Shanthi Priya
-
భానుప్రియ మతిస్థిమితం బాగోలేదా? సోదరి ఏమందంటే?
ఆకట్టుకునే ఆహార్యం, అద్భుతమైన నటన, నెమలిలా నాట్యం చేస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది హీరోయిన్ భానుప్రియ. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసింది. అయితే భర్త మరణించాక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిన ఆమె డిమెన్షియా అనే వ్యాధి బారిన పడింది. డిమెన్షియా అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం!భానుప్రియ గురించి దుష్ప్రచారంఈ వ్యాధి వల్ల డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకుంది. కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై భానుప్రియ సోదరి, హీరోయిన్ శాంతిప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. మా అక్క కొంతకాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తోంది. ఆమెకు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. తీరా చిత్రీకరణ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పుచేర్పులు చేస్తున్నారు.ఇలా మోసం చేయడం సరికాదుఅది ఆమెను బాధిస్తోంది. ముందొకటి చెప్పి.. తీరా సెట్‌కు వెళ్లాక మాట మార్చేయడం పట్ల ఆమె ఎంతగానో కలత చెందింది. దాదాపు 280 సినిమాలు చేసి, ఎన్నో అవార్డులు గెలిచిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితిలో నా సోదరిని చూడలేకపోతున్నాను. భర్త చనిపోయాక అక్క మానసికంగా కుంగిపోయింది. ఎక్కడికీ వెళ్లకుండా ఇంటికే పరిమితమైంది. తనను కనీసం 80's స్టార్స్ రీయూనియన్‌కు కూడా ఎవరూ ఆహ్వానించరు.రీయూనియన్‌కి పిలవరుదీని గురించి మాట్లాడొద్దని అక్క నన్ను హెచ్చరించింది, అయినా సరే నిర్మొహమాటంగా చెప్తున్నా.. తనను ఎవరూ రీయూనియన్ పార్టీకి పిలవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు.. పోనీ తన నెంబర్ మీ దగ్గర లేకపోతే నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్ చేయొచ్చుగా.. ఇండస్ట్రీలో అందరికీ మా అన్నయ్య తెలుసు. కానీ ఎవరూ సంప్రదించరు. ఇకపోతే అక్క ఇకపై సినిమాలు చేయదు. నేను మాత్రం సినిమాల్లో కొనసాగుతాను. నాకోసం డబ్బింగ్బ్యాడ్ గర్ల్ సినిమాలో అక్క నాకోసం డబ్బింగ్ చెప్పింది. తన మానసిక స్థితి చెడిపోలేదు. బాగానే ఉంది. దయచేసి సోషల్ మీడియాలో అక్క గురించి అసత్య ప్రచారం వ్యాప్తి చేయొద్దు. యూట్యూబ్‌లో ముందూవెనకా ఆలోచించకుండా, ఏదీ తెలుసుకోకుండా అక్క గురించి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇది చాలా పెద్ద తప్పు అని మండిపడింది. కాగా భానుప్రియ.. సితార చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. బంగారు చిలక, అన్వేషణ, ఆలాపణ, అపూర్వ సహోదరులు, చక్రవర్తి, దొంగ మొగుడు, స్వర్ణకమలం, పెదరాయుడు, అన్నమయ్య, జయం మనదేరా.. ఇలా అనేక సినిమాలు చేసింది. పర్సనల్ లైఫ్చివరగా అయలాన్ మూవీలో హీరో తల్లిగా కనిపించింది. వ్యక్తిగత విషయానికి వస్తే.. భానుప్రియ 1998లో గ్రాఫిక్స్ ఇంజనీర్ ఆదర్శ్ కౌశల్‌ను పెళ్లాడింది. వీరికి 2002లో కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో చదువుకుంటోంది. పెళ్లయిన ఏడేళ్లకే దంపతులిద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కానీ విడాకులు తీసుకోలేదు. 2018లో ఆదర్శ్ గుండెపోటుతో మరణించాడు.చదవండి: నేను కాలితో తన్నడం వల్ల అనుష్కకు గాయం: అడివి శేష్ -
అలనాటి హీరోయిన్ భానుప్రియ ఇంట తీవ్ర విషాదం
అలనాటి హీరోయిన్లు భానుప్రియ, శాంతిప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వారి తల్లి ఎం. లక్ష్మి (83) ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఎం.లక్ష్మికి భానుప్రియ, శాంతిప్రియతో పాటు గోపాలకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా తీర్చిదిద్దారు లక్ష్మి. భానుప్రియకాగా భానుప్రియ 1998లో ఆదర్శ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. వీరికి కూతురు అభినయ సంతానం. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. దీంతో 2005లో అతడి నుంచి విడిపోయి కూతుర్ని తీసుకుని చెన్నైకి వచ్చి తల్లితోనే కలిసి ఉంటోంది. 2018లో నటి మాజీ భర్త ఆదర్శ్ కౌశల్ గుండెపోటుతో మరణించాడు. శాంతిప్రియభానుప్రియ చివరగా అయాలన్ అనే తమిళ సినిమాలో కనిపించింది. శాంతిప్రియ విషయానికి వ్తే.. ఈమె ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం మనవడు, నటుడు సిద్దార్థ్ రాయ్‌ను పెళ్లి చేసుకుంది. 1992లో వీరి వివాహం జరగ్గా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. 2004లో సిద్దార్థ్ కూడా గుండెపోటుతోనే కన్నుమూశాడు. -
గుండు గీయించుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
ఆడవారికి కురులే అందం. కాస్త జుట్టు రాలినా అస్సలు తట్టుకోలేరు. అందులోనూ సెలబ్రిటీలు హెయిర్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటారు. అయితే ఓ సీనియర్ హీరోయిన్ మాత్రం అందంగా కనిపించాలంటే జుట్టు తప్పనిసరా? అని తనకు తాను ప్రశ్నించుకుంది. అందం అంటే ఆత్మవిశ్వాసమే అంటూ గుండు గీయించుకుంది. ఇంతకీ తనెవరో కాదు స్టార్ హీరోయిన్, భానుప్రియ సోదరి శాంతిప్రియ (Shanthi priya). తాజాగా ఆమె గుండుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధైర్యంగా..'ఈ మధ్యే గుండు కొట్టించుకున్నాను. ఒక అమ్మాయిగా మనకు జీవితంలో చాలా పరిమితులు, షరతులు ఉంటాయి. ఇవన్నీ మనల్ని బోనులో బంధీలుగా చేస్తాయి. వాటి నుంచి స్వేచ్ఛ కోరుకున్నాను. నన్ను నేను విముక్తి చేసుకున్నాను. అందం అంటే ఇదే అనుకునే ప్రమాణాలను బ్రేక్ చేయాలనుకున్నాను. మనసు నిండా నమ్మకంతో ఎంతో ధైర్యంగా ముందడుగు వేశాను. అలాగే నా దివంగత భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతడి బ్లేజర్‌ను ధరించాను' అని రాసుకొచ్చింది.పర్సనల్ లైఫ్- సినిమాఈమె తెలుగులో కాబోయే అల్లుడు, నాకు పెళ్లాం కావాలి, మహర్షి (1987), సింహస్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, అగ్ని, కలియుగ అభిమన్యుడు, జస్టిస్ రుద్రమదేవి సినిమాల్లో నటించారు. తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశారు. 1994లో ఇక్కె పె ఇక్క సినిమాతో బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. మూడు దశాబ్దాల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. బ్యాడ్ గర్ల్ అనే తమిళ సినిమాతో మరోసారి సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల్ని పలకరించారు. వ్యక్తిగత విషయానికి వస్తే.. శాంతిప్రియ నటుడు సిద్దార్థ్ రాయ్‌ను 1992లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. 2004లో సిద్దార్థ్ రాయ్ గుండెపోటుతో మరణించాడు. View this post on Instagram A post shared by Shanthi Priya (@shanthipriya333) చదవండి: వివాదంలో యాంకర్ రవి, సుడిగాలి సుధీర్.. మరి చిరంజీవిది తప్పు కాదా?: యాంకర్ రవి -
ఆ హీరో వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయా: స్టార్ హీరోయిన్
హీరోయిన్ భానుప్రియ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండే ఉంటుంది. ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా తెలుగులో హీరోయిన్గా చేసింది. కాకపోతే తమిళ, హిందీలో వచ్చినన్ని ఛాన్సులు ఇక్కడ రాలేదు. అయితే కొన్నాళ్ల ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని గతంలో అతడు బాడీ షేమింగ్ చేశాడని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరిన్ని విషయాలు బయటపెట్టింది. ఏం జరిగింది? అక్షయ్-శాంతిప్రియ కలిసి 'ఇక్కె పె ఇక్కా' సినిమా చేశారు. ఓ మిల్లులో షూటింగ్. గ్లామర్ రోల్ కావడం వల్ల హీరోయిన్ శాంతిప్రియ కాస్త పొట్టిబట్టలు వేసుకుని ఉంది. దీంతో ఆమె మోకాలు కనిపించింది. అయితే అది చూసిన అక్షయ్.. ఏమైంది? మోకాలికి దెబ్బ తగిలాందా అని అన్నాడు. అంత నల్లగా ఉన్నాయేంటి అని కూడా కామెంట్ చేశాడు. దీంతో సెట్లోని ఉన్నవాళ్లందరూ శాంతిప్రియని చూసి నవ్వారు. (ఇదీ చదవండి: అనసూయ బాధని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి!) డిప్రెషన్‌తో బాధపడ్డా 'నాకు అప్పుడు 22-23 ఏళ్లు ఉంటాయి. అక్షయ్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ వల్ల నేను డిప్రెషన్‌కి గురయ్యాను. ఆ సమయంలో అమ్మ నాకు అండగా నిలబడింది. నేను మాత్రమే కాదు అక్క భానుప్రియ కూడా ఇలాంటివి ఫేస్ చేసింది. నార్త్‌లోని కొన్ని మ్యాగజైన్స్ అయితే.. ముఖంపై మొటిమలు(పింపుల్స్) సంఖ్య బట్టి భానుప్రియ, తన సినిమాలకు పారితోషికం తీసుకుంటోందని రాసుకొచ్చారు' సారీ చెప్పలేదు తన స్కిన్ కలర్‌పై అప్పట్లో కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని శాంతిప్రియ పేర్కొంది. ఓసారి ఈ విషయమై మాట్లాడుతూ.. జోక్ చేశానని అన్నాడు తప్పితే సీరియస్‌గా సారీ లాంటిదైతే అస్సలు చెప్పలేదని ఈమె తెలిపింది. ఇదిలా ఉండగా 1994 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శాంతిప్రియ.. 2014లో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)


