breaking news
Sleep problems
-
నిద్ర లేమి ఫోన్ చలవే
సాక్షి, అమరావతి: వ్యసనంగా మారిన సెల్‌ఫోన్ స్క్రీనింగ్ నిద్రలేమికి కారణమవుతోంది. రాత్రివేళ సెల్ఫోన్లో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్‌లు, సినిమాలు చూడటం నిద్రా సమయాన్ని మింగేస్తున్నాయి. ఓ ఐదు నిమిషాలు సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేద్దామని మొదలుపెట్టి అరగంట.. గంట.. రెండు గంటలవుతున్నా నిద్రపట్టదు. ఈ సమస్య ప్రస్తుతం ఎందరినో వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నిద్ర సమయంలో సెల్‌ఫోన్ వినియోగమేనని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఇటీవల నార్వే శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు. నిద్ర సమయంలో గంటసేపు స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి ప్రమాదం 59 శాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గంటసేపు స్క్రీన్ చూస్తూ గడపటం వల్ల నిద్ర సమయం సైతం 24 నిమిషాలు తగ్గుతోందని గమనించారు.బ్లూ రేస్‌తో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావంమొబైల్, ల్యాప్‌ట్యాప్స్, ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూ రేస్ నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు. అలా స్క్రీన్ చూస్తూ ఉండటంతో హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమై మేల్కోనే సమయం పెరిగి నిద్రలేమి సమస్యలకు దారితీస్తున్నట్టు వివరించారు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు 30 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాలను చూసే వయోజనులు నిద్రలో కలత, అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటారని, గతంలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ఆరోగ్యంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందన్నారు. బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు దీర్ఘకాలంలో తలెత్తుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.45 వేల మందిపై అధ్యయనంనిద్రలేమి సమస్యపై అధ్యయనంలో భాగంగా నార్వే శాస్త్రవేత్తలు 45వేల మంది విద్యార్థులపై పరిశోధన చేపట్టారు. వీరి వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంది. వీరిని మూడు విభాగాలుగా విభజించి అధ్యయనం చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూస్తుండటంతో నిద్రపోయే సమయం తగ్గడం, పేలవమైన నిద్ర వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా స్క్రీన్ వాడకం నిద్ర అంతరాయంలో కీలక కారకమని సూచించారు. -
మీరు నిద్రించే సమయం ఇదేనా? తేడా వస్తే కష్టమే! ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు
చిన్నా పెద్దా అని తేడా లేదు.. చాలా మందికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది.. పైకి తెలియకుండానే శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోంది. ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు, విద్యాపరంగా ఒత్తిళ్లు, పోటీ ప్రపంచంలో కెరీర్‌పై ఫోకస్ పెరగడంతో నెలకొన్న ఒత్తిడి వంటివి ఒకవైపు అయితే.. విపరీతంగా స్క్రీన్ టైమ్ (ఫోన్లు, కంప్యూటర్ల వాడకం, టీవీ చూడటం వంటివి) పెరిగిపోవడం మరోవైపు దీనికి కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా నెలకొన్న పరిస్థితులు, రోజువారీ జీవన విధానంలో వచ్చిన మార్పులూ సమస్య పెరగడానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, వైద్య సంస్థలు అధ్యయనం చేసి.. నిద్ర లేమి కారణాలు, దీనివల్ల తలెత్తుతున్న సమస్యలపై నివేదికలు విడుదల చేశాయి. ఆ అంశాలపై ఓ లుక్కేద్దాం. – సాక్షి, హైదరాబాద్ 7 నుంచి 9 గంటల నిద్ర వల్ల ప్రయోజనాలివీ.. ►18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కనీసం 7 గంటల రాత్రి నిద్ర అవసరం. ►తగినంత నిద్రతో రోగ నిరోధక శక్తి ఉత్తేజితం అవుతుంది. అనారోగ్యం బారినపడే అవకాశాలు తగ్గుతాయి. ►ఒకవేళ ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగినా వేగంగా కోలుకోగలుగుతారు. ►7 నుంచి 9 గంటల మధ్య నిద్రతో జ్ఞాపకశక్తి, సృజనాత్మకత మెరుగుపడుతుంది. ►ఏకాగ్రత కూడా పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. ►రోజువారీ వ్యక్తిగత జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సమస్యను అధిగమించేందుకు ఇలా చేయొచ్చు ► క్రమం తప్పకుండా రోజూ అరగంటకుపైగా వ్యాయామం, నడక ►రాత్రి మితంగా భోజనం చేయాలి. సాయంత్రాలు సిగరెట్లు, మద్యం, పొగాకు వంటివి తీసుకోవద్దు. ►వీకెండ్స్, ఆదివారాలు సహా అన్నిరోజుల్లో నిద్రపోయేందుకు, పొద్దున లేచేందుకు ఒకే సమయం పాటించాలి. ►బెడ్రూంలలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలను వినియోగించొద్దు. ►నిద్రించే చోట తగిన ఉష్ణోగ్రత, తక్కువ వెలుతురు, శబ్దాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. 5, 6 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో సమస్యలివీ.. ►ఐదారు గంటల కన్నా తక్కువ నిద్రతో రోగ నిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. ►ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, కుంగుబాటు వంటివి తలెత్తే ప్రమాదం పెరుగుతుంది. ►5 గంటలు, అంతకంటే తక్కువ నిద్రతో ఊబకాయం వచ్చే అవకాశాలు 20 శాతం పెరుగుతాయి. ►జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. కొత్త అంశాలను నేర్చుకోవాలన్న జిజ్ఞాస 40%పైగా తగ్గిపోతుంది. ►దీర్ఘకాలం నిద్ర సమయం తక్కువగా ఉంటే మానసిక సమస్యలు తలెత్తుతాయి. చిన్న విషయానికే ఆందోళన పడటం, కుంగుబాటు, షార్ట్ టెంపర్, ప్రతీదానికి విసుక్కోవడం, వాహనాలు నడిపేపుడు ఏకాగ్రత కోల్పోవడం వంటివి జరుగుతాయి. ►చేసే పనుల్లో తరచూ తప్పులు దొర్లడం, పనివేగం తగ్గిపోవడం, మార్పులకు తగినట్టు సర్దుబాటుకాకపోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలు వస్తాయి. నిద్ర తగ్గితే శారీరక, మానసిక సమస్యలు గత పదేళ్లలో భారతీయుల్లో నిద్ర అలవాట్లు, పద్ధతుల్లో బాగా మార్పులు జరిగాయి. నిద్ర అనేది కేవలం శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు. మెదడు పనితీరును మెరుగుపర్చుకునేందుకు, ఆ రోజంతా చేసిన పనులను ఒక క్రమపద్ధతుల్లో పెట్టుకోవడానికి, ‘మెటబాలిక్ రియాక్షన్ రిథమ్’లో ఉండటానికి నిద్ర తోడ్ప డుతుంది. అర్ధరాత్రి దాకా మేలుకుని ఉండటం, లేవడం వంటివాటి వల్ల ‘సర్కాడియన్ సైకిల్’ దెబ్బతింటుంది. ఐదు గంటల కంటే తక్కువ నిద్ర ఉంటే.. శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఐటీ ఉద్యోగుల్లో తీవ్రంగా సమస్య మూడేళ్లుగా ఐటీ కంపెనీలు, ఇతర రంగాల ఉద్యోగులు అధికంగా వర్క్‌ఫ్రం హోం పద్ధతికి మారారు. ఇప్పటికీ ఈ విధానాన్ని కొనసాగిస్తున్న వారిలో సరైన నిద్రలేకపోవడం, గురక, మధ్యలో ఉలిక్కిపడి లేవడం, పొద్దున లేచాక ఫ్రెష్‌గా అనిపించకపోవడం వంటి లక్షణాలతో కూడిన ‘అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా’ సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యలతో వస్తున్న ఐటీ ఉద్యోగులకు తగిన చికిత్స అందిస్తున్నాం. ఎట్టిపరిస్థితుల్లోనూ రోజుకు 7, 8 గంటల నిద్ర ఉండాలి. సాయంత్రం 5 తర్వాత టీ, కాఫీ తీసుకోకపోవడం, రాత్రి 9 తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం ఆపేయడం మంచిది. నిద్రవచ్చినా, రాకపోయినా రాత్రి 9.30 గంటలకల్లా బెడ్‌పైకి వెళ్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. – వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆస్పత్రి -
వారు మందు కొడతారు.. అందుకే నిద్రపట్టదు!
న్యూయార్క్: యువకుల్లో నిద్రలేమి సమస్యలకు ప్రధాన కారణం మత్తుపానీయాల అలవాటేనని ఓ అధ్యయనం కుండబద్ధలు కొడుతోంది. చాలామంది రాత్రిళ్లు వెంటనే నిద్ర పోలేకపోతున్నారని, తెల్లవార్లు మెళకువతో ఉంటున్నారని ఇందుకు ప్రదాన కారణం మద్యం సేవించడమేనని అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తొందరగా నిద్రపోలేకపోతున్నారని, వారిని బయటకు చెప్పుకోలేని సమస్యలు ఏవో వేధిస్తూ ఉండొచ్చని వారిలో వారే మదన పడుతుంటారు. అయితే, వారు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి స్పందిచాల్సి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో పాఠశాల, కాలేజీ స్థాయి పిల్లలు కూడా మద్యం సేవిస్తున్నారని, దానిని నియంత్రించకుంటే వారికి నిద్రలేమి సమస్యలు తదనంతర సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.