతీ సుజుకీ ప్రస్తుతం 3 ప్లాంట్లలో 16 మోడళ్లను తయారు చేస్తోంది. -
మైలేజీ పరీక్షలో తేడాలు..సుజుకీ సీఈఓ రాజీనామా
♦ వినియోగదారులకు క్షమాపణ చెప్పిన సుజుకీ కంపెనీ ♦ డెరైక్టర్ల వేతనాల్లో కోత; కొందరి తొలగింపు టోక్యో/న్యూఢిల్లీ: వాహనాల మైలేజీ పరీక్షల్లో మోసానికి పాల్పడ్డారనే వివాదం నేపథ్యంలో... జపాన్ కార్ల కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ సీఈఓ, చైర్మన్ ఒసాము సుజుకీ తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. డెరైక్టర్ల బోర్డులో చైర్మన్‌గా మాత్రం కొనసాగుతారు. ఈ వివాదం కారణంగా డెరైక్టర్ల వేతనాల్లో కోత విధించామని కూడా కంపెనీ తెలియజేసింది. రిప్రంజటేటివ్ డెరైక్టర్లు, డెరైక్టర్లకు గత ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన బోనస్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నామని, సీనియర్ మేనేజింగ్ ఆఫీసర్స్, మేనేజింగ్ ఆఫీసర్స్‌కు బోనస్‌లో 50 శాతం కోత కోస్తున్నామని తెలిపింది. జపాన్‌లో వాహనాల కాలుష్యం, మైలేజీ పరీక్షలకు సంబంధించి అక్కడి లాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టూరిజం శాఖ (ఎంఎల్టీ) విధించిన నిబంధలనకు... వాస్తవంగా సుజుకీ అనుసరిస్తున్న నిబంధనలకు తేడాలున్నట్లు బయటపడింది. దీన్ని సుజుకీ కూడా అంగీకరించి... క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 16 మోడళ్లకు సంబంధించి వివాదం రేగటంతో వాటన్నిటిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ‘‘ఈ వివాదం జపాన్‌కే పరిమితం. జపాన్ వెలుపల విక్రయించే మోడళ్లకు ఇది వర్తించదు’’ అని సుజకీ మోటార్ కార్పొరేషన్ తెలియజేసింది. వివాదానికి సంబంధించి సుజుకీ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ ఒసాము హోండా కూడా తన పదవి నుంచి వైదొలగగా... రిప్రజెంటేటివ్ డెరైక్టర్లను కూడా కంపెనీ మార్చనుంది. ఇండియాలో ఈ ప్రభావం ఉండదు... జపాన్ పరీక్షల ప్రభావం ఇండియాలో ఉండదని... కాలుష్యం, మైలేజీకి సంబంధించి అక్కడి నిబంధనలకు, ఇక్కడి నిబంధనలకు చాలా తేడా ఉందని సుజుకీ ఇండియా ప్రతినిధి చెప్పారు. ఇక్కడ ఏఆర్ఏఐ, ఐకాట్, వీఆర్డీఈ వంటి ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రైవేటు ఏజెన్సీలు వాహనాల కాలుష్యం, మైలేజీ పరీక్షలు జరుపుతాయి. ఇంధన సామర్థ్యాన్ని ఇవే సర్టిఫై చేస్తాయి. ఈ నివేదికల ఆధారంగా కంపెనీ స్వచ్ఛందంగా తన వాహనాల మైలేజీని ప్రకటిస్తుంది’’ అని ఆ ప్రతినిధి వివరించారు. జపాన్ ప్రభావం ఇక్కడి వాహనాలు, వాటి అమ్మకాలపై ఉండదన్నారు. -
దక్షిణాదిన సుజుకి ప్లాంటు..!
2018-19 నాటికి సాకారమయ్యే అవకాశం ♦ ప్రస్తుత అమ్మకాల్లో 55 శాతం వాటా దక్షిణాదిదే ♦ గుర్గావ్ నుంచి రవాణాకు భారీగా వ్యయం ♦ అందుకే కొత్త ప్లాంటు; ఇక ఏటా ఒక కొత్త మోడల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్... భారత మార్కెట్లో సుస్థిర స్థానం సంపాదించే దిశగా అడుగులేస్తోంది. 2020 నాటికి వార్షిక అమ్మకాలను 10 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హరియాణాలోని గుర్గావ్లో ఉన్న సంస్థ ప్లాంటు వార్షిక సామర్థ్యం 5.4 లక్షల యూనిట్లు. లక్ష్యానికి తగ్గట్టుగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి కనక కంపెనీ రెండో ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్నీ అనుకూలిస్తే 2018-19 నాటికి ఇది సాకారమవుతుంది. ప్రస్తుతం సుజుకీ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 55 శాతంగా ఉంది. దీంతో ప్లాంటు కూడా దక్షిణాదిలోనే ఏర్పాటు చేయొచ్చని కంపెనీ వర్గాలు తెలియజేశాయి. ఈ ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటైతే రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనుండడం కూడా కంపెనీ ఆలోచనకు మరో కారణంగా కనిపిస్తోంది. కలసిరానున్న కొత్త ప్లాంటు.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని డీలర్లకు స్కూటర్లు, మోటార్ సైకిళ్లను గుర్గావ్ ప్లాంటు నుంచి సరఫరా చేయడానికి ఒక్కో వాహనానికి సగటున రూ.1,600 ఖర్చు అవుతున్నట్లు సంస్థ జోనల్ సేల్స్ మేనేజర్ డి.వి.ప్రభాకర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటైతే ఈ ఖర్చులు గణనీయంగా తగ్గడం ఖాయం. ఇది ఆదాయంతోపాటు లాభాలపైనా సానుకూల ప్రభావం చూపిస్తుందనేది సంస్థ భావన. ముఖ్యంగా గుర్గావ్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని గరిష్ఠంగా 7 లక్షల యూనిట్ల వరకు మాత్రమే విస్తరించే అవకాశం ఉంది. ఇక సూపర్ బైక్ ‘హయబూస’ మోడళ్లను భారత్‌లో అసెంబుల్ చేయనున్నట్టు కంపెనీ ఇదివరకే ప్రకటించింది. 2020 నాటికి లక్ష్యంగా చేసుకున్న 10 లక్షల యూనిట్ల వార్షిక అమ్మకాల్లో ఎగుమతుల వాటా 20% ఉండొచ్చని సంస్థ అంచనా వేస్తోంది. ఏడాదికి ఒక కొత్త మోడల్.. కంపెనీ భారత్‌లో లెట్స్, స్విష్, యాక్సెస్ పేర్లతో స్కూటర్లను... స్లింగ్షాట్, హయాతే, జిక్సర్ పేరిట బైక్‌లను విక్రయిస్తోంది. ఇటీవలే యాక్సెస్ 125, హయాతే అప్‌గ్రేడెడ్ వెర్షన్లను తీసుకొచ్చింది. వచ్చే ఐదేళ్లలో ప్రీమియం స్కూటర్లు, మోటార్ సైకిళ్లపైనే సంస్థ ఫోకస్ చేయనుంది. ఇందుకోసం ఏటా ఒక కొత్త మోడల్‌ను తీసుకొస్తామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కెంజి హిరోజవ వెల్లడించారు. విదేశాల్లో అందుబాటులో ఉన్న 150 సీసీ ఆపై సామర్థ్యమున్న స్కూటర్లను 2017 నుంచి కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టనుంది. భారత్‌లో 2014-15లో సుజుకీ 3.45 లక్షల యూనిట్లను విక్రయించింది. 2015-16లో మాత్రం ఈ సంఖ్య 3.2 లక్షలకు పరిమితం కానుంది. యాక్సెస్ నూతన వర్షన్ రావటంతో పాత మోడల్ తయారీని నియంత్రించామని, దీనివల్లే అమ్మకాలు తగ్గాయని కంపెనీ తెలిపింది. -
సుజుకీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరొ సుజుకీ
టోక్యో: మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లో కార్యనిర్వాహక విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్ఎంసీ కొత్త ప్రెసిడెంట్‌గా తొషిహిరో సుజుకీ(ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్) ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం సీఈఓగా వ్యవహరిస్తున్న ఒసాము సుజుకీ పెద్ద కొడుకు. -
మారుతి లాభం జూమ్..
క్యూ2లో రూ. 863 కోట్లు; 29% వృద్ధి న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ చర్యల ఆసరాతో వాహన దిగ్గజం మారుతి సుజుకీ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో కంపెనీ నికర లాభం 28.69 శాతం దూసుకెళ్లి రూ.863 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.670 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.11,996 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ2లో ఆదాయం రూ.10,212 కోట్లతో పోలిస్తే 17.47 శాతం వృద్ధి చెందింది. వాటాదార్లకు ఉత్సాహాన్నిచ్చే చర్యల్లో బాగంగా డివిడెండ్ చెల్లింపు నిష్పత్తిని పెంచేందుకు కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈమేరకు నిబంధనల్లో మార్పులకు ఓకే చెప్పింది. ఇప్పటిదాకా నికర లాభంలో సగటున 10-15 శాతాన్ని డివిడెండ్ చెల్లింపునకు ప్రామాణికంగా తీసుకుంటుండగా.. దీన్ని ఇప్పుడు 18-30 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, కంపెనీలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) పెట్టుబడి పరిమితిని ఇప్పుడున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచే ప్రతిపాదనను కూడా కంపెనీ ఆమోదించింది. వాటాదారులు, రిజర్వ్ బ్యాంకు అనుమతులకు లోబడి ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. అయితే, గుజరాత్ ప్లాంట్‌ను పూర్తిగా మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ అధీనంలో ఉంచే అంశానికి సంబంధించి మైనారిటీ షేర్‌హోల్డర్ల ఓటింగ్‌కు తుది తేదీని మాత్రం కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.