breaking news
srivari kalyanam grand celebration
-
గ్లౌసెస్టర్షైర్లో ఘనంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం
గ్లౌసెస్టర్షైర్ ఇంటర్నేషనల్ హిందూ కమ్యూనిటీ అసోసియేషన్ (IHCAG) ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 శ్రీ బాలాజీ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్సీ , వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగరెడ్డి సతీష్ రెడ్డి, స్లౌ డిప్యూటీ మేయర్ చంద్ర మువ్వల, పలువురు ప్రముఖ కమ్యూనిటీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని టీటీడీ వేద పాఠశాల పూర్వ విద్యార్థులైన అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి బీబీసీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో ప్రసారం కానుంది. ఇంటర్వ్యూ సందర్భంగా IHCAG నిర్వాహకులు, ప్రతినిధి శివరామ రెడ్డి గూడూరు, గ్లౌసెస్టర్షైర్లో శ్రీ బాలాజీ ఆలయాన్ని నిర్మించాలనే IHCAG లక్ష్యాన్ని వివరించారు. ఈ మహత్తర స్వప్నాన్ని సాకారం చేసేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారం, మద్దతు అవసరమని చర్చలో పేర్కొన్నారు. ప్రతిపాదిత ఆలయం ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కేంద్రంగా నిలవనుంది.ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, మన సమాజం చేస్తున్న విలువైన సేవలను ప్రపంచానికి తెలియజేసిన మానీ మసీహ్కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన మహారాజు కింగ్ చార్లెస్ III నియమించిన డిప్యూటీ లెఫ్టినెంట్, బీసీసీ ప్రజెంటర్‌గా సేవలందిస్తున్నారు.చర్చల సందర్భంగా సతీష్ రెడ్డి భారతీయ రాజకీయాలు, సమాజ సేవ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే IHCAG ఈ మహత్తర సంకల్పానికి మద్దతుగా సంకల్పం తీసుకుని, తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నుంచి అవసరమైన మద్దతు, నిధులను సమకూర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సహకరిస్తానని తన నిబద్ధతను వ్యక్తం చేశారు.ఈ మహోన్నత కార్యక్రమానికి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, మద్దతుకు సతీష్ రెడ్డికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, భక్తులు, శ్రేయోభిలాషులు, సమాజంలోని ప్రతి ఒక్కరి నిరంతర సహకారంతో, గ్లౌసెస్టర్షైర్లో శ్రీ బాలాజీ ఆలయాన్ని నిర్మించాలనే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. -
ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
కల్యాణం.. వైభవం


