భూసేకరణను త్వరగా పూర్తిచేయాలి
కాకినాడ సిటీ : జిల్లాలో కెనాల్రోడ్, సామర్లకోట–రాజానగరం ఏడీబీ రోడ్డు విస్తరణకు భూసేకరణ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిం చారు. ఏలేరు భూసేకరణను రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. కాకినాడ –రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ పరి ధిలో 19 ఆలయాలున్నాయని, రోడ్డు విస్తరణకు వాటిని త్వరగా తొలగించాలని ఆదేశించారు. కెనాల్రోడ్డు బాధితులకు కేటాయించిన భూమి చదునుకు రూ.17 లక్షలు మంజూరైనట్టు తెలిపారు. కాకినాడ, రామచంద్రపురం ఆర్డీఓలు అంబేడ్కర్, సుబ్బారావు పాల్గొన్నారు. ప్రజాసాధికార సర్వేలో ఇప్పటివరకు 2,76,456 కుటుంబాలకు చెందిన 7,84,271 మంది వివరాలు సేకరించి జిల్లా రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిందని జేసీ సత్యనారాయణ తెలిపారు.