
'ట్వెల్త్ ఫెయిల్' సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రాంత్ మాస్సే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ చిత్రం తర్వాత ఆయన నటించిన 'ఆంఖో కి గుస్తాఖియాన్' మూవీ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ రాసిన "The Eyes Have It" అనే కథ ఆధారంగా ఈ సనిమాను దర్శకుడు సంతోష్ సింగ్ రూపొందించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది.

'ఆంఖో కి గుస్తాఖియాన్' చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు జీ5 ప్రకటించింది. సెప్టెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనయా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈమెకిదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రంలో శనయా థియేటర్ ఆర్టిస్ట్‌గా నటించగా.. విక్రాంత్ అంధ సంగీతకారుడి పాత్రలో మెప్పించారు. భావోద్వేగపూరితమైన వారి ప్రేమకథకు యూత్ బాగానే కనెక్ట్ అయింది.