breaking news
shadnagar bypass road
-
షాద్‌నగర్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
-
షాద్‌నగర్ వద్ద ఘోర ప్రమాదం, ముగ్గురు దుర్మరణం
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని షాద్‌నగర్ బైపాస్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతియ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన కారు షాద్ నగర్ బైపాస్ వద్ద అదుపుతప్పి పల్టీలు కొడుతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మలక్‌పేట వాసులుగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. -
ఇన్నోవా - స్విఫ్ట్ కార్లు ఢీ: ఐదుగురి మృతి
మహబూబ్‌నగర్ : షాద్‌నగర్ లోని జాతీయ రహదారిపై ఇన్నోవా, స్విఫ్ట్ కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు మృత్యువాతపడగా మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన చంద్రప్రదీప్(20), సూర్యప్రణయ్(19), మహేష్ (19), సాయితేజ్ అలియాస్ రింకూ(14), రామాంజులు(24), మేఘప్రశాంత్ షాద్‌నగర్ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌లో జరుగుతున్న శుభకార్యానికి బయలుదేరారు. పట్టణ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని అవతల రోడ్డుపై వస్తున్న వీరి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రామాంజులు, మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా రింకూ, చంద్రప్రదీప్, సూర్యప్రణయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మేఘప్రశాంత్ హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్నోవాలో బెలూన్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తికి గాయాలయ్యాయి.