breaking news
Siva Lingam
-
అమర్నాథ్: మంచు శివలింగం అదృశ్యం!
శ్రీనగర్: వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి వారంలోనే పవిత్ర గుహలోని సహజసిద్ధ మంచు శివలింగం దాదాపు పూర్తిగా కరిగిపోయింది. మే నెలలో సుమారు ఏడు అడుగుల ఎత్తున ఉన్న ఈ మంచు లింగం, జూలై 7 నాటికి 99 శాతం మేర క్షీణించిందని అధికారులు తెలిపారు. గడిచిన మూడేళ్లుగా ఈ మంచు రూపం వారం రోజులకు మించి నిలవడం లేదు.ప్రాంతీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉష్ణగాలులు, శీతాకాలంలో తగ్గిన మంచు కురిసే శాతమే ఇందుకు ప్రధాన కారణాలని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ వల్ల గుహలో ఉత్పన్నమవుతున్న మానవ ఉష్ణోగ్రతలు, కాలుష్యం కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి. రోజుకు 13 వేల నుంచి 20 వేల మంది వరకు భక్తులు గుహను సందర్శిస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జూన్ 28న ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్రలో ఇప్పటికే లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. శివలింగం కరిగిపోయినప్పటికీ, ఆ పవిత్ర స్థలానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా భక్తులు నిరుత్సాహపడకుండా భారీ సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కల్పించిన కట్టుదిట్టమైన భద్రత, వసతులపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాత్రను జూన్ మధ్యలోనే ప్రారంభించి ఉంటే మరింత మందికి మంచు లింగ దర్శన భాగ్యం కలిగేదని కొందరు భక్తులు అభిప్రాయపడ్డారు. -
మంచు శివలింగం తొలి దర్శనం
అనంతనాగ్: అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమవుతోంది. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర గుహలో కొలువైన బాబా బర్ఫానీ (శివలింగం) తొలి దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శివభక్తులలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినంతో ముగియనుంది. మొత్తం 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. యాత్ర విజయవంతానికి జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక 'ప్రథమ పూజ' నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది.కట్టుదిట్టమైన భద్రతా వలయంయాత్ర నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను భారీగా పెంచారు. ముఖ్యంగా అనంతనాగ్ జిల్లాలో పహారా ముమ్మరం చేశారు. కశ్మీర్ జోన్ ఐజీపీ, డివిజనల్ కమిషనర్ అన్షుల్ గార్గ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, నిరంతర నిఘా ఉంచాలని ఉన్నతాధికారులు భద్రతా దళాలను ఆదేశించారు.మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టియాత్రకు వచ్చే భక్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 30 నాటికి అందరికీ తప్పనిసరిగా ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు. బేస్ క్యాంపుల వద్ద నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా టెలికాం సంస్థలకు కీలక సూచనలు చేశారు. యాత్ర మార్గంలో పోనీ స్టాండ్ల నిర్మాణం, ఫెన్సింగ్, షెడ్ల వంటి మౌలిక సదుపాయాలన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు. -
పుష్పగిరిలో భక్తుల్ని ఆకర్షిస్తున్న సైకత లింగం
వైఎస్సార్, సాక్షి: పుష్పగిరిలో నది తీరాన భక్తుల చేత ప్రశంసలందుకుంటున్న సైకత లింగం. వల్లూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన రెండవ దక్షిణ కాశి పుష్పగిరి పుణ్యక్షేత్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయ సమీపాన పంచమ నది ఒడిలో సైకత శివలింగాన్ని ఇoటాక్ సభ్యులు కడిమెల్ల రాఘవేంద్ర వర్మ తన స్వహస్తాలతో తయారుచేశారు. వర్మ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాన్ని గురువారం సందర్శించారు. లింగాన్ని తిలకించిన పలువురు భక్తుల చేత ప్రశంసలు అందుకొoటోoది. -
శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన దాఖలైన పరువు నష్టం కేసులో పదేపదే హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు రూ. 5వేల జరిమానా విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు హాజరుకావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విశాల్ పహుజా ఆయనను ఆదేశించారు. కాగా 2018లో బెంగళూరు సాహిత్య ఉత్సవంలో శశి థరూర్ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. చదవండి : మోదీ.. శివలింగంపై తేలు! -
పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి
ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది. వేముల పల్లి మండలంలో ఆదివారం ఉదయం భారీ శివలింగం(50) అనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం పొలానికి వెళిన్ల శివలింగం పత్తి చేను ఎండిపోవటం చూసి గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు.


