న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు.. ఊహించలేదు: డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మయూఖ’.. సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ నిర్మించిన శ్రీకాంత్ కాండ్రేగుల... శ్రీతేజ్ ఎస్.కె. గా స్క్రీన్ నేమ్ మార్చుకుని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మించిన ఈ మూవీ ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శ్రీతేజ్ ఎస్.కే మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘మయూఖ’ అంటే ఆశాకిరణం. సినిమా చివరి వరకు చూసిన తర్వాత టైటిల్‌ను ఎందుకు పెట్టామో ప్రేక్షకులకు అర్థమవుతుంది. నేను రూపొందించిన చివరి షార్ట్‌ఫిలిం పేరు కూడా ‘మయూఖ’. ఆ షార్ట్ఫిలింను పూర్తి చేయకుండానే అమెరికా వెళ్లాను. ఆ సమయంలో రాజమౌళి గారు ఒక పాపను దత్తత తీసుకుని ఆమెకు మయూఖ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత నా ప్రొఫెషనల్ కెరీర్ కొనసాగుతున్న సమయంలో నిర్మాత శశిధర్ నల్లకు ఈ కథ చెప్పాను. కథ ఆయనకు నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చారు.→ మా ‘మయూఖ’ సినిమాకు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ మిస్టరీ మూవీగా అవార్డు వచ్చింది. థ్రిల్లర్ కేటగిరీలో సెకండ్ బెస్ట్‌గా నిలిచింది. ఈ అవార్డు వస్తుందని మేము అసలు ఊహించలేదు. మా సినిమా అవార్డుకు ఎంపికైందని తెలిసినప్పుడు టీమ్ అంతా చాలా సంతోషించింది. ప్రస్తుతం ‘మయూఖ’ను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా అప్లై చేశాం.→ మా ప్రమోషనల్ కంటెంట్ చూస్తే కొరియన్, హాలీవుడ్ సినిమాల తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుంది. కథను ఒకేసారి చెప్పకుండా కొద్దికొద్దిగా రివీల్ చేస్తూ సెకండాఫ్‌కు వచ్చే సరికి పీక్స్‌కు తీసుకెళ్లాం. ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీల్లో థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు విపరీతంగా చూస్తున్నారు. అలాంటి ఆడియెన్స్‌ను మెప్పించాలంటే కొత్తగా, క్వాలిటీగా ప్రయత్నించాలి. ‘మయూఖ’ విషయంలో మేము అదే చేశాం.→ ఎక్కడో స్మశానంలో దెయ్యాలు ఉన్నాయని చెబితే మనసు ముందుగానే భయానికి సిద్ధమవుతుంది. కానీ మనం ప్రతిరోజూ ఉండే ఇంట్లోకి ఒక అపరిచిత వ్యక్తి వస్తే ఆ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. ‘మయూఖ’ హారర్ సినిమా కాదు.. థ్రిల్లర్ మూవీ. హీరోయిన్ ఉండే ఫ్లాట్‌లోకి ఒక అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు? అతను ఏం చేశాడు? హీరోయిన్ పాత్రతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.→ ఇలాంటి థ్రిల్లర్స్ గతంలో వచ్చినప్పటికీ ‘మయూఖ’లో స్క్రీన్‌ప్లే, కథను ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. అదే మా సినిమాకు ప్రత్యేకత. ప్రెజెంటేషన్ కొత్తగా ఉండటం వల్లే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు దక్కిందని భావిస్తున్నాం.→ ఈ కథను మొదట నటి మహేశ్వరి (గులాబీ ఫేమ్)కు చెప్పాం. ఆమెకు మేము చెప్పిన రెండు కథలు నచ్చాయి. అయితే మరో కథను ఆమె ఎంచుకున్నారు. ఆ తర్వాత ‘మయూఖ’ పాత్రకు పాయల్ చెంగప్ప అయితే బాగా సరిపోతుందని అనిపించింది.→ పాయల్ కన్నడలో మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు చేశారు. ఆమె చేసిన వెబ్‌సిరీస్‌ల ద్వారా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఈ సినిమాలో ఆమె పాత్రను ప్రేక్షకులు బాగా రిలేట్ చేసుకుంటారు. ఆమె క్యారెక్టర్ ఎదుర్కొనే స్ట్రగుల్స్కు స్పందిస్తారని నమ్మాం. మయూఖగా పాయల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో ఆమె నటనకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను.→ ఒక సినిమా హిట్ అయితే అదే జానర్లో వరుసగా సినిమాలు వస్తుంటాయి. మనం ఆ జానర్లో సినిమా చేసేలోపు ట్రెండ్ మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయగలిగినా.. కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో ‘మయూఖ’ను రూపొందించాను.→ తదుపరి నా దర్శకత్వంలో ఒక ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాను. అది క్లీన్ యు సర్టిఫికెట్ పొందేలా ఉండే సినిమా. ‘