breaking news
Sucheta Kriplani
-
ఆ ఐదుగురికి వందనం
1942 ఆగస్టు 8 క్విట్ ఇండియా ఉద్యమం.. ‘డూ ఆర్ డై’ నినాదం. ‘ఇక చాలు... తోక ముడవండి’ అని బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ తిరగబడిన ప్రజాసందోహం. ఆ సమయంలో ఐదుగురు నారీమణులు శివంగులై కదిలారు. నాయిక స్థానంలో నిలిచి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రాణాలు కోల్పోయారు. వారి గొంతు నుంచి ఒక మాట మాత్రం ఆగలేదు– ‘వందే మాతరం’. అరుణ అసఫ్ అలీ, సుచేత కృపలానీ, తారారాణి శ్రీవాస్తవ, కనకలత బారువా, మతింగిని హజ్ర....ఈ త్యాగదీప్తులకు వందనం.అప్పటికి బ్రిటిష్ వారి ధోరణి పూర్తిగా ముదిరిపోయింది. భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానికితోడు ‘పాక్షిక స్వాతంత్య్రం ఇస్తాం’ అని చెప్పడం పుండు మీద కారం చల్లినట్టయ్యింది. అప్పటికే ఎల్లెడలా స్వాతంత్య్ర కాంక్ష వెల్లువెత్తుతోంది. జనంలోని వేడిని, వారి నాడిని గమనించిన గాంధీజీ ఆగస్టు 8, 1942న బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదాన్ నుంచి ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ నినాదాన్ని అందించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు... అందరూ ఇందులో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వంతో ముడిపడిన కార్యకలాపాలన్నీ బంద్ చేయమన్నారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమంలో కనిపించిన ఒక గొప్ప పరిణామం స్త్రీలు ఇందులో పెద్ద సంఖ్యలో మమేకం కావడం. బ్రిటిష్ వాళ్లు రంగంలో దిగి పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం వల్ల ‘నాయకులు లేని ఉద్యమం’గా గుర్తింపు పొందిన క్విట్ ఇండియా ఉద్యమంలో స్త్రీలు నాయక స్థానానికి ఎదిగారు. ప్రజలను నడిపించారు. త్యాగాలు చేశారు.ప్రాణాలు కోల్పోయారు. అట్టి వారిలో ఐదుమంది స్త్రీలు సదా స్మరణీయులు. వారిని తెలుసుకుందాం.అరుణ అసఫ్ అలీఈమెకు ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్’, ‘హీరోయిన్ ఆఫ్ 1942’ తదితర బిరుదులు ఉన్నాయి. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అరుణ అసఫ్ అలీ పేరు సగర్వరంగా తలుచుకుంటారు. గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చాక ఏ మైదానం నుంచైతే ఆ పిలుపునిచ్చారో అదే మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి అరుణ ఆసఫ్ అలీ బయలుదేరారు. అప్పటికే బొంబాయిలో ఆందోళనలు, దుందుడుకు చర్యలు, దహనాలు, వాటిని అణచడానికి పోలీసుల కాల్పులు జరుగుతున్నాయి. అయినా సరేప్రాణాలకు తెగించి అరుణ ఆసఫ్ అలీ జాతీయపతాకాన్ని ఎగుర వేశారు. ఆ తర్వాత గొవాలియా ట్యాంక్ మైదాన్ ‘ఆగస్ట్ క్రాంతి మైదాన్’గా పిలువబడింది.సుచేత కృపలానీబెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా ఉన్న సుచేత ఆచార్య కృపలానీని వివాహం చేసుకుని సుచేత కృపలానీ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తగా చురుగ్గా పని చేయడంప్రారంభించిన సుచేత ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ స్థాపించారు. క్విట్ ఇండియా పిలుపు అందిన వెంటనే సుచేత భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చి ముందు వరుసలో నడిచారు. అజ్ఞాతంలో ఉంటూ కార్యకర్తలను నడిపించారు. చివరకు బ్రిటిష్ పోలీసులు ఆమె జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలిగా ఉన్న సుచేత ఉత్తరప్రదేశ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.తారారాణి శ్రీవాస్తవ్క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి తారారాణి శ్రీవాస్తవ్ వయసు 13 సంవత్సరాలు. అప్పటికే పులేందు బాబుతో వివాహం అయ్యింది. క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు అందుకుని ఆమె తన ఊరు సివాన్ (బిహార్) పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు బయలుదేరింది. ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరపగా పులేందు బాబు కుప్పకూలాడు. అయినా తారారాణి ఆగలేదు. ముందుకే సాగి పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం ఎగురువేసింది. వెనుకకు వచ్చి తిరిగి చూసే భర్త మరణించి ఉన్నాడు. ఆ వియోగాన్ని భరిస్తూనే చెక్కుచెదరని స్ఫూర్తితో ఆమె ఆ తర్వాతి కాలంలో దేశం కోసం పోరాడింది.కనకలత బారువాఅస్సామ్ చెందిన 17 ఏళ్ల యువతి కనకలత బారువా త్యాగం ఎంతో గొప్పది. దేశం కోసం అప్పటికే ఆమె ‘మృత్యువాహిని’ అనే దళం నడిపేది. క్విట్ ఇండియా పిలుపు విని తన దళంతో ఆమె గోహ్పూర్ పోలీస్ స్టేషన్ పై జాతీయ పతాకం ఎగురవేసేందుకు బయలుదేరింది. లాఠీలకు, హెచ్చరికలకు ఆగలేదు. చివరకు కాల్పులు జరిపితే బుల్లెట్‌కు ఎదురొడ్డిప్రాణాన్ని త్యాగం చేసింది. కనకలత లాంటి ఎందరో ధీరలు ‘డూ ఆర్ డై’ నినాదాన్ని నిజ అర్థంలో స్వీకరించే దేశానికి ఉత్తేజం ఇచ్చారు.మతంగిని హజ్రాఈమెను అందరూ ‘గాంధీ అవ్వ’ అని పిలిచేవారు. స్వాతంత్య్ర పోరాటంలో 73 ఏళ్ల వయసులో పాల్గొనడమే అందుకు కారణం. గాంధీ ఆదర్శాలకు నిలబడటం వల్ల కూడా. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బెంగాల్‌లోని ‘తమ్లుక్’లో పోలీస్ స్టేషన్ వైపు ఆరువేల మంది జనం కదిలారు. వారిలో ముందున్న వ్యక్తి మతంగిని హజ్రా. ఆమె చేతిలో జాతీయ పతాకం ఉంది. పోలీసులు విచక్షణారహితంగా బాదుతున్నా ఆమె ‘వందేమాతరం’ నినాదం ఆపలేదు. చేతిలోని పతాకాన్ని జార విడువలేదు. ఆ దెబ్బలతోనే ఆమె మరణించింది. దేశం కోసం ఆమె చేసిన త్యాగం మరపురానిది. -
చైతన్యదీప్తి
నిరాడంబరంగా జీవించింది. నిదానమే ప్రధానం అన్నట్టు సాగింది. కానీ వేసిన ప్రతి అడుగూ చరిత్రలో నిలిచిపోయే విధంగా వేసింది. - సుచేత గురించి ఒకచోట రాసిన మాటలు ఒక రాష్ట్రానికి... మహిళ ముఖ్యమంత్రి కావడం కుదురుతుందా? మగవాళ్ల కనుసన్నల్లో కదిలే రాజకీయ ఎత్తుగడల మధ్య మహిళకు అసలది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించారు సుచేతా కృపలాని. ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆమె ఉవ్విళ్లూరలేదు. ఆ పదవే ఆమె కోసం ఎదురు చూసింది. స్వాతంత్య్రం కోసం ఆమె చేసిన పోరాటమే ఆ మెట్లెక్కిచ్చింది. దేశవిభజనకు దారి తీసిన నోవాఖలి దాడుల సమయంలో అందించిన సేవ... ఆమెను ఆ స్థాయిలో నిలబెట్టింది. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ... గాంధీజీ ఆమె మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని తన సత్తా నిరూపించుకున్న మహిళ సుచేతా కృపలానీ. భారత జాతీయ కాంగ్రెస్‌తో పని చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ అండతో మనలేదు. కాంగ్రెస్ నీడన ఎదగలేదు. తనకు తానుగా తనను నిలబెట్టుకున్న వ్యక్తిత్వం ఆమెది. ఆచార్య కృపలాని... నెహ్రూతో విభేదించి సొంతంగా ‘కృషక్ మజుందార్ ప్రజాపార్టీ’ పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలిచారామె. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి భర్తకు నైతిక మద్దతునిచ్చారు. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చిన తర్వాత ఆమె తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భార్యాభర్తలు రెండు పార్టీల్లో పని చేసినప్పుడు కూడా ఆమె తన పరిధి పట్ల స్పష్టమైన అవగాహనతో వ్యవహరించారు. భర్త గెలుపు కోసం ప్రచారం చేయలేదు. కానీ భర్త ఆరోగ్యం, మంచిచెడ్డలను చూసుకునేవారు. సుచేతకు తాను చేస్తున్న పని పట్ల ఎంతో నిబద్ధత ఉంటుందనడానికి నిదర్శనం ఆమె వివాహమే. తనకంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన ఆచార్య కృపలానీతో వివాహాన్ని రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా ఆమె నిర్ణయం మారలేదు. లోక్‌సభ సభ్యురాలిగా ఆమె చట్టసభలో విధాన నిర్ణయాల్లోనూ అంతే స్పష్టమైన పాత్ర నిర్వహించారు. ఆ కార్యదక్షత ఉత్తరప్రదేశ్ రాజకీయ క్లిష్టత పరిష్కారానికి ఆధారమైంది. 1962లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరస్పర విభేదాలతో రెండుగా చీలిపోయింది. కమలాపతి త్రిపాఠీ ఒక వర్గానికి నాయకత్వం వహించగా, సి.బి.గుప్తా మరొక వర్గాన్ని నడిపించారు. ఆ సమయంలో సి.బి గుప్తా నుంచి సుచేతకు ఆహ్వానం వచ్చింది. కాంగ్రెస్‌లో తలెత్తిన విభేదాల కారణంగా రాష్ట్రాన్ని నడిపించగలిగిన దీటైన నాయకత్వం చాలా అవసరమంటూ ఆ బాధ్యత తీసుకోవలసిందిగా ఆమెను కోరారాయన. ముఖ్యమంత్రిగా... 1963లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సుచేత కృపలానీ దృఢచిత్తంతో రాష్ట్ర సమస్యలను చక్కబెట్టారు. సమర్థమైన కార్యనిర్వహణతోపాటు, సునిశితమైన రాజకీయ నాయకురాలిగా గుర్తింపుపొందారు. ఆమె హయాంలో ఉద్యోగులు 62 ఓజుల పాటు కొనసాగించిన సుదీర్ఘమైన నిరసన పోరాటాన్ని దీటుగా ఎదుర్కొన్నారు. జీతాలు పెంచి తీరాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు ఆమె తలవంచకపోవడంతోపాటు తన వాదనతో ఉద్యోగ సంఘాల నాయకులను సమాధానపరిచారామె. మనదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తొలి మహిళ సుచేత. నిరాడంబరత, నిజాయితీతోపాటు తెలివైన, కష్టపడే తత్వం కలిగిన సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా మొదటి గుర్తింపు కూడా ఆమెదే. అత్యంత నిరాడంబరంగా జీవించిన కృపలానీ దంపతులు రాజకీయాల నుంచి వైదొలిగిన తరవాత వారి మనోభీష్టానికి తగినట్లు న్యూఢిల్లీలో అందమైన పొదరింటిని నిర్మించుకుని జీవించారు. సంపాదించిన డబ్బుని లోక్ కల్యాణ్ సమితి ద్వారా నిరుపేదల ఆరోగ్యసేవలకే ఖర్చు చేశారు. జాతీయోద్యమంలో ఉద్యమకారిణిగా నిప్పుకణికలా రగిలిన సుచేత... గృహిణిగా కూడా అంతే ఒద్దిగ్గా ఒదిగిపోయేవారు. ఇంట్లో షర్బత్తులు, జామ్‌లు చేసుకుంటూ గడిపేవారు. ఆచార్య కృపలానీ చివరి రోజుల్లో బ్రాంకైటిస్‌తో బాధపడ్డారు. ఆయన సేవలకు ఓ నర్సు ఉన్నప్పటికీ సుచేత అర్ధరాత్రిళ్లు రెండుసార్లు లేచి ఆయనను చూసుకునేవారు. ఆ సమయంలో కూడా తన గుండె నొప్పిని చెప్పి ఆయన్ను బాధించడం ఇష్టం లేకపోయిందామెకి. వారి విశ్రాంత జీవితం అలా సాగుతున్నప్పుడే ఆమె ఆటోబయోగ్రఫీని ఒక వార పత్రికకు ధారావాహికగా రాయడం మొదలుపెట్టారు. కానీ అది నాలుగు వారాలకు మించి కొనసాగలేదు. ఎందుకంటే 1974 డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి ఆమె హార్ట్ అటాక్‌తో అందరికీ దూరమయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌తో పని చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ అండతో మనలేదు. కాంగ్రెస్ నీడన ఎదగలేదు. తనకు తానుగా తనను నిలబెట్టుకున్న వ్యక్తిత్వం ఆమెది. - మంజులారెడ్డి -
నాడు నాలుగు - నేడు ఏడు
న్యూఢిల్లీ : 1952లో మొట్టమొదటిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో మొత్తం నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉండేవి. ఆ సంఖ్య ప్రస్తుతం ఏడుకు చేరుకుంది. ట్రాన్స్ యమునా ప్రాంతమంతా ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఔటర్ ఢిల్లీ ఓటర్లు రెండు ఓట్లు వేసేవారు. ఒకటి జనరల్ సీటు కోసం కాగా మరొకటి రిజర్వ్డ్ స్థానంకోసం ఓటు వేసేవారు. ఆ తరువాత ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానానికి కరోల్‌బాగ్ పేరు పెట్టారు. 1952లో ఔటర్ ఢిల్లీ కాకుండా న్యూఢిల్లీ, ఢిల్లీ షెహర్ నియోజకవర్గాలు ఉండేవి. 1952 ఎన్నికలలో నాలుగు స్థానాలలో మూడింటిని కాంగ్రెస్, ఒక్క స్థానాన్ని కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీలు గెలుచుకున్నాయి. అప్పట్లో భారతీయ జన్‌సంఘ్‌గా అందరికీ పరిచయమైన బీజేపీకి ఒక్క సీటుకూడా దక్కలేదు. ఔటర్ ఢిల్లీ జనరల్, రిజర్వ్డ్, ఢిల్లీ షెహర్ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. ఔటర్ డిల్లీ రిజర్వ్డ్ సీటు నుంచి కె.సి. కృష్ణనాయర్, జనరల్ సీటు నుంచి నవల్ ప్రభాకర్, హెహర్ సీటు నుంచి రాధారమణ్ గెలిచారు, న్యూఢిల్లీ సీటు టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ మోహినీ సెహగల్‌కు ఇచ్చింది. ఇది నచ్చని ఆ పార్టీకి చెందిన పలువురు కెఎంపీపీ నుంచి పోటీచేసిన సుచేతా కృపలానీకి మద్దతు ఇచ్చారు .దీంతో ఆమె న్యూఢి ల్లీ సీటు నుంచి గెలిచారు. ఆ తరువాత సుచేతా కృపలానీ కాంగ్రెస్‌లో చేరి ఉత్తరప్రదేశ్ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి ఎన్నికల్లో శరణార్థులకు పునరావాస కల్పన ప్రధాన అంశమయ్యింది. దేశానికి స్వాం తంత్య్రం తీసుకొచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ శరణార్థులకు పునరావాసం కల్పిస్తాననే హామీ ఇచ్చి తద్వారా ఓటర్ల మనసును గెలుచుకుంది. ఎన్నికల ప్రచారం కోసం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీ మొత్తం జీపులో కలియదిరిగారని చెబుతారు జీపులో నెహ్రూ వెళ్లిన ప్రతిచోటా ప్రజలు రహదారులకు ఇరువైపులా నిలబడి ఆయనకు అభివందనం చేసేవారని అంటారు. ఇందిరాగాంధీ కొన్ని సభల్లో ప్రసంగించారని, సరాయ్ రోహిల్లాలో జరిగిన ఎన్నికల సభకు భారీఎత్తున జనం హాజరయ్యారని చెబుతారు.