breaking news
suspious death
-
ట్రంప్ ‘ట్రంప్‌కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్‌పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్‌కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్‌కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్‌లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్‌లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్‌కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్‌పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్‌కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్‌కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్‌కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్‌ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది. -
మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. యువతి అనుమానాస్పద మృతి!
చిత్తూరు: చిత్తూరులోని మసీదు మిట్టలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. అయితే అది పరువు హత్య అని భర్త సాయి తేజ్ ఆరోపిస్తున్నాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతోనే చంపేశారని భర్త అంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. మూడు నెలల క్రితం యాస్మిన్ భాను, సాయి తేజ్ లు పెళ్లి చేసుకున్నారు. పూతలపట్టు మండలంకు చెందిన సాయి తేజ్ నాలుగేళ్లగా యాస్మిన్ భానుతో ప్రేమలో ఉన్నాడు. వీరు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అనంతంర ఫిబ్రవరి 13వ తేదీన తమకు రక్షణ కావాలంటూ తిరుపతి ముత్యాలరెడ్డి పలి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. అప్పట్నుంచీ యాస్మిన్ భానును ఫోన్ లో సంప్రదిస్తున్నారు తల్లిదండ్రులు.ఇదిలా ఉంటే, యాస్మిన్ భాను తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని తమ కూతుర్ని ఒకసారి పంపించాలని సాయి తేజ్ ను కోరారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరు తీసుకు రాగా, అక్కడ నుంచి ఇంటికి కారులో తీసుకెళ్లాడు యాస్మిన్ సోదరుడు లాలు. అయితే యాస్మిన్ భాను పుట్టింట్లో చనిపోయింది. ఈ విషయం సాయి తేజ్ కు తెలియడంతో ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. -
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన ఎం.విజయ్‌కుమార్ కుమార్తె రోహిత (21) విజయవాడ కానూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె సోమవారం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తనకు ఏడాదిగా పరిచయమున్న అదే కళాశాలకు చెందిన విద్యార్థితో మనస్పర్థలు వచ్చాయని, తనతో అతను మాట్లాడటం లేదని ఆవేదన చెందింది. దిగులు పడవద్దని తాము వచ్చి మాట్లాడతామని తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా ఆమె తీయలేదు. దీంతో అనుమానంతో కుటుంబసభ్యుల్లో ఒకరు మంగళవారం రాత్రి హాస్టల్‌కు వచ్చి రోహిత గదిని చూడగా అక్కడ ఆమె ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు చాట్రాయి నుంచి కానూరు వచ్చారు. హాస్టల్ గదిలో రోహిత మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తూ బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా' -
‘నా కూతురిని పొట్టనపెట్టుకున్నారు’
సాక్షి, పెద్దపల్లి : ‘నా కూతురు మానసను అత్తింటివారే హత్యచేసి ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నారని’ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన తిప్పర్తి మానస తల్లి మంజుల మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావుతో బుధవారం మొరపెట్టుకుంది. మానస అత్తింటి వారిని చట్టరీత్యా శిక్షించాలని తన కూతురు చావుకు కారణమైన అత్త మామ, ఆడపడుచులను అరెస్టు చేసి న్యాయం చేయాలని వినతిప్రతం సమర్పించింది. పెగడపల్లి గ్రామానికి చెందిన మూల మల్లారెడ్డి మంజుల పెద్దకూతురు మానసను 8ఇంక్లైన్ కాలనీలోని తిప్పర్తి లక్ష్మారెడ్డి పుష్పలత రెండో కుమారుడు సతీష్‌రెడ్డితో 2018వ సంవత్సరం జూలై ఆరో తేదీన వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.6 లక్షల నగదు, 20 తులాల బంగారం ముట్టజెప్పారు. బాబు పుట్టినప్పటి నుంచి అదనంగా మరో రూ.20 లక్షలు అదనపు కట్నం కావాలని అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. ఇటీవల పెగడపల్లి గ్రామంలో పంచాయితీ కూడా జరిగింది. మానసను బాగా చూసుకుంటామని నమ్మించి కాపురానికి తీసుకెళ్లారు. ఈ నెల 10వ తేదీన బాబు పుట్టిన రోజు వేడుకకు 8ఇంక్లైన్కు రమ్మని మానస పుట్టింటి వారికి కబురు చేశారు. పథకం ప్రకారం మానసను ఒక రోజు ముందే ఈనెల 9వ తేదీన 8ఇంక్లైన్ కాలనీలోని క్వార్టరు నంబరు టి2–151లో ఉరివేసి చంపి ఆత్మహత్య చేసుకుందని డ్రామాకు తెరదించారన్నారు. అత్త పుష్పలత, మామ లక్ష్మారెడ్డి, ఆడపడుచు రజితను చట్టరీత్యా శిక్షించి న్యాయం చేయాలని రేవతిరావుకు మానస తల్లి మంజుల మొరపెట్టుకుంది. బాధిత కుటుంబాన్ని రేవతిరావు ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు ఫోన్ చేయాలని 99493 31939 నంబర్ ఇచ్చారు. తొలిసారిగా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి వచ్చిన రేవతిరావును గ్రామస్తులు సన్మానించారు. ఆమె వెంట ఎంపీపీ సంపత్, జెడ్పీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ నిర్మల, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. -
ఒకే ఇంట్లో నలుగురి అనుమానాస్పద మృతి
-
చిన్నారి అనుమానాస్పద మృతి
నెల్లూరు : నగరంలోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన మహమ్మద్ అన్సారి, ప్రత్యూష కుమార్తె అర్షియా (6) మంగళవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. అయితే తండ్రే ఆ చిన్నారిని హత్య చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘటన అనంతరం తండ్రి అన్సారి పరారీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. మహమ్మద్ అన్సారి, ప్రత్యూష ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నారు. ప్రత్యూష ఆడపిల్లకు జన్మనివ్వడంతో భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అయితే ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. ఉదయం చిన్నారికి తల్లి స్నానం చేయించి నిద్రపుచ్చింది. కొద్దిసేపటికే ఆ చిన్నారి చలనం లేకుండా ఉండటంతో అనుమానం వచ్చిన ప్రత్యూష చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఈ సంఘటన అనంతరం అన్సారి ఇంట్లో నుంచి పరారయ్యాడు. దీన్ని బట్టి ఆ చిన్నారిని తండ్రే హతమార్చి పరారయ్యాడని ప్రత్యూషాతో పాటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
బాలిక మృతి... పోలీసుల అదుపులో తండ్రి
విశాఖపట్టణం: ఓ బాలిక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం విశాఖపట్టణం జిల్లా మునగపాక మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మునగపాక ప్రభుత్వ హైస్కూల్లో 9 వతరగతి చదువుతున్న బాలిక శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి మృతి చెందింది. ఈ విషయాన్ని అప్పుడే కూలి పనికి వెళ్లి వచ్చిన తల్లి గమనించింది. బాలిక మెడపై గాయాలు ఉండటాన్ని గమనించిని తల్లి ఆ విషయాన్ని బాలిక అంత్యక్రియల తర్వాత వెల్లడించింది. అలాగే బాలిక చనిపోయిన సమయంలో తన భర్త ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్నాడని తెలిపింది. కూతురిని భర్త తరచూ వేధిస్తూ ఉండేవాడని పేర్కొంది. దీంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


