breaking news
Srivari Tirumala Temple
-
శ్రీనివాసం కాంప్లెక్స్‌లో టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ
-
ఆన్ లైన్లో కళ్యాణోత్సవ సేవ.. రేపటి నుంచి టికెట్లు
సాక్షి, తిరుమల : గురువారం నుంచి ఆన్ లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఆగష్టు7 నుంచి 31వ తేది వరకు సంబంధించిన కళ్యాణోత్సవ సేవా టిక్కెట్లను గురువారం విడుదల చేయనున్నట్లు తిరుమల టీటీడీ అధికారులు తెలియజేశారు. అయితే ఈ కల్యాణోత్సవ సేవలో భక్తులు ఆన్ లైన్ లో పాల్గొననున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవ సేవ ప్రారంభం కానుంది. మొదట పది నిముషాలు టిక్కెట్లును కలిగిన భక్తులకు అర్చకులు సంకల్పం చెప్పించనున్నారు. ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులు విధిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని టీటీడీ స్పష్టం చేసింది. వస్త్రం, లడ్డూ ప్రసాదం, అక్షింతలను పోస్టల్ ద్వారా భక్తుల ఇంటికి పంపిణీ చేయబోతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఆదివారం ఇద్దరు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తరువాత వకుళమాతదేవిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. - తిరుమల