breaking news
Small changes
-
వీవీప్యాట్‌ల్లో చిన్న మార్పులు
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) సక్రమంగా పనిచేసేలా వాటికి చిన్న చిన్న మార్పులు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ చెప్పారు. 10 రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మే 28న ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. ఇందుకోసం మొత్తం 10,300 వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించగా దాదాపు 1,150 యంత్రాలు మధ్యలో మొరాయించాయి. దీంతో సాంకేతిక నిపుణులు ఆయా యంత్రాలను పరిశీలించి అవి పనిచేయకపోవడానికి మూల కారణాన్ని గుర్తించారు. కాంట్రాస్ట్ సెన్సర్‌పై నేరుగా కాంతి పడుతుండటం వలన కొన్ని యంత్రాలు పనిచేయలేదనీ, దీనిని నివారించడంకోసం కాంట్రాస్ట్ సెన్సర్లపై చిన్న ముసుగును వినియోగించనున్నట్లు రావత్ వెల్లడించారు. అలాగే గాలిలో తేమ ఎక్కువ కావడం వల్ల ఆ తడికి పేపర్ కాస్త మెత్తబడటంతో మరికొన్ని వీవీప్యాట్ యంత్రాలు ఓటు ధ్రువీకరణ కాగితాన్ని ముద్రించలేకపోయాయని ఆయన వివరించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇకపై గాలిలోని తేమకు మెత్తబడకుండా ఉండే కాగి తాన్నే వీవీప్యాట్ యంత్రాల్లో ఉపయోగిస్తా మని తెలిపారు. ఓటర్లు ఈవీఎంలో ఓటు వేయగానే, వారు ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ గుర్తును ఓ చిన్న కాగితంపై వీవీప్యాట్ యం త్రాలు ముద్రిస్తాయి. ఏడు సెకన్ల పాటు ఈ కా గితం వీవీప్యాట్ యంత్రంపై ఉండి ఆ తర్వాత దానంతట అదే ఓ డబ్బాలోకి పడిపోతుంది. -
టీచర్ల బదిలీ షెడ్యూల్లో స్వల్ప మార్పు
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. బదిలీల దరఖాస్తు గడువును ప్రభుత్వం తాజాగా ఒక రోజు పొడిగించింది. దీంతో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే బదిలీలకు సంబంధించిన ఆప్షన్ల ఎంపిక ఈ నెల 20 నుంచి 23 వరకు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈ నెల 25న బదిలీల జాబితా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 26న బదిలీల ఉత్తర్వుల జారీతో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. -
ఆటను మార్చేద్దాం!
ఊర్లలో సరదాగా ఆడుకునే మ్యాచ్‌లు కావచ్చు... పట్టణాల్లో పాఠశాల స్థాయి క్రికెట్ కావచ్చు... నగరాల్లో క్లబ్ క్రికెట్ కావచ్చు... చాలా సాధారణంగా ఒక దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. బాగా ఆడే క్రికెటర్లు ఒక నలుగురు జట్టులో ఉంటారు. వాళ్లే బౌలింగ్ చేస్తారు, వాళ్లే బ్యాటింగ్ చేస్తారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదేస్తారు. మిగిలిన ఏడుగురూ ఫీల్డర్లుగా మాత్రమే పనికొస్తారు. మరో ముగ్గురు లేదా నలుగురిని మంచినీళ్లు ఇవ్వడానికి మాత్రమే వాడుకుంటారు. దేశం తరఫున ఆడే పోటీ క్రికెట్లో విజయం ముఖ్యం కాబట్టి... బాగా ఆడే నలుగురు ముందే ఆడినా అభ్యంతరం లేదు. కానీ నైపుణ్యం వెలుగులోకి రావాల్సిన జూనియర్ స్థాయి క్రికెట్లోనూ ఇదే జరుగుతోంది. దీనివల్ల చాలా తక్కువ మంది క్రికెటర్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు. రోజంతా స్కూల్ మానేసి కూడా పిల్లలు బెంచ్ మీద కూర్చుని ఆట చూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు వెలుగులోకి రావడం లేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఏ స్థాయి క్రికెట్లో అయినా విజయం ముఖ్యం. కచ్చితంగా మన దగ్గర ఉన్న ఉత్తమ క్రికెటర్లను ఆడించి ప్రత్యర్థిని ఓడించాలి. ఏ కోచ్ అయినా, ఏ అకాడమీ అయినా, ఏ కెప్టెన్ అయినా ఇదే ఆలోచిస్తాడు. అండర్-16 స్థాయి దాటిన తర్వాత ఈ వ్యవస్థ ఉన్నా ఫర్వాలేదు. కానీ పిల్లల్లో ప్రతిభను వెలికితీయాల్సిన స్థాయిలోనూ ఇదే జరుగుతోంది. భారత క్రికెట్‌కు ఇది ఎంతమాత్రం మంచిది కాదనేది ద్రవిడ్ అభిప్రాయం. దీనివల్ల పిల్లల సమయం వృథా అవడం తప్ప ఉపయోగం లేదని చెబుతున్నాడు. మరోవైపు సచిన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. అందుకే ఈ ఇద్దరు క్రికెట్లో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. ముఖ్యంగా జూనియర్ క్రికెట్లో ఈ మార్పులు చేస్తే ఎక్కువ మంది వెలుగులోకి వస్తారని ఇద్దరు దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. సచిన్ చేసిన ప్రతిపాదనలను ముంబై క్రికెట్ సంఘం కొంతమేరకు అంగీకరించింది. అయితే చిన్న మార్పులతో వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. -సాక్షి క్రీడావిభాగం ద్రవిడ్ ప్రతిపాదనలు * ఫుట్‌బాల్‌లో మాదిరిగా స్కూల్ స్థాయి క్రికెట్లో సబ్స్టిట్యూట్లను విరివిగా వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి. * బ్యాటింగ్, బౌలింగ్‌లో కచ్చితంగా రొటేషన్ పద్ధతిని పాటించాలి. * జూనియర్ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలి. దీనివల్ల కుర్రాడు ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆసక్తి పెంచుకుంటాడు. * ఓ బ్యాట్స్‌మన్ అర్ధసెంచరీ చేస్తే ఇక అతను రిటైరవ్వాలి. జట్టు మూడు వికెట్లు కోల్పోతేనే మళ్లీ అతను బ్యాటింగ్‌కు రావాలి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది. * క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ సెంచరీ తర్వాత కూడా అలాగే కొనసాగితే తర్వాతి మ్యాచ్‌లకు కూడా అతనిపైనే ఎక్కువ ఆధారపడతారు. దీనివల్ల ఆటగాళ్లలోని సహజ నైపుణ్యం, అంకితభావం దెబ్బతింటాయి. ఖాళీగా కూర్చోవడం, వాటర్ బాటిల్స్ అందించడం మినహా మిగిలిన వారికి పని ఉండదు. * మ్యాచ్‌లో బౌలర్ గరిష్టంగా మూడోవంతు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించాలి. * ఎవరైనా బౌలర్ ఐదు వికెట్లు తీస్తే అతన్ని బౌలింగ్ నుంచి తప్పించాలి. * స్కూల్ స్థాయి మొదలుకొని అండర్-15 వరకు ఇదే పద్ధతిని కొనసాగించాలి. అప్పుడు కుర్రాళ్లలో నైపుణ్యాన్ని, ప్రతిభను వెలికి తీయొచ్చు. * జూనియర్ స్థాయి మ్యాచ్‌ల్లో ఆడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే సరైన అవకాశాల్లేక వాళ్లలోని ప్రతిభ మరుగున పడిపోతుంది. అలాగే వాళ్ల తల్లిదండ్రులు కూడా ఆటపై ఆసక్తి చంపేసుకుంటారు. అవకాశాలు ఇచ్చినప్పుడే ఏదో ఓ రూపంలో అతనికి ప్రోత్సాహం అందుతుంది. సచిన్ ప్రతిపాదనలు * ఇంటర్ స్కూల్ మ్యాచ్‌ల్లో 11 మందికి బదులుగా 15 మందికి అవకాశం ఇవ్వాలి. దీనివల్ల మైదానానికి వచ్చిన ప్రతి పిల్లాడికీ ఆడే అవకాశం వస్తుంది. * బ్యాటింగ్ సమయంలో నిఖార్సైన ఏడుగురు బ్యాట్స్‌మన్ ఆడాలి. * బౌలింగ్ సమయంలో నాణ్యమైన బౌలర్లకు ఆరుగురికి అవకాశం ఇవ్వాలి. ఇందులో పేసర్లయినా స్పిన్నర్లయినా ఉండొచ్చు. * ఫీల్డింగ్‌లో మాత్రం 11 మందినే కొనసాగించాలి. మ్యాచ్‌లో ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఇద్దరిని సబ్‌స్టిట్యూట్‌గా అనుమతించాలి. * దీనివల్ల కుర్రాళ్లకు సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆటపై ఆసక్తి ఏర్పడుతుంది. లేదంటే... రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైన క్రికెటర్ కొన్నాళ్లకు తమ సహజ నైపుణ్యాన్ని మర్చిపోతాడు. * ఆటగాళ్ల సంఖ్య పెరిగితే జట్టు మేళవింపులో భిన్నత్వం పెరుగుతుంది. దీంతో జట్టులోని ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్‌గా తయారవుతారు. ఒక్కరిపైనే ఆధారపడే భావన తగ్గుతుంది. రిజర్వ్ బెంచ్ సత్తా పెరుగుతుంది. * గాయాలు, ఫిట్నెస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా సమష్టితత్వం పెంపొందుతుంది. * 2013లో రిటైర్మెంట్ తర్వాత సచిన్ ఈ ప్రతిపాదన చేశాడు. * సచిన్ చేసిన ఈ ప్రతిపాదనను మొదట తిరస్కరించిన ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అండర్-14 విభాగంలో 11 మంది క్రికెటర్లకు బదులు 13 మందికి అవకాశం ఇవ్వనుంది. ఇద్దర్ని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొవచ్చు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయొచ్చు. ఆరుగురు బౌలర్లు బౌలింగ్ చేసుకోవచ్చు. సచిన్ 15 మందిని ప్రతిపాదిస్తే... ప్రస్తుతం 13 మందితో దీనిని ఆచరణలోకి తెచ్చారు.