breaking news
Sringeri Peetham
-
శంకరమఠంలో దొంగలు పడ్డారు..!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ క్షేత్రమైన శృంగేరీ పీఠం ప్రధాన కేంద్రమైన నల్లకుంటలోని శంకరమఠంలో దొంగలు పడ్డారు. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇది ఇంటి దొంగల పనే కావొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకునే బంగారు అభరణాలు భద్రపరిచే గదినుంచి కొన్ని వారాల క్రితమే మాయమైనట్టు మఠం అధికారులు వెల్లడించారు. ఇద్దరు క్లర్కు స్థాయి ఉద్యోగులు శ్రీనివాస్, సాయిని తొలగించామని తెలిపారు. అయితే, ఈ విషయం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి దృష్టికి వెళ్లడంతో.. వారి ఆదేశాల మేరకు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. సాయి అనే ఉద్యోగిని నల్లకుంట పోలీసులు శనివారం విచారించనున్నట్టు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శృంగేరి పీఠం ఉత్తరాధికారిగా తిరుపతి బిడ్డ
సాక్షి, తిరుమల: కర్ణాటకలోని శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి (తదుపరి పీఠాధిపతి)గా తిరుపతికి చెందిన కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ(22) నియమితులయ్యా రు. ప్రసాద శర్మను ఉత్తరాధికారిగా ఆ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి ఆదివారం ప్రక టించారు. ఆయన తండ్రి శివ సుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్‌గా, తిరుపతిలోని ఎస్వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 23న ఉత్తరాధికారి బాధ్యతలు చేపట్టనున్నారు.