breaking news
subbaiah died
-
దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి
-
సుబ్బయ్య టీడీపీకి చెందిన వ్యక్తి
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనను రాజకీయం చేయదలుచుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వమే తమ పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటన విషయంలో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నా.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అంటూ బురద జల్లే ప్రయత్నం చేశారని, నిజానికి నిందితుడు సుబ్బయ్య టీడీపీకి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. అందుకే టీడీపీ ఎమ్మెల్యే సుబ్బయ్యకు ఇల్లు మంజూరు చేయించారని, ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సమస్యను సమస్యలాగా చూడాలని జంగా కృష్ణమూర్తి ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సందర్భంగా టీడీపీలో నిందితుడు సుబ్బయ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ.. అతడి టీడీపీ ఐడీకార్డును జంగా కృష్ణమూర్తి విడుదల చేశారు. -
పిండప్రదానం చేస్తూ వ్యక్తి మృతి
ధవళేశ్వరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఉన్న గాయత్రి పుష్కరఘాట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఓ బ్యాంకు రిటైర్డ్ మేనేజర్ అయిన విజయవాడకు చెందిన మహంకాళి సుబ్బయ్య(65) గురువారం పుష్కరస్నానం చేసేందుకు గాయత్రిఘాట్కు చేరుకున్నారు. కాగా, పిండ ప్రదానం చేసే సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇవ్వగా, ఆ వాహనం అక్కడికి చేరుకునేలోగానే సుబ్బయ్య తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.