అమెరికాలో భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణుడికి జైలుశిక్ష, దేశ బహిష్కరణ!


అమెరికా మహిళపై లైంగిక దాడికి పాల్పడారనే ఆరోపణలపై భారతీయ సాఫ్ట్ వేర్ నిపుణుడికి తొమ్మిది నెలల జైలుశిక్షతోపాటు, దేశ బహిష్కరణ శిక్షను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు విధించింది. ఈ కేసులో ముద్దాయి శ్రీనివాస్ ఎర్రమిల్లికి 5 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. అయితే ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు  శ్రీనివాస్ పిటిషన్ పై యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి జాన్ హెచ్ లెఫ్కో వచ్చే బుధవారం వాదనలు విననున్నారు. విమానప్రయాణంపై నిషేధం విధించడమే కాకుండా.. శిక్ష కాలం తర్వాత భారత్ కు పంపించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది. గతంలో ఇలాంటి కేసులో రెండింటిలో కూడా శ్రీనివాస్ దోషిగా ఉండటంతో న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. 


 


కోర్టు అందించిన వివరాల ప్రకారం 2011 సంవత్సరం జూన్ 14 తేదిన షికాగో మిడ్ వే ఎయిర్ పోర్ట్ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు వీలుగా శ్రీనివాస్ కు ఓపెన్ సీట్ కేటాయించగా.. ఆ సీటు బాధితురాలికి, ఆమె భర్తకు మధ్యలో లభించిందని తెలిపింది.  రాత్రి వేళ నిద్రకు సౌకర్యంగా ఉంటుందని భాధితురాలు కిటీకి పక్కన సీటు ఎంచుకుందని.. మధ్యలో సీటు శ్రీనివాస్ లభించిందని కోర్టు వెల్లడించింది. రాత్రి వేళలో బాధితురాలిని లైంగికంగా వేధించడంతో శ్రీనివాస్ పై ఫిర్యాదు నమోదు చేశారు. ఈకేసులో విచారణ చేపట్టిన కోర్టు తొమ్మిది నెలల జైలు శిక్షతోపాటు, దేశ బహిష్కరణ శిక్షను విధించింది. 


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top