breaking news
susheel alias veeranna
-
స్వగ్రామానికి మావో దంపతుల మృతదేహాలు
వరంగల్: ఒడిశాలో మూడు రోజుల క్రితం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు నేత సుశీల్‌కుమార్, ఆయన భార్య సోని మృతదేహాలు వరంగల్‌కు చేరుకున్నాయి. సుశీల్‌కుమార్ స్వగ్రామం నర్సంపేట మండలం భాంజిపేటలో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగనున్నాయి. పోలీసులు ప్రత్యేక అంబులెన్సులో మృతదేహాలను భాంజీపేటకు తీసుకువచ్చారు. కాగా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓజీ) గత ఆదివారం జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. సుశీల్ కళింగ్ నగర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఆయనకు వ్యతిరేకంగా పలు ఠాణాల్లో 50కి పైబడి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఒడిశాలో మావోయిస్టు దంపతుల మృతి
భువనేశ్వర్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎన్ఓజీ) ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో మావోయిస్టు సుశీల్ అలియాస్ వీరన్న అలియాస్ పుట్టపాక కుమారస్వామి, ఆయన భార్య భార్య సోనీ మృతి చెందారు. వీరన్న స్వస్థలం వరంగల్ జిల్లా. కాగా అనుగుల్, దేవ్గడ్ సరిహద్దు బారొకోట్ సమితీ పచేరీపాణి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, ఎన్ఓజీ దళా మధ్య ఆదివారం కాల్పులు జరిగాయి. నెల రోజుల వ్యవధిలో అనుగుల్ జిల్లాలో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగడం వరుసగా ఇది మూడోసారి. మావోయిస్టు దంపతులకు వ్యతిరేకంగా పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రాష్ట్ర డీజీపీ కేబీ సింఘ్ తెలిపారు. ఆదివారం జరిగిన కాల్పుల్లో వీరి మృతిని ధ్రువీకరించారు. మృతదేహాలను అనుగుల్ జిల్లా పల్లొటొహొడాకు తరలించారు. సుశీల్ కళింగ్ నగర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఆయనకు వ్యతిరేకంగా పలు ఠాణాల్లో 50కి పైబడి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అనుగుల్, దేవ్గడ్, రాయగడ, గజపతి జిల్లాల్లో 30 హత్య కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు డీజీపీ వివరించారు. సుశీల్‌పై రూ.20 లక్షలు, అతని భార్యపై రూ.5 లక్షల రివార్డు ఉందని తెలిపారు.