breaking news
Seelampur
-
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం సందర్బంగా నివాసం ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. నలుగురు క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.వివరాల ప్రకారం.. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శీలంపూర్ ప్రాంతంలో ఉన్న జనతా మజ్దూర్ కాలనీలో ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అసలు బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు.. ప్రాణనష్టంపై తెలియరాలేదు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. #WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb— ANI (@ANI) July 12, 2025 -
షాపులోకి చొరబడి పోలీసుల అరాచకం!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ)కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలు చోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ పరిస్థితుల్లో ఆశించదగ్గ మార్పు కనిపించలేదు. నిరసనలు హింసాత్మకంగా మారడానికి పోలీసుల వైఖరి కూడా ప్రధాన కారణమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా దీనికి ఊతమిచ్చే ఘటన తూర్పు ఢిల్లీలోని సీలంపూర్‌లో చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా సోమవారంనాడు సీలంపూర్ వాసులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని దుకాణాలను మూసివేయాలని హెచ్చరించారు. దీంతో అనిస్ మాలిక్ అనే వ్యక్తి హడావుడిగా తన షాపును మూసేశాడు. కానీ తాళం వేయడం మర్చిపోయాడు. అదే అతను చేసిన పొరపాటని అతనికి తర్వాత అర్థమైంది. నిరసనల రగడలో పోలీసులు అతని షాపును తెరిచి ఇష్టం వచ్చినట్టుగా అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఇదంతా అక్కడి సీసీటీవీలో రికార్డు ఐంది. దీంతో ఆ దృశ్యాల ఆధారంగా షాపు యజమాని అనిస్మాలిక్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అన్యాయంగా తన దుకాణంపై దాడి చేశారని వాపోయాడు. దుకాణం అద్దాలు పగలగొట్టారని, కంప్యూటర్లు ధ్వంసం చేశారని, ఫోన్లు వంటి పలు విలువైన వస్తువులను విరగ్గొట్టారని పోలీసులకు తెలిపాడు. ఇక ఈ వీడియోలో పోలీసులు ఇద్దరిని చితకబాదారని పేర్కొన్నాడు. కానీ వాళ్లు నిరసనకారులు కాదని, ఓ దుకాణంలో పనిచేసేవాళ్లని స్పష్టం చేశాడు. తన షాపును ధ్వంసం చేసినందుకుగానూ నష్ట పరిహారం ఇప్పించాలని పోలీసులను కోరాడు. పౌరసత్వ రగడ; సుప్రీంలో కేంద్రానికి ఊరట -
అభివృద్ధిలో శీలం‘పూర్’
న్యూఢిల్లీ : జాతీయ రాజధానిలోని ఇతర ప్రాంతాలు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నప్పటికీ ఈశాన్యఢిల్లీ పరిధిలోని శీలంపూర్ ప్రాంత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రీతిలోనే ఉంది. 2013 విధానసభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ నియోజకవర్గంలోని రహదారుల పునర్నిర్మాణం జరిగినప్పటికీ మిగతా విషయాల్లో మాత్రం వెనుకబడిపోయింది. ఏదిఏమైనప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చౌదరి మతీన్ అహ్మద్ ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ప్రతి ఎన్నికల్లోనూ భారీ తేడాతోనే మతీన్ గెలుపొందుతున్నారని స్థానికులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీచినప్పటికీ 21 శాతం ఓట్ల తేడాతో మతీన్ 2013 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడం మతీన్‌కు కలిసొచ్చిన అంశం. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గంలో 60 నుంచి 65 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఇక పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో ముస్లిం, హిందూ ఓటర్ల సంఖ్య దాదాపు సమానమైంది. అభివృద్ధికి అవకాశం అంతంతే శీలంపూర్ నియోజక వర్గంలోని అనధికార, రీసెటిల్మెంట్ కాలనీలతోపాటు మురికివాడలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ అభివృద్ధికి అవకాశం అంతగా లేదు. తగురీతిలో తాగునీటి సరఫరా జరగకపోవడం, మురుగుకాల్వల వెసులుబాటు అంతగా లేకపోవడంతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ మాట్లాడుతూ ‘ఈ నియోజక వర్గంలో రహదారుల నిర్మాణం బాగానే జరిగింది. గోరక్‌పూర్ మురుగుకాల్వ పునర్నిర్మాణం జరిగితే మురుగునీటి సమస్య పరిష్కారమవుతుంది’ అని అన్నారు. ఎమ్మెల్యే చేసింది అంతంతే ఇదే విషయమై ముఖేష్‌కుమార్ అనే స్థానిక వ్యాపారి మాట్లాడుతూ ‘స్థానిక ఎమ్మెల్యే మతీన్ అందరికీ అందుబాటులో ఉంటారు. అయితే ఈ నియోజకవర్గానికి ఆయన చేసింది తక్కువే. అనేక సంవత్సరాలనుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తోంది. అయినప్పటికీ ఇక్కడ ఆ పార్టీ కౌన్సిలర్ లేరు’అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న విధానసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు ముస్లిం అభ్యర్థులనే బరిలోకి దించాయి. అయితే బీజేపీ మాత్రం హిందువుల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడినుంచి సంజయ్ జైన్ అనే అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. బీజేపీకి మద్దతు పలకబోం రెండు దశాబ్దాలుగా ఈ నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోకపోయినప్పటికీ బీజేపీకి ఓటు వేయబోమని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ నియోజక వర్గంలో ఆప్... జెండా ఎగురవేసినా విచిత్రమేమీ లేదు. ఇదే విషయమై మొయిన్ అహ్మద్ అనే స్థానికుడు మాట్లాడుతూ ‘గత ఎన్నికల దాకా కాంగ్రెస్‌కు ఓటేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. ఆప్‌పై మాకు నమ్మకం కలగలేదు. అయినప్పటికీ ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేశాం. మాతో మమేకమయ్యేందుకు బీజేపీ ఏనాడూ యత్నించలేదు’ అని అన్నాడు.