shores
-
ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి
బెంగళూరు: ఇటీవలి కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లపై ఆసక్తి బాగా పెరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ వ్యవహారం పరిధులు దాటుతోంది. ఒక్కోసారి ఘర్షణలకు దారి తీస్తోంది. అప్పుడప్పుడూ విషాదంగా కూడా మారిపోతోంది. తాజాగా కర్ణాటకలోని సకలేశపుర తాలూకాలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. స్టోరీ ఏంటంటేఅసలేం జరిగింది?కర్ణాటకలోని హసన్ జిల్లా సకలేశపుర తాలూకాలోని ప్రముఖ బెట్టద భైరవేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. పచ్చని ప్రకృతికి నిలయమైన ఈ ప్రాంతం ప్రీ-వెడ్డింగ్ షూట్లకు చాలా ప్రసిద్ధి.ఇక్కడ ఒక జంట తమ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఫోటోగ్రాఫర్లతో కలిసి ఈ ఆలయానికి వచ్చింది. షూటింగ్ సమయంలో ఫోటోగ్రాఫర్లు పాదరక్షలు (షూలు) ధరించి ఆలయ పరిధిలోకి ప్రవేశించారని, అలాగే ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఫోటోగ్రఫీ చేస్తున్నారని కొందరు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘర్షణ చెలరేగింది.మాట మాట పెరిగి అది భౌతిక దాడికి దారితీసింది. స్థానికులు ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడమే కాకుండా, వారి కెమెరాను కూడా పగులగొట్టారు.ఈ దాడిలో నవీ, నందన్ అనే ఫోటోగ్రాఫర్లు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సకలేశపుర తాలూకా ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న సకలేశపుర రూరల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముదిగెరె తాలూకాకు చెందిన ఏడుగురిని (ఆశి, ప్రశాంత్, రక్షా, అరవింద్, ఉచిత్, ప్రజ్వల్, నిశాంత్) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: దేశవ్యాప్త లాక్డౌన్ : కేంద్ర మంత్రి ఏమన్నారంటే!నోట్: ఆధ్యాత్మిక, పర్యాకట ప్రదేశాల్లోఇలాంటి షూట్లు చేసేటప్పుడు స్థానిక పద్దతులను నియమాలను పాటించడం అవసరం. స్థానికుల మనోభావాలకు భంగం కలగకుండా సున్నితత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. (షాకింగ్ వీడియో : బుల్లెట్ బండిని ధ్వంసం చేసిన మహిళ) -
California: తీరాన్ని ముంచెత్తుతున్న రాకాసి అలలు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా తీరాన్ని సునామీ తరహాలో రాకాసి అలలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పసిఫిక్ మహా సముద్రం అలజడిగా మారడంతో భారీ అలలు వస్తున్నాయి. రాకాసి అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో తీరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి నుంచి తరలివెళ్లాల్సిందిగా తీర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంచూరా ప్రాంతంలో ఒక రాకాసి అల తీరాన్ని బలంగా తాకడంతో అక్కడ ఉన్న వారంతా భయపడుతూ పరుగులు తీయాల్సి వచ్చింది. నీళ్లు వేగంగా వారిని వెంబడించాయి. కాలిఫోర్నియాలోని మారిన్ కౌంటీతో పాటు క్యాపిటోలా గ్రామంలో ప్రజలను తరలివెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. రాకాసి అలలు ఒక్కొక్కటి 28 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు వస్తాయని, ఒక్కో అల 40 అడుగుల ఎత్తు వరకు ఉండొచ్చని నేషనల్ వెదర్ సర్వీసు కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు రావొచ్చని హెచ్చరించింది.ఈ వారంతంలో అలలు మరింత భయానకంగా మారొచ్చని సాన్డియాగో ప్రాంతంలో అత్యంత భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఉండే రాళ్లు, జెట్టీలు, పియర్స్ లాంటివాటిపై ఎవరూ ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. Wait for it! Big surf and high tide El Niño flooding in Pierpont, Ventura, California #flooding #Ventura Video by Colin Hoag pic.twitter.com/BlvqIVNFC5 — Permaculture Practitioner (@eldoobie) December 29, 2023 ఇదీచదవండి..యూఎన్ బృందంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు -
తీరానికి మృత దేహాలతో పడవలు
టోక్యో: మృత దేహాలతో తమ దేశ సముద్రతీరంలోకి వస్తున్న పడవలతో జపాన్ కలవరపడుతోంది. మృతదేహాలతో నిండిన పడవలు జపాన్ సముద్ర తీరంలోకి గత రెండు నెలలుగా కొట్టుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 12 చెక్క పడవల్లో మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మొత్తం 22 మృతదేహాలను అందులోంచి వెలికి తీశారు. ఒక పడవలో లభించిన రెండు మృత దేహాలకు తలలు కూడా లేవు. మరో పడవలో మొత్తం 6 పుర్రెలు లభ్యమయ్యాయి. మొదటి పడవ అక్టోబర్లో సముద్రతీరంలోకి రాగా, నవంబర్, డిసెంబర్లో మరిన్ని వచ్చాయి. ఈ మిస్టరీ బోట్లకు సంబంధించి..అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, అందులోని వారంతా ఎలా మరణించారు, అన్న కోణంలో జపాన్ కోస్ట్ గార్డు అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఒక బోటు పై ఉత్తర కొరియా అక్షరాల్లో 'కొరియన్ పీపుల్స్ ఆర్మీ' అని రాసిఉంది. మరో బోటులో చినిగి పోయి, చీకిపోయి ఉన్న ఒక గుడ్డ ముక్క లభించింది. అది ఉత్తర కొరియా జాతీయ జెండాగా భావిస్తున్నారు. దీంతో ఈ బోట్లన్ని ఉత్తర కొరియా నుంచి వచ్చినట్టు జపాన్ అధికారులు భావిస్తున్నారు.


