breaking news
shocker
-
బాయ్‌ఫ్రెండ్ సాయంతో తాతను చంపించి.. బాలిక పైశాచికం!
అలప్పుజ: కేరళలోని అలప్పుజ జిల్లా హరిపాడ్ బ్లాక్ పంచాయతీ పరిధిలో అత్యంత దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. ఐఫోన్, బైక్ కొనుగోలు కోసం 13 ఏళ్ల బాలిక తన 15 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, మరో ఇద్దరు మైనర్ స్నేహితుల సహకారంతో తన తాతను హత్య చేయించింది. యూట్యూబ్‌లో హత్య చేసే విధానాలను చూసి, పక్కా ప్రణాళికతో ఈ ఘాతుకానికి నిందితులు ఒడిగట్టారు.బాధితుడు తన భార్య, గర్భిణి అయిన కుమార్తె, మనవరాలితో కలిసి నివసిస్తున్నారు. కూతురు పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరగా, బామ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన మనవరాలు.. పరీక్షల ప్రిపరేషన్ సాకుతో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తాత తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాయ్‌ఫ్రెండ్‌ను నమ్మించి, హత్యకు పురిగొల్పింది. నిందితులు ఇంటి వెనుక వెంటిలేటర్ ద్వారా లోపలికి ప్రవేశించి, తాతను తీవ్రంగా కొట్టి, కాళ్లు చేతులు కట్టేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ బాలిక ఈ దారుణాన్ని వీడియో కాల్ ద్వారా లైవ్‌లో వీక్షించింది. అనంతరం ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లి, 4.5 సవర్ల (సుమారు 36 గ్రాములు) బంగారం, నగదుతో ఉడాయించారు.మొబైల్ వాడవద్దని మందలించిన తాతపై కక్ష పెంచుకున్న ఆ బాలిక.. బంగారం అమ్మి తాను ఐఫోన్ కొనుక్కోవాలని, బాయ్‌ఫ్రెండ్‌కు బైక్ కొనివ్వాలని ఈ పథకం వేసింది. పోలీసులు విచారణలో బాలిక పొంతనలేని సమాధానాలు చెప్పడంతో, సాంకేతిక ఆధారాల ద్వారా 24 గంటల్లోనే కేసును ఛేదించారు. కొల్లాంలో విక్రయించిన ఉంగరంతో సహా మిగిలిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.ఇది కూడా చదవండి: శవం సాయంతో నది దాటి.. తులసీదాస్ జీవితాన్ని మార్చిన ఘటన! -
బిల్లు చూసి గుడ్లు తేలేశాడు
చండీగడ్: హరియాణా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బైటపడింది. ఓ చిన్న షాపుకు కోట్ల రూపాయల్లో వచ్చిన కరెంటు బిల్లు చూసి ఆ యజమానికి గుండె ఆగినంత పని అయింది. ఫరినాబాద్ నగరంలో చిన్న టైర్ల రిపేరీ షాప్ నడుపుకొనే సురేందర్ కి సుమారు 77 .89 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో బిల్లు రావడంతో షాకైన సదరు యజమాని తల్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. మరోవైపు తనకు ఎప్పుడూ రెండు వేలకు మించి బిల్లు రాలేదని సురేందర్ వాపోయాడు. ఒక ఫ్యాన్, ఒక లైట్ తప్ప మరేయితర విద్యుత్ పరికరాలు లేవని, ఇంత బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నాడు. అక్టోబర్ 31 న తనకు ఈ భారీ బిల్లు వచ్చిందని తెలిపాడు. ఆ రాష్ట్రంలో విద్యుత్ వినియెగదారులకు ఇలాంటి కరెంట్ షాకులు మామూలేనట. గతంలో ఓ పాన్ షాపు యజమానికి 132 కోట్ల రూపాయల బిల్లును పంపారు. అంతకుముందు దక్షిణ హరియాణా బిజిలీ వితరణ్ నిగమ్ శాఖ 234 కోట్ల బిల్లును పంపి మరో వినియోగదారుడిని అయోమయంలోకి నెట్టేసింది. అయితే ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అని, కంప్యూటర్ తప్పిదమంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది.


