breaking news
speeding bmw car
-
బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ కారు
ముంబై: ముంబై కోస్టల్ రోడ్డుపై ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.బీఎండబ్ల్యూ కారు మెరైన్ డ్రైవ్ నుంచి హాజీఅలీ వైపు కోస్టల్ రోడ్డుపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కారు ముందుగా బ్రిడ్జి గోడను ఢీకొట్టి.. అక్కడి నుంచి కిందకి పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్ల పార్కింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రమాదంపై తెల్లవారుజామున 5:20 గంటల సమయంలో కోస్టల్ రోడ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. కారులో ఉన్న నలుగురినీ వెంటనే నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు.మృతులను షనాయ్ గజ్జల్(21), ధైర్య దర్శన్ సేథ్(17), ఆదిత్య జకాస్నియా(19)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్(23)కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Three killed, one injured as speeding BMW crashes on Coastal Road in Mumbai.#Mumbai #BMWcrash pic.twitter.com/Mt0fXslLdN— Ravinder Singh (@ravindraJourno) September 20, 2026ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఒరిగిన భవనం.. ఎలా కూల్చేశారంటే.. -
పాపం డ్రైవర్.. ఉద్యోగంలో చేరిన తొలిరోజే!
షోయబ్ కోహ్లీ ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తుంటాడు. అతడికి ఖరీదైన కార్లన్నా.. వాటిలో వేగంగా వెళ్లడమన్నా చాలా ఇష్టం. అలాగే తన బీఎండబ్ల్యు కారును గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఓ టాక్సీని ఢీకొన్నాడు. నజ్రుల్ ఇస్లాం అనే వ్యక్తి తొలిరోజు ఉబర్ టాక్సీ డ్రైవర్‌గా చేరాడు. అతడి టాక్సీనే షోయబ్ కోహ్లీ ఢీకొట్టగా, ఇస్లాం అక్కడికక్కడే మరణించాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు, నాయనమ్మ ఉన్నారు. వాళ్లందరినీ పోషించాల్సిన బాధ్యత ఇస్లాం మీదే ఉంది. ఈ కేసులో కోహ్లీని పోలీసులు అరెస్టు చేసినా.. రెండు రోజులలోనే బెయిల్ మీద విడుదల చేశారు. తాను తాగి నడపలేదని కోహ్లీ చెబుతున్నా, అతడు ఆ సమయంలో విపరీతమైన వేగంతో ఉన్నాడని, కారు మీద నియంత్రణ కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. బీఎండబ్ల్యు కారు కూడా తుక్కుతుక్కు అయిపోయింది. టాక్సీ డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేయడం వల్లే తాను తన కారు ఆపలేక అతడిని ఢీకొట్టినట్లు షోయబ్ కోహ్లీ వాదిస్తున్నాడు. కల్కాజీ నుంచి వసంత కుంజ్ బయల్దేరిన రెండు కార్లూ పూర్తిగా తుక్కుతుక్కుగా మారాయి. బీఎండబ్ల్యు కారు ఢీకొనడంతో క్యాబ్ గాల్లోకి లేచి, కొద్ది మీటర్ల దూరం వెళ్లింది. ఢిల్లీ ఐఐటీ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద అది ఆగింది. అప్పుడు ఏదో బాంబు పేలినట్లు శబ్దం వినిపించింది. ప్రమాదం సంభవించిన కొద్దిసేపటికే షోయబ్ కోహ్లీ అక్కడినుంచి పరారయ్యాడు. తాను అక్కడే ఆగి ఉబర్ డ్రైవర్‌కు సాయం చేద్దామనుకున్నా, అక్కడున్నవాళ్లు కొడతారని భయపడి ఆటోలో వెళ్లిపోయానన్నారు. క్యాబ్ డ్రైవర్ చనిపోతే.. నిందితుడికి ఒక్కరోజులో బెయిల్ ఇచ్చారని, ఇది ఎంతవరకు న్యాయమని మరో ఉబర్ డ్రైవర్ సందీప్ కుమార్ ప్రశ్నించారు. మృతుడు నజ్రుల్ ఇస్లాం భార్య ఇళ్లలో పనిచేసుకుంటుంది.


