breaking news
subsidy money
-
పట్టు తప్పిన ప్రోత్సాహకం
మడకశిర: ఏడాది కాలంగా పట్టుగూళ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. పట్టు పురుగులు పెంచే షెడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకంలో అందించే రాయితీ సొమ్మూ రైతులకు చెల్లించడం లేదు. ఫలితంగా ఉమ్మడి అనంతçపురం జిల్లాలో బైవోల్టిన్ పట్టు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. దీంతో బైవోల్టీన్ పట్టు సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.ప్రస్తుతం మార్కెట్లో బైవోల్టీన్ పట్టుగూళ్ళ ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. కిలో బైవోల్టీన్ పట్టుగూళ్ల ధర రూ.700కు పైగా పలుకుతోంది. ప్రోత్సాహక ధనం అందకపోవడంతో బైవోల్టీన్ పట్టుగూళ్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. హిందూపురం మార్కెట్‌కు రోజూ బైవోల్టీన్ పట్టుగూళ్లు దాదాపు 40 నుంచి 50 లాట్లు వచ్చేవి. ప్రస్తుతం రోజూ 30 లాట్ల లోపే ఉంటున్నాయి. పేరుకుపోయిన రూ.66 కోట్ల బకాయి ఉమ్మడి జిల్లాలో పట్టు రైతులు రెండు రకాల పట్టు గూళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. పట్టు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సహకాలు ఇస్తోంది. బైవోల్టీన్ పట్టు గూళ్లను ఉత్పత్తి చేసి ప్రభుత్వ మార్కెట్లో విక్రయించిన రైతుకు కిలోకు రూ.50, అలాగే సీబీ రకం పట్టు గూళ్లకు కిలోకు రూ.10 చొప్పున ప్రోత్సాహక ధనాన్ని ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టు రైతులు నయా పైసా ప్రోత్సాహక దనం అందలేదు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టు రైతులకు రూ.66 కోట్ల బకాయిలు పేరుకుపోగా ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే రూ.27 కోట్ల బకాయిలు ఉండడం గమనార్హం. అలాగే పట్టుగూళ్ల నుంచి దారం వెలికి తీసే రీలర్లకూ ప్రతి కిలో దారానికి రూ.130 చొప్పున ప్రోత్సాహక ధనం చెల్లించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 17 నెలల కాలంలో నయా పైసా ప్రోత్సాహక ధనం అందలేదని రీలర్లూ వాపోతున్నారు.బకాయిలువెంటనే విడుదల చేయాలిపట్టు రైతులను ఆదుకోవాలంటూ పట్టు రైతు సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు విజయవాడకు వెళ్లి ప్రభుత్వ పెద్దలతో చర్చించాం. అయినా కూటమి సర్కారులో మార్పు రాలేదు. పట్టు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. పేరుకుపోయిన ప్రోత్సాహక ధనం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. – వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పట్టు రైతు సంఘం అధ్యక్షుడుతప్పని ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వం ప్రోత్సాహక ధనం బకాయిలను మంజూరు చేయకుండా జాప్యం చేస్తోంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. పరిస్థితి ఇలాగే ఉంటే పట్టుగూళ్ల ఉత్పత్తికి రైతులు స్వస్తి పలుకుతారు. – సోమ్‌కుమార్, పట్టు రైతు సంఘం అధ్యక్షుడు, మడకశిరపట్టు రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక ధనం ఇలా... ⇒ బైవోల్టీన్ పట్టు రైతులకు: కిలోకు రూ. 50⇒ సీబీ పట్టు రైతులకు: కిలోకు రూ.10⇒రీలర్లకు అందించేది: కిలో దారానికి రూ.130 -
మొండిచేయి
ఒంగోలు సెంట్రల్: వివిధ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరైన లబ్ధిదారులకు నెలలు గడుస్తున్నా..సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ కావడం లేదు. దీంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. సమైఖ్య రాష్ట్రంలో మంజూరు చేసిన రుణాలకు అవసరమైన నిధులను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేస్తుందా లేదా అనేది అంతు చిక్కడం లేదు. అదే విధంగా రాష్ట్రం విడిపోయినా గిరిజన కార్పొరేషన్ మాత్రం రెండు రాష్ట్రాలకు ఒక్కటిగా ఉండటంతో నిధుల విడుదలకు తీవ్ర అడ్డంకిగా మారింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల కింద జిల్లాలో మొత్తం మీద రూ.25.15 కోట్ల సబ్సిడీ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమకావాల్సి ఉంది. - 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 1963 మంది ఎస్సీలకు రూ.36.69 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వారికి సబ్సిడీ కింద రూ.16.80 కోట్లు రావాల్సి ఉంది. ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. వీరికి రాయితీ మంజూరైనా..నిధులు విడుదల కాకపోవడంతో బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. ఫలితంగా మంజూరు పత్రాలతో లబ్ధిదారులు కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. - నిరుద్యోగ బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలిస్తోంది. 2013-14 సంవత్సరానికి గానూ 1349 మందికి రూ.13.80 కోట్ల రుణాలు అందించడానికి అధికారులు నిర్ణయించారు. అయితే మంజూరైన వారికి ఇంత వరకూ సబ్సిడీలు విడుదల కాలేదు. రూ.6.50 కోట్లకు పైగా సబ్సిడీ నిధులు మంజూరు చేయాల్సి ఉండగా ఇంత వరకూ మంజూరు చేయలేదు. - ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితి ఘోరంగా తయారైంది. రాష్ట్ర విభజన జరిగి రెండు నెలలు గడుస్తున్నా..ఇంత వరకూ కార్పొరేషన్‌ను విభజన జరగలేదు. దీంతో రుణాలు, సబ్సిడీలు వచ్చే ఏడాదికైనా మంజూరవుతాయా అనేది సందేహమే. మొత్తం 350 మందికి రూ.3.15 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వీరికి రూ.1.85 కోట్ల సబ్సిడీ ఇవ్వాలి. అయితే సబ్సిడీ మంజూరు కాకపోవడంతో బ్యాంకులు రుణాలిచ్చేందుకు అంగీకరించడం లేదు. రాయితీ వస్తే తప్ప రుణం ఇవ్వమని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. - రుణాల సబ్సిడీలు రాకపోవడంపై..ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.రాజు మాట్లాడుతూ లబ్ధిదారులకు సబ్సిడీలు మంజూరయ్యాయని, అయితే ఇంకా అవి వారి ఖాతాల్లో జమకాలేదన్నారు. - ఎస్టీ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ విభజన జరగకపోవడంతో రాయితీలు మంజూరు కాలేదన్నారు. ఈ విషయమై 17వ తేదీ హైదరాబాద్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సమావేశం నిర్వహించారని, సబ్సిడీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.