breaking news
Sri Lanka Vs Zimbabwe
-
T20 WC 2026: సికందర్ రజా ప్రపంచ రికార్డులు
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అటు సారథిగా.. ఇటు ఆటగాడిగా అతడు సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. ‘అండర్డాగ్’గా ఈ టోర్నీ బరిలో దిగిన జింబాబ్వే.. అనూహ్య రీతిలో సూపర్-8 దశకు చేరుకుంది.మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి మార్గం సుగమం చేసుకున్న జింబాబ్వే.. శ్రీలంకను కూడా ఓడించి గ్రూప్-బి టాపర్‌గా నిలిచింది. ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్‌లో జింబాబ్వే విజయంలో సికందర్ రజాదే కీలక పాత్ర. కొలంబో వేదికగా లంక విధించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.లక్ష్య ఛేదనలో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్), తాడివనాషే మరుమాని (34) శుభారంభం అందించగా.. రజా కెప్టెన్ ఇన్నింగ్స్ (26 బంతుల్లో 45)తో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్‌లో రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డులుఅంతర్జాతీయ టీ20లలో అత్యధికంగా ఇరవైసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఫుల్ మెంబర్ జట్టు ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా అత్యంత పెద్ద వయసులో ఐసీసీ టోర్నీలో ఈ పురస్కారం పొందిన ఆటగాడిగా భారత దిగ్గజం రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రజా బద్దలు కొట్టాడు.కాగా 2025 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ 37 ఏళ్ల 335 రోజుల వయసులో POTM పొందగా.. రజా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో తాజాగా 39 ఏళ్ల 301 రోజుల వయసులో అవార్డు పొందాడు.టెస్టు హోదా ఉన్న జట్ల (ఫుల్ మెంబర్) తరఫున అంతర్జాతీయ టీ20లలో అత్యధికసార్లు POTM పొందిన ఆటగాళ్లుసికందర్ రజా- జింబాబ్వే- 20సార్లుసూర్యకుమార్ యాదవ్- ఇండియా- 17సార్లువిరాట్ కోహ్లి- ఇండియా- 16సార్లుమహ్మద్ నబీ- అఫ్గనిస్తాన్- 14సార్లు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’ -
సూపర్-8లో తొలి మ్యాచ్ గెలుస్తాం: సికందర్ రజా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పసికూన జింబాబ్వే అంచనాలకు మించి రాణిస్తోంది. గ్రూప్-బిలో తొలుత ఒమన్‌ను మట్టికరిపించిన రజా బృందం.. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని రీతిలో షాకిచ్చింది.గెలుపు గాలివాటం కాదుతదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్-8కు అర్హత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియాను ఎలిమినేట్ చేసిన జింబాబ్వే.. లీగ్ దశలో ఆఖరిగా పటిష్ట శ్రీలంకతో తలపడింది. అనూహ్య రీతిలో కొలంబో వేదికగా గురువారం శ్రీలంకను సైతం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రజా బృందం.. తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది.ఇక్కడితో ఆగిపోముసగర్వంగా గ్రూప్-బి టాపర్‌గా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జింబాబ్వే కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సికందర్ రజా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్‌లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌లో ప్రదర్శనను విశ్లేషించుకుంటూ ముందుకు పోతున్నాం.మున్ముందు ఏదైనా సాధ్యమేఅన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహం పెరిగింది. లీగ్ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా!..మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!సూపర్-8లో మేము మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!.. మా అభిమానుల గుండెల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాము. గ్రూప్ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉంది. ముందుగా చెప్పినట్లు అండర్డాగ్ స్టోరీస్ అందరికీ ఆకర్షిస్తాయి. 23 నాటి మ్యాచ్ మాకు షో టైమ్’’ అని సికందర్ రజా ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా సూపర్-8లో భాగంగా జింబాబ్వే ఫిబ్రవరి 23న వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 26న భారత్, మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడుతుంది. జింబాబ్వేతో పాటు ఈ ప్రత్యర్థి జట్లన్నీ లీగ్ దశను అజేయంగా ముగించడం విశేషం. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో జర జాగ్రత్తPure dominance by Zimbabwe. 🇿🇼They keep their unbeaten tag alive as they brush aside Sri Lanka. 👏Next stop: The Super 8s! 🙌ICC Men’s #T20WorldCup | #AFGvCAN | LIVE NOW ➡️ https://t.co/0BcVdzugXC pic.twitter.com/pJSD74tlFs— Star Sports (@StarSportsIndia) February 19, 2026 -
శ్రీలంకకు షాకిచ్చిన జింబాబ్వే
ముక్కోణపు టీ20 టోర్నమెంట్ తొలి పోరులో ఆతిథ్య పాకిస్తాన్ చేతిలో ఓడిన జింబాబ్వే... ఆ పరాజయం నుంచి వేగంగా కోలుకొని సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి టోర్నీలో బోణీ కొట్టింది. గురువారం రావల్పిండి వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో జింబాబ్వే 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టీ20ల్లో శ్రీలంకతో పదోసారి ఆడిన జింబాబ్వే మూడో విజయాన్ని అందుకుంది. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. బ్రియాన్ బెనెట్ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సికందర్ రజా (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ 3 వికెట్లు పడగొట్టగా... ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా విఫలమై 95 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ దసున్ షనక (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాజపక్స (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 3, రిచర్డ్ నగరవా 2 వికెట్లు తీశాడు.చదవండి: ‘యాషెస్’ సమరానికి సిద్ధం -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్
జింబాబ్వే వెటరన్ క్రికెటర్ సీన్ విలియమ్స్ (Sean Williams)సరికొత్త అధ్యాయం లిఖించాడు. అంతర్జాతీయ టీ20లలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. తద్వారా ఇన్నాళ్లు.. బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan) పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.శ్రీలంకతో తాజా టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ సందర్భంగా సీన్ విలియమ్స్ ఈ ఘనత సాధించాడు. కాగా రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం శ్రీలంకక్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. 2-0తో జింబాబ్వే క్లీన్‌స్వీప్ అయింది.రిటైర్మెంట్ ప్రకటించి..ఈ క్రమంలో బుధవారం టీ20 సిరీస్ మొదలుకాగా.. సీన్ విలియమ్స్ పునరాగమనం చేశాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత మళ్లీ జింబాబ్వే టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా 38 ఏళ్ల సీన్ విలియమ్స్.. గతేడాది మే 12న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 ఆఫ్రికన్ క్వాలిఫయర్స్ నేపథ్యంలో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విలియమ్స్.. సెప్టెంబరులో జరిగే ఈ మ్యాచ్‌లలో పాల్గొనున్నాడు. అయితే, అంతకంటే ముందు లంకతో సొంతగడ్డపై సిరీస్ సందర్భంగానే రీఎంట్రీ ఇచ్చేశాడు.ప్రపంచ రికార్డుహరారే వేదికగా శ్రీలంకతో తొలి టీ20 సందర్భంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సీన్ విలియమ్స్.. 11 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్ల సాయంతో 14 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఆట పరంగా రాణించకపోయినా.. సుదీర్ఘ అంతర్జాతీయ టీ20 క్రికెట్ ప్రయాణంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.2006 నుంచి.. కాగా 2006లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా సీన్ విలియమ్స్ జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు తన 82 టీ20లు ఆడి 1705 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 24 టెస్టుల్లో 1946, 164 వన్డేల్లో 5217 రన్స్ రాబట్టాడు.కాగా తాజా రీఎంట్రీతో సీన్ విలియమ్స్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో 18 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రపంచంలో సుదీర్ఘకాలం ఇలా ఇంటర్నేషనల్ టీ20లలో కొనసాగుతున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత బంగ్లా దిగ్గజం షకీబ్ అల్ హసన్ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్న క్రికెటర్లు🏏సీన్ విలియమ్స్ (జింబాబ్వే)- 2006- 2025* - 18 ఏళ్ల 279 రోజులు- 129 మ్యాచ్‌లు🏏షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2006- 2024- 17 ఏళ్ల 166 రోజులు- 82 మ్యాచ్‌లు🏏మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2007- 2024- 17 ఏళ్ల 41 రోజులు- 141 మ్యాచ్‌లు🏏రకీప్ పటేల్ (కెన్యా)- 2008- 2025- 16 ఏళ్ల 357 రోజులు- 88 మ్యాచ్‌లు🏏రిచర్డ్ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్)- 2008- 2005- 16 ఏళ్ల 343 రోజులు- 102 మ్యాచ్‌లు🏏రోహిత్ శర్మ (ఇండియా)- 2007- 2024- 16 ఏళ్ల 2024- 16 ఏళ్ల 284 రోజులు- 159 మ్యాచ్‌లు.చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు..


