ప్రభుత్వ వైఖరిపై ఎస్టీయూ నిరసన | State Teachers Union stage dharna infront of Tahsildar Office | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఖరిపై ఎస్టీయూ నిరసన

Dec 15 2015 3:53 PM | Updated on Sep 3 2017 2:03 PM

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు.

వెల్దుర్తి (మెదక్) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.యాదగిరి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి డిప్యూటీ ఈవో, డీఈవో, జేఎల్, డైట్ లెక్చరర్ల పదోన్నతులను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయులకు షరతుల్లేని నగదు రహిత హెల్త్‌కార్డులను అందజేసి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న కలెక్టరేట్ల వద్ద,  29న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement