breaking news
SeetaRama Kalyanam
-
దర్గాలో సీతారామ కల్యాణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని హజ్రత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ దర్గాలో సీతారాములకు శాస్తోక్త్రంగా కల్యాణం జరిపించడమే కాదు ఆ మరుసటి రోజు కోదండ రాముడికి ఘనంగా పట్టాభిషేకం కూడా చేస్తారు. ఇల్లెందు పట్టణానికి చెందిన సత్యనారాయణ ఈ దర్గాకు మాలిక్‌గా ఉన్నారు. 1960వప్రాంతంలో నాగుల్‌మీరా ఆయన కు కలలో కనిపించి సత్యనారాయణపురం సమీపంలోని అడవుల్లో తాను ఉన్నానని చె΄్పారు. అప్పటి నుంచి ఈ గుట్టపై ఓ చెట్టు కింద పుట్టలో కొలువై ఉన్న నాగుల్‌మీరాను ఆయన పూజించడంప్రారంభించారు. కాలక్రమంలో ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు ఈ దర్గాకు రావడం మొదలైంది. 1972 నాటికి ఈ అడవిలో దర్గా వెలిసింది. గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుంచి కులమతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు రావడం మొదలైంది. ఈ క్రమంలో 2008లో కొందరు భక్తులు తమిళనాడు నుంచి సీతారాముల పంచలోహ విగ్రహాలను దర్గా ఆవరణలో ప్రతిష్టించి పూజించడంప్రారంభించారు. దర్గా ఆవరణలో ఒకవైపు మహ్మదీయ సంప్రదాయ ప్రకారంప్రార్థనలు నిర్వహిస్తూనే మరోవైపు హిందూ సంప్రదాయంలో శ్రీరాముడికి పూజలు చేసే ఆనవాయితీ మొదలైంది.నవమి కల్యాణంశ్రీరామనవమి సందర్భంగా నాగుల్‌మీరా దర్గా ఆవరణ లో తొలిసారిగా 2013లో శ్రీరాముడికి కల్యాణం, ఆ మరుసటి రోజు పట్టాభిషేకం జరిపించారు. వేదపండితులు శాస్తోక్త్రంగా ఈ వేడకలు నిర్వహించగా భక్తులు కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను కనులారా వీక్షించారు. హిందూ – ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తికి మరోసారిప్రాణప్రతిష్ట చేశారు. అప్పటి నుంచి ప్రతి నవమికి ఇక్కడ కల్యాణం, పట్టాభిషేక వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకం ప్రత్యేకంశ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఆలయాల్లో శ్రీరాముడి కల్యాణం జరిపిస్తారు. అంతటితో వేడుకలు ముగిస్తారు. భద్రాచలం తరహాలోనే సత్యనారాయణపురం దర్గాలో కూడా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని తొమ్మిది మంది వేదపండితులు శాస్తోక్త్రంగా జరిపిస్తూ శ్రీరాముడికి కిరీటధారణ చేస్తారు.దమ్మక్క వారసుల తలంబ్రాలుపోకల దమ్మక్క అనే గిరిజన మహిళ తొలిసారిగా భద్రాచలంలో సీతారాములకు పూజాదికాలు నిర్వహించింది. భద్రాద్రి రాముడికి తొలిసారిగా పూజలు అందించిన పోకల దమ్మక్క వారసుల్లో కొందరు నవమి సందర్భంగా దర్గాలో జరిగే కల్యాణ తంతుకు తొలి తలంబ్రాలు పంపిస్తారు. అదే విధంగా సత్యనారాయణపురం గ్రామంలోని రామాలయంలో జరిగే శ్రీరాముడి కల్యాణానికి దర్గా నుంచి ముత్యాల తలంబ్రాలు పంపే విధానం కూడా మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయప్రాంగణంలో శ్రీరాముడికి గుడిని నిర్మించాలని సంకల్పించారు. ఈ దర్గాప్రాంగణంలోనే చర్చి, మసీదు, గురుద్వారాలను కూడా నిర్మిస్తామని భవిష్యత్తులో సకల మతాల సమ్మేళనానికి ఈ దర్గాను వేదికగా మారుస్తామని ఇక్కడి భక్తులు అంటున్నారు.– సూరం శ్రావణ్‌రెడ్డి, సాక్షి, ఇల్లెందు రూరల్ -
సరిహద్దుకు బలగాలు
చర్ల: సరిహద్దు ప్రాంతానికి ప్రత్యేక పోలీసు బలగాలు భారీగా తరలుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసే క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నెల 26న భద్రాచలంలో శ్రీరామ నవమికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో, మావోయిస్టుల నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టారు. మార్చి 2న బీజాపూర్ జిల్లాలోని పూజారికాంకేడ్ ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలను మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తీవ్రంగా హెచ్చరించిన విషయం పాఠకులకు తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మావోయిస్టుల నుంచి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకుగాను సరిహద్దులో విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్‌ను బలగాలు చేపట్టాయి. గ్రేహౌండ్స్, సీఆర్ఫీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా బలగాలు కూడా సరిహద్దుకు తరలుతున్నాయి. ఇద్దరు ఆదివాసీలను విచారించిన పోలీసులు సరిహద్దు ప్రాంతంలోని చెన్నాపురం గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. బైండోవర్ కేసులో భాగంగా సంతకాలు చేసేందుకు చర్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారిలో చెన్నాపురం గ్రామస్తులు మడకం మంగయ్య, మడకం బాము ఉన్నారు. వీరిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గురువారం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే అనుమానంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు. దీనిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణను వివరణ కోరగా.. ‘‘వారిద్దరిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమే. విచారించి విడిచిపెట్టాం’’ అని చెప్పారు. -
నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం!
అంగరంగ వైభవంగా ముస్తాబైన కళ్యాణవేదిక ఒంటిమిట్ట (వైఎస్సార్ జిల్లా): ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించే రాములోరి కల్యాణవేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ముఖద్వారాన్ని భారీసెట్టింగులతో ఏర్పాటుచేశారు. సాంప్రదాయబద్దంగా ఏర్పాటుచేసిన ఈ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణవేదిక లోపలిభాగంలో కళ్యాణం వీక్షించేందుకు పెద్దపెద్ద ఎల్ఈడీలను ఏర్పాటుచేశారు. కల్యాణవేదిక సమీపంలో ప్రముఖులతోపాటు గవర్నర్, సీఎం కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. కళ్యాణవేదిక ప్రాంగణమంతా దేవతామూర్తుల విద్యుత్‌దీపాలు, భారీలైట్లను ఏర్పాటుచేశారు. దాదాపు 70వేల మంది స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాటుచేశారు. కళ్యాణోత్సవంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యలరావు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఆలయ సంప్రదాయబద్దంగానే.. తరతరాలుగా వస్తున్న ఆలయ సంప్రదాయబద్దంగానే రాములోరి కల్యాణం నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల పగలు సీతారామకళ్యాణం జరుగుతోంది. కానీ ఒక్క ఒంటిమిట్టలో పండువెన్నలలో రాములోరి కల్యాణం నిర్వహించడం కొనసాగుతోంది. ఇదే సంప్రదాయంలో టీటీడీ కూడా రాములోరి కళ్యాణంకు ఏర్పాటుచేసింది. కల్యాణం ముందు రామాలయంలో ఎదుర్కోలు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను కల్యాణవేదిక వద్దకు తీసుకొస్తారు. వైఖానస ఆగమశాస్త్రమ ప్రకారం స్వామి వారి కళ్యాణోత్సవంను టీటీడీ అర్చకస్వాములు చేపట్టనున్నారు. రాముడు రామచంద్రుడైన వేళ.... శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ శ్రీ రామాలయాలలోనూ ఇదే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. కానీ ఒంటిమట్ట శ్రీ కోదండరాముని కల్యాణోత్సవానికి మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేని విశిష్ఠత ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్బంగా చైత్ర శుద్ద చతుర్దశి నాడు అది కూడా రాత్రి పూట మాత్రమే కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. దీని వెనుక ప్రచారంలో గల పురాణ, చారిత్రక విశేషాలను ఓసారి గమనిద్దాం! పురాణ గాథ..... శ్రీరాముని జననం పగలు జరిగింది. దీన్ని తిలకించలేకపోయానని చంద్రుడు బాధపడ్డాడు. శ్రీకృష్ణవతారంలో తన జన్మను తిలకించే అవకాశం ప్రసాదిస్తానని రాముడు చంద్రునికి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన రామచంద్రుడయ్యాడు. శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అద్బుత దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణాన్ని తిలకించే భాగ్యాన్ని ప్రసాదిస్తానని కూడా మాట ఇచ్చాడు. రాముడు ఈ మాటలను నిలుపుకున్నాడు. చారిత్రక గాథ వాల్మీకి రామాయణం ప్రకారం చైత్ర మాసం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పగటిపూట శ్రీరాముని కల్యాణం జరిగింది. ఒంటిమిట్టలో బుక్కరాయులు స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామాయణంలోని శ్రీరామ కల్యాణం జరిగిన నక్షత్రం ప్రకారమే ఒంటిమిట్టలో కూడా వివాహం నిర్ణయించారు. అప్పట్లో అది రాత్రి పూట వచ్చింది. ఆ సంప్రదాయాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. బుక్కరాయులు చంద్ర వంశానికి చెందిన వాడు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీరామ కల్యాణం నిర్వహించిన సంతోషం పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించాడు. రామాలయంకు చేరిన గోటితో వలిచిన కోటి తలంబ్రాలు.. ఒంటిమిట్ట రామాలయంకు గోటితో వలిచిన కోటి తలంబ్రాలును ఆదివారం రామాలయం అధికారులకు అందచేశారు. గత మూడు సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ కృష్ణచైతన్య సంఘం భక్త బృందం కళ్యాణం అప్పారావు, చింతామణి, కె.సతీష్ ఆధ్వర్యంలో గోటితో రామనామస్మరణతో వడ్లను వలచి వారు చేసిన 20లక్షల తలంబ్రాలును తీసుకొచ్చారు. వీటిని ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవచార్యులకు అందచేశారు. గత నాలుగు నెలల ఈ కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. 200 మందితో స్వామివారిపై భక్తితో తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసామన్నారు. రామనామస్మరణ కలిగిన గింజలను తలంబ్రాలలో వినియోగించేందుకు పూజలు కూడా నిర్వహించారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు.. కల్యాణోత్సవంకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు..సౌకర్యాలను కల్పించారు. ప్రసాదాలను పంపిణీ చేసేందుకు విస్తృతంగా కౌంటర్లను ఏర్పాటుచేశారు. కల్యాణం వేదిక ఎదరుగా ఉన్న అత్యా«ధునిక షెడ్లు, పక్క ఇరువైపుల షెడ్లు ఏర్పాటుచేయడం జరిగింది. అలాగే యాత్రీకులు వసతి సముదాయ మండపంను కూడా ప్రారంభించేందుకు సున్నహాలు చేస్తున్నారు. కల్యాణవేదిక వద్ద గవర్నరు, మంత్రులు వెళ్లేందుకు ప్రత్యేకమార్గాలను ఏర్పాటుచేశారు. రోడ్డుపై కల్యాక్యణవేదిక ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా వివిధ అలంకరణలు చేపట్టారు. కళ్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీలను ఏర్పాటుచేశారు. రాములోరి కల్యాణానికి తరలిరండి సోమవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కల్యాణానికి భక్తులందరూ తరలిరావాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మెన్ క్రిష్ణమూర్తి, జేఈఓ పోలాభాస్కర్లు పిలుపునిచ్చారు. కళ్యాణానికి ముఖ్యమంత్రి, గవర్నర్లతోపాటు రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారని వివరించారు. అదేవిధంగా ఇప్పటికే రాములోరి కళ్యాణవేదికను సుందరంగా ముస్తాబుచేశామన్నారు. వచ్చిన భక్తాదులకు ప్రసాదాలు పంపిణీ అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఏప్రిల్ చివరినాటికి ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించిన కేంద్రపురావస్తుశాఖ అనుమతులుకూడా వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కల్యాణోత్సవ సందర్బంగా భారీ బందోబస్తు జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ కోందడరామస్వామి కల్యాణోత్సవ సందర్బంగా ఈనెల 10వ తేదిన సోమవారం మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్పీ చెప్పారు. ఈనెల 10న కల్యాణోత్సవ సందర్బంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కల్యాణోత్సవం ముగిసేవరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు. కల్యాణ వేదికకు వీవీఐపీ, వీఐపీ పాసులు ఉన్న వారికి ఒక్కొ పాసుకు ఒక్కరికే అనుమతి ఉంటుందని, నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని, అందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు – వాహనాల దారి మళ్లింపు ► మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుపతి వైపు నుంచి కడప వైపుకు వచ్చే భారీ వాహనాలు వయా రేణిగుంట, రాయచోటి మీదుగా వెళ్లాలని, అలాగే కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే భారీ వాహనాలు వయా రాయచోటి మీదుగా వెళ్లాలన్నారు. ► తిరుపతినుంచి కడప వైపు వచ్చే ఇతరత్రా వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి సాలాబాద్ క్రాస్ నుంచి మలకాటిపల్లె, సాలాబాద్, రాచపల్లె, సీతానగరం, రాచగుడిపల్లె, ఇబ్రహీంపేట, గంగపేరూరు, పెన్నాపేరూరు, బ్రాహ్మణపల్లి, మోహిద్దీన్సాబ్ పల్లె, ముమ్మిడిగుండుపల్లె, మాధవరం, ఉప్పరపల్లె హైవే రోడ్డుకు చేరుకోవాలన్నారు. ► అలాగే కడప నుంచి తిరుపతికి వెళ్లే ఇతరత్రా వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి మాధవరం, ఉప్పరపల్లె సాయిబాబా గుడి వైపు నుంచి ముమ్మిడి గుండుపల్లె, మోహిద్దీన్సాబ్ పల్లె, బ్రాహ్మణపల్లె, పెన్నపేరూరు, గంగపేరూరు, ఇబ్రహీంపేట, రాచగుడిపల్లె, సీతానగరం, రాచపల్లె, సాలాబాద్, మలకాటిపల్లె మీదుగా సాలాబాద్ క్రాస్ నుంచి వాహనాలు వెళ్లాలని ఎస్పీ సూచించారు. పార్కింగ్ ప్రదేశాలు ► కడప నుంచి వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ ప్రదేశాలుగా కల్యాణ వేదిక పడమర వైపున ఓబుల్‌రెడ్డి వాటర్‌ప్లాంటు, సాయి కాళేశ్వర డిగ్రీ కళాశాల ఎడమవైపున, బ్రహ్మయ్య పెట్రోలు బంకు ఎడమవైపు, ఉప్పరపల్లె వద్దనున్న సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో భక్తలు తమ వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. ► రాజంపేట వైపునుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను హరిత హోటల్, బాయ్స్ హాస్టల్ వద్దనున్న రాముడి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ జాగా, సాలాబాద్ క్రాస్ వద్ద, మలకాటిపల్లెలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనే తమ వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. -
రాజన్న సన్నిధిలో రాములోరి కల్యాణం
వేములవాడ (కరీంనగర్) : వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. అందంగా అలంకరించిన వేదికపై వేడుక కన్నుల పండువగా సాగింది. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. -
ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణం!