breaking news
secunderabad parade grounds
-
నేటి జేపీ నడ్డా పర్యటన రద్దు: 8న తెలంగాణకు ప్రధాని మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారని, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని తెలిపాయి. శంకుస్థాపన కార్యక్రమం గతంలో రెండుసార్లు వాయిదా పడడంతో దీనిని అధికారికంగా ప్రకటించే విషయంలో రైల్వే, ఇతర అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. పార్టీ నేతలు మాత్రం మోదీ కార్యక్రమం ఖరారైనట్టే చెబుతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలోనూ ప్రధాని ప్రసంగిస్తారని అంటున్నారు. సభకు ఏర్పాట్లు, ప్రధాని పర్యటన విజయవంతం చేయడంపై అంతర్గతంగా పార్టీలో కసరత్తు సాగుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేస్తామనే ధీమాను మోదీ వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందని, అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడిందని రాష్ట్ర ముఖ్య నేతలు చెబుతున్నారు. అన్నీ వర్చువల్‌గానే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన రద్దయింది. శుక్రవారం సంగారెడ్డిలో జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభానికి నడ్డా రావాల్సి ఉంది. కానీ పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచే వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలను కూడా నడ్డా వర్చువల్‌గానే ప్రారంభిస్తారు. అక్కడి నుంచే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు హాజరుకానున్నారు. ఇలావుండగా సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిల సమావేశం జరుగుతుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్,స్వీట్ ఫెస్టివల్
-
నా తెలంగాణ.. కోటి రతనాల వీణ
* గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నోట దాశరథి కవిత * రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుకుందాం.. సాక్షి, హైదరాబాద్: ‘‘నా తెలంగాణ తల్లి కంజాత వల్లి, నా తెలంగాణ కోటి పుణ్యాల జాణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని సగర్వంగా ప్రకటించాడు మహాకవి. ఆ కవీశ్వరుని మాటలను సగర్వంగా స్మరించుకుంటూ.. ప్రియమైన రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..’’.. 66వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ప్రారంభమిది.. సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో సైనిక వందనాన్ని స్వీకరించిన అనంతరం దాశరథి కృష్ణమాచార్యుల పలుకులను స్మరిస్తూ గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడం ద్వారా బంగారు తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి పునాదులు వేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజల పేదరికానికి, వెనుకబాటుతనానికి రాజకీయ అవినీతే ప్రధాన కారణమని... అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో పాటు ప్రజల ను చైతన్యం చేయడం ద్వారా అవినీతి నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసింహన్ చెప్పారు. రాష్ట్రంలో గణనీయ అభివృద్ధిదిశగా వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి... తద్వారా ఆహార భద్రత, ఉపాధి అవకాశాల సృష్టి, మెరుగైన ఆదాయ అవకాశాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో తొమ్మిది వెనుకబడ్డ జిల్లాలు బీఆర్జీఎఫ్ కింద గుర్తించబడ్డాయని, ఈ జిల్లాల పురోగతికి కృషి చేసి... అభివృద్ధి ఫలాలను అణగారిన వర్గాలకు సమంగా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల్‌సాగర్ ప్రాజెక్టులను ఈ ఏడాదిలోగా పూర్తిచేసి 2,97,550 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు 70 టీఎంసీల నీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో పాములపర్తి, తడకపల్లి రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా గజ్వేల్‌కు తాగునీరు, సాగునీరు అందించే ఏర్పాటు చేస్తున్నాం. * ‘మిషన్ కాకతీయ’ కింద చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నాం. మన ఊరు-మన చెరువు కింద ఐదేళ్లలో రూ. 22,599 కోట్లతో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. * రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం దేశంలోనే అత్యున్నతమైన నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం. తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ఫార్మా, ఐటీ, మైనింగ్, టెక్స్టైల్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఐకీ, కొకాకోలా, చైనాకు చెందిన డాంగ్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్, ప్రొక్టర్ అండ్ గాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు ఇప్పటికే పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి. * ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వంగా పనిచేస్తాం. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం. విద్యుత్ ఉద్యోగులకు 27.5 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. పీఆర్సీ అమలుకు కృషి చేస్తున్నాం. * హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. వారసత్వ సంపదను కాపాడుకుంటూనే 4జీ, వైఫై, స్కైవేలు, 24 గంటల పాటూ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. * రూ. 25 వేల కోట్లతో పది జిల్లాల్లో ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేలా 1.26 లక్షల కిలోమీటర్ల పైపులతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. 20 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను వచ్చే మూడేళ్లలో సాధించేం దుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. * తెలంగాణ హరితహారంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఒక్కో నియోజకవర్గం లో 40 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించాం. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటిస్తాం. * మహిళల భద్రత, బాలికా సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసుల్లో మూడోవంతు కోటా అమలు చేస్తున్నాం. ప్రతి విభాగంలో మహిళా ఫిర్యాదుల విభాగం, టోల్‌ఫ్రీ నంబర్, ‘షీ’ ఆటోలు, ‘షీ’ పోలీస్ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారాన్ని కొత్త సంవత్సర కానుకగా అందిస్తున్నాం. * గత ఆగస్టు 19న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను, పెన్షన్లు, రేషన్‌కార్డులను సక్రమంగా అందించే ఏర్పాటు చేసింది. అలరించిన వేడుకలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఏపీలోని విజయవాడలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌కు వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను, త్రివిధ దళాలకు చెందిన అధికారులను పరిచయం చేశారు. తర్వాత త్రివిధ దళాలతో పాటు కేంద్ర, రాష్ట్ర పోలీస్ దళాలు, ఎన్సీసీ, స్కౌట్స్ నుంచి గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఆయా దళాలు నిర్వహించిన కవాతు అలరించింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి. లక్ష్మారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టి.పద్మారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
త్రివర్ణ శోభితం
-
పరేడ్ గ్రౌండ్స్‌లో పంద్రాగస్టు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కిరణ్ సీఎం చేతుల మీదుగా పతకాలు అందుకుంటున్న ఐపీఎస్‌లు వర్షంలో తడుస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకిస్తున్న జనం ప్రథమ బహుమతి సాధించిన సాంస్కృతిక శాఖ శకటం, రెండో స్థానంలో నిలిచిన అటవీ శాఖ, మూడో స్థానం పొందిన ఉద్యాన శాఖ శకటాలు కవాతు చేస్తున్న పోలీసులు సాంస్కృతిక ప్రదర్శనలో విద్యార్థులు అశ్విక దళం -
జనగామ ఏఎస్పీకి అరుదైన అవకాశం
జనగామ క్రైం, న్యూస్‌లైన్ : జనగామ డివిజన్ ఏఎస్పీ జోయల్ డేవిస్‌కు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 15వ తేదీన సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పరేడ్ కమాండెంట్‌గా జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయనున్నారు. 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జోయల్ డేవిస్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతంలోని పుట్టకొడ గ్రామం. ఆయన ప్రసుత్తం జనగామ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వాంతత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించే పెరేడ్‌కు నేతృత్వం వహించనున్నారు. ఇందుకు గాను ఆయన పేరేడ్ గ్రౌండ్లో ఈ నెల 1 నుంచి జరుగుతున్న రిహార్సల్లో పాల్గొంటున్నారు. పెరేడ్‌గ్రౌండ్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో జనగామ డివిజన్ నుంచి పాల్గొనబోయే రెండవ ఐపీఎస్ అధికారి డేవిస్. గతంలో ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన అంజనీకుమార్ 1992 ఆగస్టు 15న పెరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.