breaking news
state teachers union
-
ప్రభుత్వ వైఖరిపై ఎస్టీయూ నిరసన
వెల్దుర్తి (మెదక్) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.యాదగిరి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి డిప్యూటీ ఈవో, డీఈవో, జేఎల్, డైట్ లెక్చరర్ల పదోన్నతులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు షరతుల్లేని నగదు రహిత హెల్త్‌కార్డులను అందజేసి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న కలెక్టరేట్ల వద్ద, 29న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు. -
ఉపాధ్యాయులకు శుభవార్త
రాజానగరం, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 28న జరిగిన సార్వత్రిక సమ్మెను అర్హత ఉన్న సెలవుగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీవీ సత్యనారాయణరాజు, కేవీ శేఖర్ వెల్లడించారు. శనివారం వారిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన జీఓను వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే సిన్హా తెలిపారన్నారు. సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం శాఖాపరమైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్డు ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. దీనిపై ఎస్కే సిన్హాను ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి కలిసి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరడంతో.. త్వరలోనే జీఓను విడుదల చేసేందుకు ఆయన అంగీకరించారన్నారు. తద్వారా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారికే కాకుండా, పదవీ విరమణ చేసిన, చేయబోయే వారికి కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇంక్రిమెంట్లు పొందేందుకు మార్గం సుగమం గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : ఒక రోజు సమ్మె కాలానికి ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువడించినట్టు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గొల్లప్రోలు మండల శాఖ అధ్యక్షుడు కె సత్తిరాజు, కె కాశీవిశ్వనాథ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్జిత సెలవు మంజూరు చేయాలని యూటీఎఫ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖల చేసిందన్నారు. దానిపై కోర్టు శనివారం తీర్పు వెలువరించిందన్నారు. జిల్లాలోని 4 వేల మంది ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు పొందేందుకు మార్గం సుగమమైందన్నారు.