breaking news
skilled Indian workers
-
సాఫ్ట్వేర్, ఎంబీఏ శకానికి చరమగీతం?
భారతదేశ జాబ్ మార్కెట్లో దశాబ్దాలుగా నడుస్తున్న ‘వైట్ కాలర్’ ఉద్యోగాల బూమ్ ఇకపై సాగకపోవచ్చని, సాఫ్ట్వేర్, ఎంబీఏ డిగ్రీల హవా ముగింపు దశకు చేరుకుందని దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. వెల్డింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వడ్రంగి వంటి భౌతిక, వాణిజ్య నైపుణ్యాలకే (ట్రేడ్ స్కిల్స్) రాబోయే రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని స్వభావం, ఉద్యోగ నష్టాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి.శ్రమకు దక్కని గౌరవం‘స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు, వృత్తి నిపుణులకు సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుంది. కానీ భారతదేశంలో అది కరవైంది. వెల్డర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వడ్రంగి వంటి వారిని మనం తక్కువ చేసి చూస్తాం. వారి వృత్తులను అగౌరవంగా, ఫ్యాషన్ కానిదిగా మార్చేశాం. ఈ ఆలోచనా విధానం తక్షణమే మారాల్సిన అవసరం ఉంది’ అని అనంత నాగేశ్వరన్ అన్నారు.సాంకేతిక పురోగతి అనేది ఉపాధిని పూర్తిగా హరించబోదని, అయితే అది ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని నాగేశ్వరన్ విశ్లేషించారు. గతంలో ప్రపంచీకరణ వల్ల భారత సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ విద్యార్థులకు భారీగా ప్రయోజనం చేకూరిన మాట వాస్తవమే అయినా ఆ శకం ఇప్పుడు ముగిసిందని పేర్కొన్నారు.ఏఐ భర్తీ చేయలేని రంగాలు‘మనుషుల ప్రత్యక్ష అవసరం ఉండే, ఆటోమేషన్‌కు గురికావడానికి తక్కువ అవకాశం ఉన్న రంగాలపై యువత దృష్టి పెట్టాలి. భారతదేశంలో నిరుద్యోగిత, తక్కువ ఉపాధి సమస్యలను ఒకేసారి పరిష్కరించాలంటే శ్రమశక్తి ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి’ అన్నారు. ఉత్పాదక రంగంతో పాటు మానవ సంబంధాలు, సేవలతో ముడిపడి ఉన్న కొన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా అవకాశాలు సృష్టించవచ్చని నాగేశ్వరన్ వెల్లడించారు.ఇదీ చదవండి: బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. -
హెచ్1 బి వీసా కొత్త ప్రతిపాదన అత్యంత చెత్త పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ 1 బి వీసాల తాజా కఠిన నిబంధనలపై అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) స్పందించింది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బి వీసాలకు గడవు పొడిగించక పోవడం, నిబంధనలు కఠినతరం చేస్తుండడం పట్ల భారతీయ ఐటి సంస్థల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిబంధనలపై యుఎస్ఐబిసి నిరసన వ్యక్తం చేసింది. ఇది అమెరికాలోని నిపుణులైన భారతీయ ఉద్యోగుల పాలిట అత్యంత చెత్త పాలసీగా నిలుస్తుందని పేర్కొంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇక హెచ్1 బి వీసాను పొడిగించుకునే అవకాశం లేకుండా చేయాలన్న ప్రతిపాదన ఐటీ ఉద్యోగులకు ఇది నష్టకరమని వ్యాఖ్యానించింది. గత కొన్నేళ్లుగా అమెరికాలో సేవలందిస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని దూరం చేయడం సరైంది కాదంది. వారు అమెరికాలో అనేక సంవత్సరాల పాటు పనిచేస్తున్నారని యుఎస్ఐబిసి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం అమెరికన్ వ్యాపారాన్ని, తమ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చడంతోపాటు దేశానికి హాని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ లక్ష్యాలకు భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ఇండియన్లపై తీవ్రంగా కన్పిస్తోంది. వేలాది మంది ఇండియన్లు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండడంతో వేలాది మంది ఇండియన్ టెక్కీలు ఆందోళనలో పడ్డారు. బై అమెరికన్, హైర్ అమెరికన్ నినాదంతో హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే.


