breaking news
sundarbans
-
పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి
అడవంటే పూర్తిగా అడవీ కాదు, నది పాయ అందామంటే అవి మాత్రమే కాదు. సముద్రతీరం అనుకుందామంటే కచ్చితంగా అలా కూడా చెప్పలేం. గంగ, మేఘన, బ్రహ్మపుత్ర వేటికవి తమ దారిన తాము పయనిస్తూ అటవీప్రాంతానికి పచ్చదనాన్ని అద్దుతూ ఉంటాయి. నదులు పాయలు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంటాయి. నీటి పాయల తీరాన ఎల్తైన మడ అడువులు తెచ్చిన ప్రాకృతిక సౌందర్యం మాటల్లో వర్ణించలేనిది. ఆ చెట్ల వల్లనే ఈ అడవికి సుందర్వన్ అనే పేరు వచ్చింది. బెంగాలీ, ఒడిషా భాషల్లో ‘వ’ అనే అక్షరం ఉండదు. ‘వ’ కు బదులుగా ‘బ’ ఉపయోగిస్తారు. అందుకే ఈ సుందరవనం సుందర్బన్ అయింది. నీటిలో పులి నేల మీద మొసలి అడవి అంటే... పులి అడవిలో ధీరగంభీరంగా సంచరిస్తూ ఉంటుందని కరెక్ట్గానే ఊహిస్తాం. నీటి మడుగులో అడుగు పెట్టాలంటే మొసలి ఉంటుందేమోనని భయపడతాం కూడా. అయితే... సుందర్బన్లో పులులు నీటిలో ఈదుతూ కనిపిస్తాయి. మొసళ్లు ఒడ్డున సేద దీరుతుంటాయి. ఆ దృశ్యం కంటపడగానే గుండె ఆగిపోయినట్లవుతుంది. రకరకాల పక్షులు... మొత్తం రెండొందల యాభై రకాలకు పైగా జాతులుంటాయని అంచనా. ఈ టైగర్ రిజర్వ్లో నాలుగు వందల బెంగాల్ రాయల్ టైగర్లుంటాయి. రాత్రి బస చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. అడవిలో ఊళ్లు మొత్తం పదివేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ఇది. నాలుగువేలకు పైగా చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉంది. ఇది మనదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. విశాలమైన ఈ అటవీప్రాంతంలో నదులు, నీటి పాయల మధ్య మొత్తం నూట రెండు దీవులున్నాయి. నూటా రెండు దీవులకు గాను యాభై నాలుగు దీవులు జనావాసాలు. అడవి మధ్య ఊర్లన్నమాట. ఈ దీవుల్లో పంటలు పండిస్తారు. అడవి మధ్య ప్రవహించే నదుల్లో జాలరులు చేపలు పడుతుంటారు. రోజూ ఉదయం సాయంత్రం ఇక్కడ బంగాళాఖాతం చేసే అల్లరిని చూడవచ్చు. అలలు ఆరడుగుల నుంచి పదడుగుల ఎత్తుకు లేస్తాయి. ఆ భారీ అలలతో నీటితోపాటు ఇసుక కూడా అడవిలోకి కొట్టుకు వచ్చి మేట వేస్తుంటుంది. పడవలు, లాంచీలలో దీవులన్నింటినీ చుట్టి రావచ్చు. సరిహద్దు దీవి మనదేశానికి సరిహద్దులో ఉన్న దీవి పేరు ‘గోసాబా’ ఇది నీటి మట్టానికి 13 అడుగుల ఎత్తులో ఉంది. ఇది నిజానికి భారత ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉండదు. విడిగా ఉంటుంది. నీటి ఎల్లలో మన సరిహద్దుకు లోపల ఉంది. ఇది ఒక పంచాయితీ. ఇందులో నివసించే ప్రజల కోసం స్కూలు, హాస్పిటల్ కూడా ఉన్నాయి. ప్రధాన భూభాగంలోకి రావాల్సిన అవసరం లేకనే హాయిగా జీవించేయవచ్చు. సాహిత్యవనం సుందర్బన్ అటవీప్రదేశం కోల్కతాకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ‘న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ నేచర్’ కేటగిరీలో లిస్ట్ అయింది. బెంగాలీ రచయితలు సుందర్బన్ అటవీ ప్రదేశం, ఇక్కడి దీవుల్లోని జన జీవనమే కథాంశంగా అనేక రచనలు చేశారు. సుందరబన్కు ప్రత్యేక హోదాలు ► 1973 టైగర్ రిజర్వ్ ► 1987 వరల్డ్ హెరిటేజ్ సైట్ ► 1989 నేషనల్ పార్క్ -
వైరల్: దమ్ముంటే పులికి ఎదురుపడు!
కోల్కత: సాదారణంగా పులిని మనం జంతు ప్రదర్శనశాలలో దూరం నుంచి చూస్తాం. అదిగానీ గాండ్రించిందా భయపడ్డం ఖాయం. బయట ఎక్కడైనా పొరపాటున కనిపించినా ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెడతాం. అటువంటిది ఓ ఇద్దరు యువకులు మాత్రం నది దాటుతున్న పులిని వెంబడించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ అడవుల్లో జరిగింది. సుందర్బన్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో పులులు కనిపిస్తుంటాయి. అయితే ఒక నది దాటుతున్న పులిని అక్కడే ఉన్న యువకులు మర పడవలో బాగ్ బాగ్ (పరుగెత్తు) అని అరస్తూ దాన్ని వెంబడించారు. ఇక కుర్రాళ్ల అరుపులతో పులి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది.(చదవండి: భారతీయ రైల్వే సరికొత్త రికార్డు!) అయితే ఈ దృశ్యాలను సదరు యువకులు తమ సెల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో యువకుల వెర్రి పనిపై విమర్శలు వస్తున్నాయి. చావు కొనితెచ్చుకోవడం అంటే ఇదే అంటు కామెంట్లు చేస్తున్నారు. అడవుల్లోనూ జంతువులకు స్వేచ్ఛ లేదని అంటున్నారు. పులిని నీటి కాదు రా.. దమ్ముంటే నేలపై వెంబడించు. తిక్క మరీ ఎక్కువైతే ఎదురుపడు అని మరికొందరు చాలెంజ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారి రమేష్ పాండే ఈ వీడియోను షేర్ చేస్తూ.. పులితో కుర్రాళ్ల పిచ్చి పని చూడండి. వీళ్లకు ఈ ‘సాహసం’ అవసరమా అని క్యాప్షన్ జత చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
మహిళను లాక్కెళ్లి చంపేసిన మొసలి
పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ అడవుల్లో దారుణం జరిగింది. ఛోటో మొల్లాఖలీ ప్రాంతంలో రొయ్య పిల్లలను ఏరుకుంటున్న 40 ఏళ్ల మహిళను ఓ మొసలి నీళ్లలోకి లాక్కెళ్లిపోయి చంపేసింది. రంభా మొండల్, ఆమె భర్త శ్యామపాద కలిసి గోసబా నది పాయలోని ఫెర్రీ ఘాట్లో టైగర్ ప్రాన్ రొయ్యపిల్లలను ఏరుకోడానికి వెళ్లారు. అప్పుడే మొసలి ఆమెను లాక్కుని నీళ్లలోకి వెళ్లిపోయింది. ఆమె గట్టిగా అరవడంతో భర్త శ్యామపాద, మరికొందరు స్థానిక మత్స్యకారులు కలిసి నాలుగు పడవల్లో ఆమెను కాపాడేందుకు వెళ్లారు. ఆ పడవలు మొసలిని చుట్టుముట్టినా, మహిళను మాత్రం కాపాడలేకపోయాయి. కొన్ని గంటల తర్వాత మహిళ మృతదేహం రెండు కాళ్లు, కుడి చేయి లేకుండా కొంత దూరంలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు.