సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాల జోరు, 6 శాతం జంప్‌ | South Indian Bank Q2 profit at Rs 223 crore share price zoom | Sakshi
Sakshi News home page

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఫలితాల జోరు, 6 శాతం జంప్‌

Oct 21 2022 12:51 PM | Updated on Oct 21 2022 12:52 PM

South Indian Bank Q2 profit at Rs 223 crore share price zoom - Sakshi

సాక్షి,ముంబై: ప్రయివేట్‌ రంగ సంస్థ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 223 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 187 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 1,995 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 1,647 కోట్ల నుంచి రూ. 1,740 కోట్లకు బలపడింది.

స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6.65 శాతం నుంచి 5.67 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 3.85 శాతం నుంచి 2.51 శాతానికి మెరుగుపడ్డాయి. మొండి రుణాలు, కంటింజెన్సీలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ. 179 కోట్లకు పరిమితమయ్యాయి.  
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో  గురువారం 3.4 శాతం  ఎగిసింది. శుక్రవారం కూడా ఈ జోరు కంటిన్యూ చేస్తూ ఏకంగా 6 శాతం  లాభాలతో కొనసాగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement