breaking news
smartcard
-
ఊరు పేరు మాదే.. జిల్లా పేరు అడగొద్దు!
ఈ చిత్రం చూశారా... ఇది వీరఘట్టం మండలం దయానిధిపురం గ్రామానికి చెందిన చొంగల రామచంద్రరావుకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డు. పేరు, ఊరుపేరు, మండలం పేరు సరిగా ఉన్నా జిల్లా పేరు పార్వతీపురం మన్యం స్థానంలో విజయనగరం అని ముద్రించారు. వివిధ ధ్రువపత్రాల కోసం స్మార్ట్‌కార్డు జెరాక్స్‌ను దరఖాస్తుకు జతచేసిన సమయంలో జిల్లా పేరు తప్పుగా నమోదుకావడంతో అభ్యంతరం తెలుపుతున్నారు. దీనిని సరిచేసేందుకు ఆయన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.ఈ చిత్రంలోని స్మార్ట్ కార్డును చూశారా.. ఇది పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన కేసిరెడ్డి గంగరాజుకు ఇటీవల కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్‌కార్డు. ఆయన గ్రామం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండగా, శ్రీకాకుళం అని ముద్రించారు. ఈయనకూ తిప్పలు తప్పడం లేదు. జిల్లా పేరు ఏది అని అధికారులు ప్రశ్నించగానే కార్డులో తప్పుగా ముద్రించారని, తమ ప్రమేయం లేదంటూ బదులివ్వాల్సిన పరిస్థితి. సాక్షి, పార్వతీపురం మన్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వం మంజూరు చేసిన బియ్యం కార్డులను(రేషన్) మార్పు చేసిన విషయం విదితమే. వాటి స్థానంలో క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోంది. ముద్రణలోపంతో అవి కాస్త తప్పులతడకగా మారాయి. జిల్లాలో 2,73,000 మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కొత్తగా కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. కొద్దిరోజులుగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో వీటిని అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారు. రేషన్‌లో అక్రమాలను అరికట్టేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని గొప్పగా చెప్పుకొంటున్నారు. వీటితో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందవచ్చని ఆర్భాటంగా ఊదరగొడుతున్నారు. కార్డులు పొందిన లబి్ధదారుల పరిస్థితి మరోలా ఉంది. అక్రమాల మాట దేవుడెరుగు.. ఇందులో ఉన్న తప్పులను ఎవరు సరిదిద్దుతారంటూ లబోదిబోమంటున్నారు. ముద్రణ అస్తవ్యస్తం కార్డుల ముద్రణలో విపరీతమైన తప్పులు దొర్లాయి. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1.22 లక్షల కార్డుల పంపిణీ పూర్తయింది. ఇందులో చాలా వరకు తప్పులు కనిపిస్తున్నాయి. ఇంటి యజమాని పేరిట కార్డు రాగా... అందులో భార్య స్థానంలో కుమార్తె పేరు ఉంటోంది. మరోచోట తండ్రి స్థానంలో తల్లిపేరు ముద్రించారు. మండలం, చిరునామా సక్రమంగా ఉన్నా.. చివరన జిల్లాల పేర్లలో తప్పులు దొర్లాయి. కొమరాడ మండలానికి చెందిన ఓ కార్డుదారుడి వివరాల్లో జిల్లాను విజయనగరంగా చూపారు. వీరఘట్టం తహసీల్దారు కార్యాలయం పరిధిలోని ఓ కార్డుదారుడి చిరునామా వద్ద విజయనగరం జిల్లాగా నమోదైంది. పాలకొండ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని మరో కార్డులో శ్రీకాకుళం జిల్లాగా ముద్రించారు. ఇలా దాదాపు అన్ని కార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో లబి్ధదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఏ సంక్షేమ పథకం అందుకోవాలన్నా.. పిల్లల విద్యాపరంగా ఎటువంటి ధ్రువపత్రం, లబ్ధి పొందాలన్నా.. ఆధార్‌కార్డుతో రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో చిరునామాలు, ఇతర వివరాలు తప్పుగా ఉండడం వల్ల ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలే మార్చేయడం వల్ల భవిష్యత్తులో పథకాలు, ఇతర రాయితీలకు దూరమవుతామేమోనని అంటున్నారు. ఇంటి వద్దకే రేషన్ పథకానికి మంగళం పాడి.. వాస్తవానికి గత ప్రభుత్వమే రేషన్ పోర్టుబిలిటీని తీసుకొచ్చింది. ఎక్కడైనా రేషన్ పొందే సౌలభ్యం కలి్పంచింది. దీంతోపాటు ఎండీయూ వాహన వ్యవస్థతో నేరుగా ఇంటి వద్దకే సరకులను అందించేవారు. గిరిజన జనాభా అధికంగా ఉండే మన్యం జిల్లాలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడేది. రేషన్ సరకుల కోసం ఎక్కడో సుదూరాన ఉన్న చౌకధరల దుకాణాలకు వెళ్లే బాధ లబి్ధదారులకు తప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ విధానానికి మంగళం పాడింది. లబి్ధదారులకు మళ్లీ పాత కష్టాలను పునరావృతం చేసింది. ప్రధానంగా గిరిజనులు కొండలు దిగి, రేషన్ తీసుకెళ్తున్న పరిస్థితులు వస్తున్నాయి. ఇవేవీ చాలవన్నట్లు గత ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం కార్డులను రద్దు చేసి, వాటి స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తోంది. ఆ పనీ సక్రమంగా చేయక, తప్పులతో ముద్రణ చేసి లబి్ధదారులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్వాకాన్ని చూసి ‘ఇదేనా కూటమి ప్రభుత్వం స్మార్ట్.. ఇదేనా సాంకేతికతా?’ అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఒక్క టికెట్.. తీరొక్క జర్నీ
సాక్షి, హైదరాబాద్: ఒక్క టికెట్‌పై తీరొక్క రవాణా అందుబాటులోకి రానుంది. బస్సు, రైలు, క్యాబ్, ఆటో అన్నింటికీ ఇక ఒకే టిక్కెట్. సమయానికి ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనంలో ఎంచక్కా బయలుదేరవచ్చు. ఠంఛన్‌గా అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఈ స్మార్ట్కార్డుతో షాపింగ్ కూడా చేయొచ్చు. వస్తువులు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం నోయిడా, నాగ్‌పూర్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ‘సింగిల్ టికెట్‌పై మల్టీ ట్రాన్స్పోర్ట్ జర్నీ’త్వరలో నగరంలో అందుబాటులోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సిటీబస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు ఉబర్, ఓలా క్యాబ్‌లు, ఆటోల్లో కూడా ఒకే టికెట్‌పైన ప్రయాణం చేయవచ్చు. ప్రజారవాణాలో ముందడుగుగా భావించే మల్టీట్రాన్స్పోర్టు స్మా ర్ట్ కార్డుపైన సోమవారంఇక్కడి బస్‌భవన్‌లో విస్తృత చర్చలు జరిగాయి. ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ నేతృ త్వంలో ఏర్పాటైన టాస్క్‌పోర్స్ కమిటీలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్లు శర్మ, అల్కా, ఎల్అండ్టీ ప్రతినిధులు అనిల్ సైనీ, రవీందర్‌రెడ్డి, ఉబర్, ఓలా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీట్రాన్స్పోర్ట్ స్మార్ట్‌కార్డు వ్యవస్థ పనితీరు, ప్రయోజనాలు తదితర అంశాలపై ఎస్బీఐ అధికారులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నోయిడా, నాగ్‌పూర్‌లలో అమలవుతున్న స్మార్టుకార్డుల పనితీరును వివరించారు. ఆ నగరాల్లో కేవలం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లకు మాత్రమే ఈ సింగిల్ టిక్కెట్ సిస్టమ్ పరిమితం. నగరంలో అన్ని రకాల ప్రజారవాణా సదుపాయాలను ఒక గొడుగు కిందకు తెచ్చేవిధంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెటీరియల్‌ను ఎస్బీఐ అందజేయనుంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదా యం సైతం ఎస్బీఐ నుంచి ఆయా రవాణా సంస్థలకు వెళ్తుంది. ‘ఓలా, ఉబర్ సంస్థలకు అనుబంధంగా నడుస్తున్న ఆటోరిక్షాలను కూడా దీని పరిధిలోకి తేవడం ద్వారా ప్రజలకు నిరంతరాయ ప్రయాణ సదుపాయం లభిస్తుంది’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా పనిచేస్తుంది: సింగిల్ టికెట్ మల్టీ ట్రాన్స్‌పోర్టు స్మార్ట్‌కార్డులను స్టేట్‌బ్యాంకు అన్ని చోట్ల విక్రయిస్తుంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, బస్‌పాస్ కౌంటర్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి అన్ని ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తారు. ప్రయాణికులు మొదట రూ.50 చెల్లించి ఈ కార్డును కొనుగోలు చేయాలి. తరువాత రూ.200 నుంచి రూ.2000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. తమ అవసరం మేరకు ప్రయాణం చేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాల్లోనే వీటి వినియోగం ఉంటుంది. ఇందుకోసం బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రత్యేకంగా తయారు చేసిన టిక్కెట్ ఇష్యూ మిషన్లు(టిమ్స్) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు బస్సు లేదా రైలు ఎక్కిన వెంటనే స్వైప్ చేయవచ్చు. ఉదాహరణకు ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు బస్సులో వచ్చిన ప్రయాణికుడు అమీర్‌పేట్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మరో చోటుకు క్యాబ్లోగాని, ఆటోలోగాని వెళ్లవచ్చు. లింగంపల్లి నుంచి బేగంపేట వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు అక్కడి నుంచి సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు. ఇలా తమ అవసరానికి అనుగుణంగా ఎక్కడికంటే అక్కడికి అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఆర్టీసీలో మొదట ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో దీన్ని ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సుల్లోకి విస్తరిస్తారు. ఈ స్మార్ట్‌కార్డు వల్ల సిటీ బస్సుల్లో తిరుగుతున్న 33 లక్షల మందికి అలాగే ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి మెట్రో సేవలను వినియోగించుకుంటున్న మరో 70 వేల మందికిపైగా ప్రయోజనం లభించనుంది. ఈ కార్డును వినియోగించే వారికి తాము పయనించిన దూరం, అందుకోసం చెల్లించిన డబ్బుల వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా చేరుతాయి. దీంతో తమ అకౌంట్లో ఇంకా ఎన్ని డబ్బులున్నాయి... ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు... అనే అంశంపైన ప్రయాణికులకు అవగాహన కలుగుతుంది. బస్‌పాస్‌లకు వర్తింపు... బస్‌పాస్ వినియోగదారులు కూడా ఈ స్మార్ట్‌కార్డులను వినియోగించుకోవచ్చు. ఇందుకోసంకార్డులో ఒక ఆప్షన్ ఉంచుతారు. ప్రయాణికులు తమ నెల వారీ సాధారణ పాస్‌లు, ఎన్జీవో, స్టూడెంట్, తది తర పాస్‌లను దీనితో అనుసంధానం చేసి పయనించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 నుంచి 7 లక్షల మంది బస్‌పాస్ వినియోగదారులకు కూడా ఈ సదుపాయం లభించనుంది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా లభించే మరో సదుపాయం షాపింగ్. ప్రయాణికులు దీనిని క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలో వినియోగిస్తూ షాపింగ్ చేయవచ్చు. ఒక స్మార్ట్కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు లభించే విధంగా రూపొందిస్తున్నారు. -
‘నెబ్యులా’తో మెట్రో రైలు జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మెట్రో రైలు ప్రయాణాన్ని ‘స్మార్ట్’ చేస్తున్నారు. టిక్కెట్ల గోల లేకుండా మెట్రో స్మార్ట్ కార్డు ‘నెబ్యులా’ను తీసుకొస్తున్నారు. దీని ధర రూ.100, మరో రూ.100తో రీచార్జి చేసుకోవాలి. అంతేకాదు గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డులను ఈనెల మూడో వారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ విక్రయాలకు త్వరలో వెబ్‌సైట్‌ను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించనుంది. మనం బయలుదేరే స్టేషన్ మొదటి అంతస్తులోని ‘ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్’ గేటు వద్ద ఈ కార్డును స్వైప్ చేయాలి. రైలు దిగాక స్టేషన్‌లోని ఎగ్జిట్ గేటు వద్ద మరోమారు స్వైప్ చేస్తే చాలు.. ప్రయాణించిన దూరానికి అయిన చార్జీ కార్డు నుంచే కట్ అవుతుంది. భవిష్యత్‌లో ఈ కార్డుతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, మెట్రోమాల్స్, స్టేషన్లలో షాపింగ్.. ఇలా 16 రకాల సేవలు పొందే అవకాశముంది. కాగా మెట్రో కనిష్ట టిక్కెట్ ధర రూ.10, గరిష్టంగా రూ.50 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. -
స్మార్ట్ కార్డులో హీరోయిన్ ఫొటో
హొసూరు : తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డులకు బదులుగా అందజేస్తున్న స్మార్ట్‌కార్డులో కుటుంబ యజమాని ఫొటో బదులుగా హీరోయిన్ ఫొటోను ముద్రించా రు. ఈ సంఘటన సేలం ప్రాంతంలో జరిగింది. సేలం జిల్లా ఓమలూరు తాలూక కామలాపురం గ్రామానికి చెందిన పెరియతంబి భార్య సరోజ (67). వీరికి గత నెలలో రేషన్‌కార్డుకు బదులుగా స్మార్ట్‌కార్డు వచ్చిందని, సమీపంలోని రేషన్ దుకాణంలో కార్డును తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో సరోజ రేషన్ దుకాణానికెళ్లి స్మార్ట్ కార్డును తీసుకోగా అందులో సరోజ ఫొటోకు బదులుగా సినీ నటి కాజల్ అగర్వాల్ ఫొటోను ఉంది. -
పింఛన్ పంపిణీకి ఫినో
జిల్లాలో మొత్తం 4,12,111 మంది పింఛన్‌దారులు ఉండేవారు. దాదాపు ఆరు నెలల నుంచి స్మార్ట్‌కార్డు విధానాన్ని అమలు చేస్తున్నారు. వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఒకేసారి జిల్లా వ్యాప్తంగా 1.42 లక్షల మందికి పింఛన్లు ఆగిపోయాయి. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళుతున్నా.. ప్రతినెలా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. దీనివల్ల అందరికీ పింఛన్లు అందడం లేదు. బాధితులు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఏజెన్సీ వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిళ్లు నెలనెలా మరింత అధికం అవుతుండడంతో పంపిణీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే యోచనలో ఏజెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత నెల పింఛన్లే పంపిణీ చేయని వైనం టీడీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉన్న పింఛన్లను తొలగించడంతో పాటు అర్హులకు సైతం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పింఛన్ల తనిఖీ కమిటీలు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తొలగించాయి. వివిధ కారణాలతో జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది పింఛన్‌దారులను సస్పెన్స్‌లో పెట్టారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఐదెకరాల నుంచి పదెకరాలకు మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం నేటికీ వెలువడలేదు. ఆన్లైన్లో నిబంధనలు సడలించకపోవడంతో వేల మంది అనర్హులుగా మారిపోయారు. ‘జన్మభూమి- మా ఊరు’ పుణ్యమాని అక్టోబర్ పింఛన్లు నేటికీ పంపిణీ చేయలేదు. ఇక నవంబర్ పింఛన్లు ఎప్పుడిస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.


