breaking news
seshu babu
-
నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
మార్టూరు: నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తల్లీ కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (45) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు హేమంత్ కుమార్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె దివ్య హైదరాబాద్లో మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా.. ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను, ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె మార్టూరులోనే ఎలుకల మందుతోపాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల వచ్చి ఇద్దరూ తాగేశారు. మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతను గమనించిన శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆస్పత్రికి... అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరి్పంచారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. సుజాత భర్త శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు మార్టూరు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. -
హోదా కోసం పార్టీలన్నీ కలిసి పోరాడాలి
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు టౌన్ : ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఒకే వేదికపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తే కేంద్రం దిగివస్తుందని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు అవకాశవాదంగా వెళితే రాష్ట్రం విడిపోయే విషయంలో ఏ విధమైన నష్టం జరిగిందో అదే మళ్లీ పునరావృతం అవుతుందన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షం కలిసి పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి తీసుకురావడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి అధికారంలోకి వచ్చాక మాటమార్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ శేషుబాబు చెప్పారు. -
రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వమిది!
-
రాజకీయ ప్రయోజనాలకే విభజన
ప్రజాప్రయోజనాలను కాదని రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని, తక్షణమే సభలో సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆయన మాట్లాడారు. విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఆగిపోయే ప్రమాదముందని, దీని వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. 75 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, ప్రజల మనోభావాలను కాదని సోనియా రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకోవడం దురదృష్టకరమని అన్నారు.


