breaking news
Shanaya Kapoor
-
ఓటీటీలో 'ట్వెల్త్ ఫెయిల్' హీరో కొత్త సినిమా
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రాంత్ మాస్సే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ చిత్రం తర్వాత ఆయన నటించిన 'ఆంఖో కి గుస్తాఖియాన్' మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన "The Eyes Have It" అనే కథ ఆధారంగా ఈ సనిమాను దర్శకుడు సంతోష్ సింగ్ రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది.'ఆంఖో కి గుస్తాఖియాన్' చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు జీ5 ప్రకటించింది. సెప్టెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనయా కపూర్ హీరోయిన్గా నటించింది. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో శనయా థియేటర్ ఆర్టిస్ట్‌గా నటించగా.. విక్రాంత్ అంధ సంగీతకారుడి పాత్రలో మెప్పించారు. భావోద్వేగపూరితమైన వారి ప్రేమకథకు యూత్ బాగానే కనెక్ట్ అయింది. -
అంబానీ పెళ్లిలో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదం.. వీడియో వైరల్
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకలు చూస్తే కళ్లు జిగేల్మంటున్నాయి. నెలల తరబడి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరపగా ఇప్పుడు పెళ్లి- ఆశీర్వాద్- రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు సెలబ్రిటీలందరూ హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.అయితే బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్ సెక్యూరిటీ గార్డుతో గొడవపడిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ సెక్యూరిటీ సిబ్బంది షనాయా బ్యాగ్ చెక్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె అసహనం వ్యక్తం చేసింది. అతడిపై ఫైర్ అయింది. ఇది చూసిన జనాలు ఆమెపై మండిపడుతున్నారు.'ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇంత యాటిట్యూడ్ చూపిస్తుందేంటి?', 'చేసిన సినిమాలు జీరో.. యాటిట్యూడ్ మాత్రం 100%', 'సెక్యూరిటీ సిబ్బంది వాళ్ల పని చేస్తున్నారు.. అందులో ఇబ్బందిపడాల్సిందేముందో..' అని కామెంట్లు చేస్తున్నారు.కాగా అంబానీ పెళ్లి వేడుకలకు హాజరైనవారిలో షనాయా కపూర్ కూడా ఉంది. జామ్ నగర్‌లోని ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి పెళ్లి-రిసెప్షన్ వరకు అన్నింటికీ హాజరైంది. కాగా ఈ బ్యూటీ 'బెదడక్' సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి చాలాకాలమైంది. కానీ ఇంతవరకు ఆ మూవీ నుంచి మళ్లీ ఎటువంటి అప్డేట్ రాలేదు. Shanaya going offbyu/Jealous_Summer_4867 inBollyBlindsNGossipచదవండి: ఈ సినిమా సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి పోదామనుకున్నా! -
Shanaya Kapoor: పిస్తా కలర్ లెహంగాలో హీరోయిన్.. ఇప్పుడిదే ట్రెండ్ (ఫోటోలు)