breaking news
Share prices
-
టాటా మోటార్స్ సీవీ బంపర్ లిస్టింగ్
ముంబై: టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ) అరంగేట్రంలోనే అదరగొట్టింది. టాటా మోటార్స్ విభజన నేపథ్యంలో టీఎంసీవీ షేరు విలువను రూ.260గా నిర్ధారించగా.. ఎన్ఎస్ఈలో ఇది 28.48 శాతం ప్రీమియంతో రూ.335 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.345 గరిష్టాన్ని తాకింది. చివరకు 26.56 శాతం లాభంతో 330 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈలో ఇది 26.09 శాతం ప్రీమియంతో 330.25 వద్ద అరంగేట్రం చేసింది. ఇంట్రాడేలో రూ. 346.75ను తాకి, చివరికి రూ.327.65 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,21,517 కోట్లుగా నమోదైంది. టాటా మోటార్స్‌ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టీఎంసీవీగా విడగొట్టిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో ఒక టీఎంసీవీ షేరును కేటాయించారు. ఈ డీమెర్జర్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా, అక్టోబర్ 14 నుంచి టాటా మోటార్స్ షేరు టీఎంపీవీగా రూ. 400 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది రూ.402 వద్ద కదలాడుతోంది. టీఎంసీవీ మాత్రం టాటా మోటార్స్ లిమిటెడ్ పేరుతో ఇప్పుడు ట్రేడవుతోంది. కాగా, ఈ రెండింటి ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.2.7 లక్షల కోట్లకు చేరింది. నిర్ణయాత్మక క్షణం: చంద్రశేఖరన్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిస్టింగ్ అనేది కంపెనీ భవిష్యత్తు ప్రయాణానికి, అలాగే ఆటోమోటివ్ పరిశ్రమకు ఒక ‘నిర్ణయాత్మక క్షణం’ అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. బీఎస్ఈలో జరిగిన లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా మోటార్స్‌ను ‘ఐకానిక్’ కంపెనీగా అభివరి్ణంచారు. అటువంటి ప్రతిష్టాత్మక కంపెనీలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడం చాలా కష్టమే అయినా, విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ఇటాలియన్ వాణిజ్య వాహన దిగ్గజం ఇవెకో గ్రూప్‌ను (డిఫెన్స్ బిజినెస్ మినహా) 3.8 బిలియన్ యూరోలకు (దాదాపు రూ.38,240 కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
స్మాల్ క్యాప్ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు
న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున ఎస్ఎంఎస్లు పంపిణీ చేయడం ద్వారా ఐదు స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్లలో మ్యానిపులేషన్‌కు పాల్పడినందుకు 135 సంస్థలపై సెబీ చర్యలు తీసుకుంది. అడ్డంగా సంపాదించినందుకు రూ.126 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, 7ఎన్ఆర్ రిటైల్ లిమిటెడ్, డార్జిలింగ్ రోప్‌వే కంపెనీ లిమిటెడ్, జీబీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విషాల్ ఫ్యాబ్రిక్స్ షేర్లను కొనుగోలు చేయాలంటూ ఆయా సంస్థలు ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్లు పంపించినట్టు సెబీ గుర్తించింది. మూడు పెద్ద బృందాలు కలసికట్టుగా ఈ ముందస్తు పథకాన్ని నడిపించినట్టు పేర్కొంది. ‘‘ఈ పథకంలో భాగంగా ముందు ఆయా షేర్ల ధరలను పెంచుతూ వెళ్లారు. మానిపులేటివ్ ట్రేడ్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. షేరు ధర పెరుగుతుంటే రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఆసక్తి ఏర్పడుతుంది. ధరలను పెంచిన తర్వాత బై కాల్స్ ను ప్రసారం చేశారు. హనీఫ్ షేక్ అనే వ్యక్తి సూత్రధారిగా దీన్ని నడిపించాడు. బై కాల్స్ చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు రావడంతో వీరు తమవద్దనున్న షేర్లను అధిక ధరల వద్ద అమ్ముకుని బయటపడ్డారు. తద్వారా భారీ లాభాలను ఆర్జించారు’’అని సెబీ పేర్కొంది. -
సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫలితాల జోరు, 6 శాతం జంప్
సాక్షి,ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 223 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 187 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 1,995 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 1,647 కోట్ల నుంచి రూ. 1,740 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.65 శాతం నుంచి 5.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.85 శాతం నుంచి 2.51 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ. 179 కోట్లకు పరిమితమయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో గురువారం 3.4 శాతం ఎగిసింది. శుక్రవారం కూడా ఈ జోరు కంటిన్యూ చేస్తూ ఏకంగా 6 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
డబుల్ బొనాంజా.. ఆ షేర్లు కొన్నవారికి బంఫర్ ఆఫర్!
Vedanta Share Price: గతంలో కొంత కాలం ఇన్వెస్టర్లను దంచి కొట్టిన దలాల్ స్ట్రీట్ ఇటీవల అదరగొడుతూ మంచి ఊపుతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే షేర్లతో లాభాలు ఆర్జిస్తున్న ఇన్వెస్టర్లకు మెటల్స్, మైనింగ్ కంపెనీ వేదాంత మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తన వాటాదారులకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 19.5 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీంతో ఆ సంస్థలోని పెట్టుబడిదారులు డబుల్ బొనాంజా పొందారనే చెప్పాలి. వేదాంత ఇన్వెస్టర్లకు డబుల్ బొనాంజ్ వేదాంత షేర్లు భారీ స్థాయిలో ప్రారంభమై ఆ తర్వాత వాటి షేరు ధర పెరుగుతూ రూ.253.25కి చేరింది. జూలై 1 తర్వాత ఈ స్థాయిలో స్టాక్ పెరగడం ఇదే తొలిసారి. ఇటీవల షేర్లు లాభాలతో పాటు వాల్యూమ్స్ కూడా మద్దతుగా ఉన్నాయి. అంటే వాల్యూమ్స్ కూడా పెరిగాయి. ప్రస్తుత వాల్యూమ్‌లు కూడా 20 రోజుల సగటు కంటే ఎక్కువగానే ఉన్నాయి. టెక్నికల్‌గా వీటిని పరిశీలిస్తే.. స్టాక్ ధర 20-రోజుల మూవీంగ్ యావరేజ్ కంటే పైన ట్రేడవుతోంది. స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ పైన షేర్ ధర 250 వద్ద పటిష్టంగా కొనసాగుతుంది. కాగా వేదాంత షేర్ ఆల్‌టైం హై ధర రూ. 259.95గా ఉండడం గమనార్హం. చదవండి: ఆకాశ ఎయిర్: టికెట్ ధరలు, స్పెషల్ మీల్ -
ఫాల్గుని నాయర్‌కి షాక్! నైకా షేర్లకి భారీ కుదుపు
ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)తో మార్కెట్లో సంచలనం సృష్టించిన నైకా కంపెనీ షేర్లు కుదుపులకి లోనవుతున్నాయి. దీంతో ఇటీవల సెల్ఫ్‌మేడ్ సంపన్న మహిళగా గుర్తింపు పొందిన ఫాల్గుని నాయర్ సంపదకి కోత పడుతోంది. ఇండియాలో ఈ కామర్స్ మార్కెట్లో ప్రీమియం బ్యూటీ ప్రొడక్టులు అందించే సంస్థగా నైకా విజయ ప్రస్థానం సాగించింది. ఆ తర్వాత కంపెనీ విస్తరణ కోసం ఇటీవల ఐపీవోకి వచ్చింది. రికార్డు స్థాయిలో కంపెనీ షేర్లు ఏకంగా రూ. 2,400 దగ్గర ట్రేడయ్యాయి. దీంతో వారం రోజులు పూర్తి కాకుండానే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటేసింది. ఇన్వెస్టర్లు నైకా షేర్ల కోసం ఎగబడ్డారు. బ్లూమ్‌బర్గ్ స్వయంప్రకాశిత సంపన్న మహిళ అంటూ నైనా వ్యవస్థాపకురాలు ఫాల్గుని నాయర్‌ని కీర్తించింది. సోమవారం జులై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి ఫలితాలను నైకా వెల్లడించింది. నికర లాభంగా రూ.1.20 కోట్లను ప్రకటించింది. గతేడాది ఇదే కాలానికి నికర లాభం రూ.27 కోట్లుగా నైకా ప్రకటించింది. ఒక్కసారిగా లాభాలు భారీగా పడిపోవడంతో.. ఆ ప్రభావం కంపెనీ షేర్లపై కనిపించింది. దీంతో ఒక్కసారిగా కంపెనీ షేర్ల ధర 7 శాతం పడిపోయింది. క్యూ 2 ఫలితాలు ప్రకటించకముందు కంపెనీ షేరు రూ.2351 దగ్గర ట్రేడయ్యింది. ఫలితాలు వెలువడిన తర్వాత షేరు ధర కుదుపులకు లోనవుతోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో షేరు ధర రూ.2312 దగ్గర ట్రేడవుతోంది. ఒక్కో షేరు ధర 44 వరకు పడిపోయింది. క్యూ 2 ఆర్థిక ఫలితాలను నిశితంగా పరిశీలిస్తే ఇదే కాలానికి సంబంధించి ఇయర్ టూ ఇయర్ లాభాలు రూ.603 కోట్లు ఉండగా ఈ ఏడాది అది రూ. 885 కోట్లుగా నమోదు కావడం ఇన్వెస్టర్లు ఊరటనిస్తోంది. అయితే భవిష్యత్తులో నైకా మంచి ఫలితాలు కనబరిచే అవకాశం ఉందటున్నారు మార్కెట్ నిపుణులు. రెండేళ కాలానికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న వారు నైకా షేర్లను గమనిస్తూ ఉండటం మంచిదని చెబుతున్నారు. ధర ఏమైనా తగ్గి రూ.1900 దగ్గర ట్రేడ్ అయితే ఈ షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమం అంటున్నారు. చదవండి:నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ -
చైనా మార్కెట్లకు ప్రభుత్వం బూస్ట్
- రెండు నెలల్లో షేర్లపై 147 బిలియన్ డాలర్ల వెచ్చింపు - స్టాక్స్ ధరల పతనాన్ని నిలువరించేందుకే... షాంఘై: స్టాక్ మార్కెట్ల పతనాన్ని నిలువరించే దిశగా షేర్ల ధరలకు ఊతమిచ్చేందుకు చైనా ప్రభుత్వం గత రెండు నెలల్లో ఏకంగా 900 బిలియన్ యువాన్లు (147 బిలియన్ డాలర్లు, దాదాపు రూ. 9 లక్షల కోట్లు) వెచ్చించింది. మార్కెట్లకు సహాయక ప్యాకేజీ కింద.. స్టాక్స్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ రంగ చైనా సెక్యూరిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (సీఎస్ఎఫ్) తదితర సంస్థలకు నిధులందించింది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు గోల్డ్‌మన్ శాక్స్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. జూన్ మధ్యలో గరిష్ట స్థాయికి చేరిన షాంఘై మార్కెట్ ఆ తర్వాత మూడు వారాల్లోనే 30 శాతం పైగా క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో పతనానికి అడ్డుకట్ట వేసేందుకు చైనా ప్రభుత్వం 2 లక్షల కోట్ల యువాన్లను పక్కన ఉంచినట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది.


