breaking news
software consultant
-
ఓటుతో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి
భారత ఎన్నికల సంఘం ప్రచారకర్త జేఏ చౌదరి ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ఓటుపైననే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్న విషయాన్ని నేటి యువత తెలుసుకోవాలని భారత ఎన్నికల (ఈసీఐ)సంఘం ప్రచారకర్త, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు జేఏ చౌదరి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓటరు నమోదుకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటు ద్వారానే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి వీలుంటుం దని ఆయన అన్నారు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మనదేశంలో మేథావులు, విద్యావంతులు ఓటు హక్కును వినియోగించుకోవడంలో అశ్రద్ధను వహిస్తుండడం శోచనీయమన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులంద రూ విధిగా తమ ఓట్లను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ ంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన దేశంలో ఓటుకు ఎంతో విలువ ఉందన్నారు. దేశ దశ, దిశను మార్చగలిగే శక్తి కేవలం ఓటుకు మాత్రమే ఉందన్న విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మన దేశంలో సాంకేతిక వనరులు పుష్కలంగా ఉన్నా సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మేథావులను, గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన కోరారు. కష్టపడే మనస్తత్వం కలిగి ఉండడంతో పాటు సమయపాలన పాటించిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన అన్నారు.సమావేశంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన సార్ధకత చేకూరుతుందన్నారు. ఇప్పటికీ కొందరు ఓటు విలువను తెలుసుకోలేక పోతుండడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ గిరిజన విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆంగోత్ వెంకటేశ్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
అమెరికాలో భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణుడికి జైలుశిక్ష, దేశ బహిష్కరణ!
అమెరికా మహిళపై లైంగిక దాడికి పాల్పడారనే ఆరోపణలపై భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణుడికి తొమ్మిది నెలల జైలుశిక్షతోపాటు, దేశ బహిష్కరణ శిక్షను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు విధించింది. ఈ కేసులో ముద్దాయి శ్రీనివాస్ ఎర్రమిల్లికి 5 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. అయితే ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు శ్రీనివాస్ పిటిషన్ పై యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి జాన్ హెచ్ లెఫ్కో వచ్చే బుధవారం వాదనలు విననున్నారు. విమానప్రయాణంపై నిషేధం విధించడమే కాకుండా.. శిక్ష కాలం తర్వాత భారత్ కు పంపించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది. గతంలో ఇలాంటి కేసులో రెండింటిలో కూడా శ్రీనివాస్ దోషిగా ఉండటంతో న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. కోర్టు అందించిన వివరాల ప్రకారం 2011 సంవత్సరం జూన్ 14 తేదిన షికాగో మిడ్ వే ఎయిర్ పోర్ట్ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు వీలుగా శ్రీనివాస్ కు ఓపెన్ సీట్ కేటాయించగా.. ఆ సీటు బాధితురాలికి, ఆమె భర్తకు మధ్యలో లభించిందని తెలిపింది. రాత్రి వేళ నిద్రకు సౌకర్యంగా ఉంటుందని భాధితురాలు కిటీకి పక్కన సీటు ఎంచుకుందని.. మధ్యలో సీటు శ్రీనివాస్ లభించిందని కోర్టు వెల్లడించింది. రాత్రి వేళలో బాధితురాలిని లైంగికంగా వేధించడంతో శ్రీనివాస్ పై ఫిర్యాదు నమోదు చేశారు. ఈకేసులో విచారణ చేపట్టిన కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షతోపాటు, దేశ బహిష్కరణ శిక్షను విధించింది.


