breaking news
sarvam
-
స్వదేశీ విశ్వరూపం.. సర్వం విజయం
దిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సాక్షిగా ‘సర్వం ఏఐ’ సగర్వంగా చెప్పకనే చెప్పింది. ‘వరల్డ్–క్లాస్ హార్డ్ టెక్నాలజీ ఇండియాలో కూడా సాధ్యమే’ అని! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ విజయం ఆ కంపెనీ వ్యవస్థాపకుల సమర్థతకు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ‘మన దేశం–మన కంపెనీ’ అని కలలు కనే ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్ల విజయం. ‘మేధోవలస’కు చేయి అడ్డు పెట్టి...‘ఎక్కడో ఎందుకు? మన దేశంలోనే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చే విజయం....‘పీహెచ్‌డీలు ముఖ్యం కాదు. కంపెనీకి సరిగ్గా అవసరమైన వారే ముఖ్యం’ అంటూ ఎంటర్ప్రెన్యూర్లుగా స్వదేశంలో ప్రయాణం మొదలుపెట్టిన వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్‌లు ‘సర్వం ఏఐ’తో సత్తా చాటారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) నుంచి నిన్నా మొన్నటి ‘సర్వం కేజ్’ స్మార్ట్‌గ్లాసెస్ వరకు, ఏ.ఐ మోడల్స్ శిక్షణకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం వరకు... సర్వం సాంకేతికమయం!సర్వం సక్సెస్ మంత్రాఒక స్టార్టప్ సక్సెస్ కావడానికి, సూపర్ సక్సెస్ కావడానికి ఏం ఉండాలి? ‘సర్వం ఏఐ’ ఫౌండర్లలో ఒకరైన వివేక్ రాఘవన్ మాటల్లో చె΄్పాలంటే ‘ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి’ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ మోడల్స్‌ను నిర్మించాలనే లక్ష్యంతో బయలుదేరింది సర్వం. ‘మా విజయం ఎలా ఉండాలంటే ఇతర డెవలపర్లు, స్టార్టప్‌లు కూడా యస్...మేము కూడా ప్రపంచంతో ΄ోటీ పడుతూ వరల్డ్–క్లాస్ మోడల్స్‌ను నిర్మించగలం అనే నమ్మకాన్ని పాదుకొల్పేంతగా’ అన్నారు వివేక్. ‘వీరి ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంది. సాధించగలరా?’ అని కొందరికి సందేహం వచ్చింది.పగటి కలలకే పరిమితమై ఉంటే వారి కలలు కలలుగానే ఉండేవి. అయితే వారు రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు.ఇది యువత విజయంతొలి అడుగులు వేస్తున్నప్పుడు ‘సర్వం’ టీమ్‌లో ఉన్నది సాంకేతిక ఉద్దండులు కాదు. నవ యువకులు! ‘వీరితో విజయం సాధ్యమా?’ అని కూడా కొందరికి సందేహం వచ్చింది. ‘కచ్చితంగా సాధ్యమే’ అని నిరూపించింది సర్వం. అందుకే...‘‘మా సంస్థ విజయాన్ని భారతదేశ యువత విజయంగా కూడా నేను భావిస్తున్నాను’ అంటారు వివేక్. ఎంటర్‌ప్రెన్యూర్‌గా సిలికాన్ వ్యాలీలో గెలుపు జెండా ఎగరేసిన తరువాత స్వదేశీ బాట పట్టారు. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి బయలుదేరారు.పీహెచ్డీ... పెద్ద విషయం కాదు!‘మీ ఇద్దరికీ పీహెచ్డీ ఉంది. సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లు పీహెచ్డీ చేసిన డీప్–టెక్ వ్యవస్థాపకులు మన దేశంలో పెద్దగా కనిపించరు’ అనే ప్రశ్నకు ‘నిజమే!’ అని కాలర్ ఎగరేయలేదు వివేక్. ‘పీహెచ్డీ అనేది పెద్ద విషయం కాదు. సంస్థకు పనికొచ్చే సామర్థ్యమే ముఖ్యం. పీహెచ్డీ వరకు ఎందుకు? హైస్కూల్ స్థాయిలో కూడా అద్భుత ప్రతిభæ చూపుతున్న విద్యార్థులను మనం చూస్తూనే ఉన్నాం. నాకు పీహెచ్డీ ఉన్నప్పటికీ దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. పీహెచ్‌డీలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. కంపెనీకి అవసరమైన సరిౖయెన వ్యక్తిని ఎంచుకోవడమే ముఖ్యం’ అంటారు వివేక్.వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్‌లు వ్యవస్థాపనలో బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ 2023లో ప్రారంభమైంది. భారతీయ భాషలలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేసింది. స్పీచ్–టు–టెక్ట్స్, విజన్–లాంగ్వేజ్ మోడల్స్లాంటి మల్టీ మోడల్స్‌ను, సిస్టమ్స్‌ను కూడా కంపెనీ డెవలప్ చేసింది. ‘సర్వం విజన్’ పేరుతో విజన్–లాంగ్వేజ్ మోడల్ని పరిచయం చేసింది.గత సంవత్సరం సర్వం ఏఐ ‘ఇండియా ఏఐ మిషన్’కు ఎంపికైంది. డొమెస్టిక్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్ డెవలప్మెంట్కు ఈ మిషన్ స΄ోర్ట్ చేస్తుంది. ‘ఏఐ ఫర్ భారత్’తో పాటు లాంగ్వేజ్ డాటాబేస్, స్పీచ్ రిసెర్చ్‌కు సంబంధించి విద్యాసంస్థలతో కలిసి పనిచేసింది సర్వం. ఇద్దరూ ఇద్దరేవివేక్ రాఘవన్ ఐఐటీ–దిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఐఐటీ–బాంబే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రత్యూష్ కుమార్‌కు కంప్యూటర్ సైన్స్ పరిశోధనకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. జ్యూరిచ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఇద్దరు ప్రతిభావంతులు ఒక దగ్గర చేరితే అద్భుతాలు జరుగుతాయనేది నిజమే అయినా, ఆ ప్రతిభావంతులు తమలాంటి వారి కోసం అన్వేషించి, తమ జట్టులో చేర్చుకోవడమే అసలుసిసలు అద్భుతం.రిస్క్ తీసుకోక΄ోవడమే పెద్ద రిస్క్!సిలికాన్ వ్యాలీ తన ఆలోచన తీరును మార్చింది అంటారు వివేక్ రాఘవన్. ‘మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే కచ్చితంగా రిస్క్ తీసుకోవాలి’ అనేది సిలికాన్ వ్యాలీ చెప్పిన పాఠం. ‘ఇతరత్రా రిస్క్‌లతో ΄ోల్చితే టెక్నాలజీ రిస్క్ అనేది భిన్నమైది’ అనే విషయం తెలిసినా ‘సై’ అంటూ స్వదేశీ బాట పట్టారు వివేక్ రాఘవన్.నెట్ అవసరం లేదండీ!‘ఎడ్జ్’ అనే కొత్త ఆన్–డివైజ్ ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది సర్వం ఏఐ. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. స్పీచ్ రికగ్నిషన్, ట్రాన్స్లేషన్, టెక్స్›్ట–టు–స్పీచ్లాంటి పనులెన్నో చేస్తుంది. డివైజ్‌లోనే డాటా ప్రాసెస్ చేయబడినందున యూజర్లు సమాచారాన్ని క్లౌడ్‌కు పంపాల్సిన అవసరం లేదు. ‘ఈ మోడల్ వేగం, గోప్యత, విశ్వసనీయతపై దృష్టి సారిస్తుందని, అదే సమయంలో ప్రధాన భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది.ఇండస్ స్వదేశీ స్టార్టప్ సర్వం ఏఐ ‘ఇండస్’ అనే కొత్త ఏఐ చాట్‌బాట్ యాప్‌ను తీసుకువచ్చింది. ‘భారతీయ వినియోగదారుల కోసం భారత్‌లో రూపొందించిన యాప్ ఇది’ అని ప్రకటించింది కంపెనీ. చాట్‌జీపీటీ, జెమినివంటి ప్రసిద్ధ చాట్బాట్ల మాదిరిగానే ‘ఇండస్’లో ఫీచర్లు ఉన్నాయి. యూజర్లు వాయిస్ కమాండ్లు ఇవ్వవచ్చు. ప్రశ్నలను టైప్ చేయడానికి బదులుగా మాట్లాడవచ్చు. ఏఐ వెబ్‌లో శోధించవచ్చు. స్పష్టమైన సమాధానాలను తెలుసుకోవచ్చు, లోతైన పరిశోధన చేయవచ్చు. నేరుగా యాప్‌లోనే డాక్యుమెంట్లు రాయవచ్చు. ఇమేజ్‌లు, పీడీఎఫ్‌లు, ఫైళ్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని మరో ప్రత్యేకత భాషా సౌలభ్యం. -
సర్వం భారతీయం!
ప్రపంచ టెక్ గమనాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఇన్నాళ్లూ అగ్రరాజ్యాలదే ఆధిపత్యం. కానీ, ఆ గతాన్ని తిరగరాస్తూ భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’అద్భుతాలు సృష్టిస్తోంది. కేవలం అనుకరణలతో సరిపెట్టుకోకుండా, మట్టి వాసన తెలిసిన ‘సొంత’సాంకేతికతతో అంతర్జాతీయ దిగ్గజాలైన గూగుల్ జెమిని, చాట్ జీపీటీనీ వెనక్కి నెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. గూగుల్, చాట్ జీపీటీలకే సవాల్ భారతీయ మేధస్సు గ్లోబల్ టెక్ మ్యాప్‌పై తన ముద్రను బలంగా వేస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘సర్వం ఏఐ’అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ మోడల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రెండు టూల్స్ ద్వారా ఈ సంస్థ టెక్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తోంది. 93.28 శాతం కచ్చితత్వం ఇది అద్భుతమైన ఓసీఆర్ (ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ టూల్). భారత భాషల్లోని పత్రాలను చదవడంలో అమోఘమైన పనితీరును కనబరుస్తోంది. ఓఎల్ఎంఓసీఆర్ బెంచ్‌మార్క్‌లో 84.3 శాతం స్కోరును సాధించి, గూగుల్ జెమిని 1.5 ప్రో, చాట్ జీపీటీలను మించిపోయింది. సంక్లిష్ట పట్టికలు, గణిత ఫార్ములాలనూ 93.28 శాతం కచ్చితత్వంతో విశ్లేషించగలగడం దీని విశిష్టత. బుల్ బుల్ వి3 ఇది అచ్చమైన భారతీయ గొంతుకలతో కూడిన వాయిస్ ఏఐ మోడల్. ప్రస్తుతం 11 భారతీయ భాషల్లో 35కు పైగా సహజసిద్ధమైన స్వరాలను ఇది అందిస్తోంది. త్వరలో దీనిని 22 భాషలకు విస్తరించనున్నారు. అంతర్జాతీయ టూల్స్ భారతీయ భాషల విషయంలో తడబడుతున్న వేళ, సర్వం ఏఐ అత్యంత స్పష్టమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలను అందిస్తోంది. ‘సర్వం’ పనితీరుకు ఫిదా ఒకప్పుడు భారతీయ ఏఐ నమూనాల సామర్థ్యాన్ని శంకించిన విమర్శకులు సైతం ‘సర్వం’ పనితీరుకు ఫిదా అవుతున్నారు. గ్లోబల్ ఏఐ ల్యాబ్‌లు విస్మరించిన భారతీయ భాషా వైవిధ్యాన్ని శక్తిగా మలుచుకుంటూ ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందనడానికి ఈ విజయమే నిదర్శనం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Sarvam AI: భారతీయ ‘గొంతు’కు మైక్రోసాఫ్ట్ మద్దతు!
భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జత కలిసింది. వాయిస్ ఆధారిత జనరేటివ్ AIని అభివృద్ధి చేయడం, అజూర్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా సర్వం ఏఐకి (Sarvam AI)కి మద్దతు ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. భారత్‌లో ఏఐ ఆధారిత సేవలు, ఉత్పత్తులను మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భారంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’తో చేతులు కలుపుతున్నట్లు వెల్లడించింది. సర్వం ఏఐ భారతీయ భాషలు, నేపథ్యంపై ఉత్పాదక ఏఐ మోడల్స్‌ను రూపొందించడంలో పని చేస్తోంది. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, ఖోస్లా వెంచర్స్ నుంచి గత ఏడాది డిసెంబర్లో సుమారు రూ.340 కోట్ల మేర నిధులు సేకరించింది. ఈ స్టార్టప్‌ను స్థాపించిన ప్రత్యూష్ కుమార్, వివేక్ రాఘవన్‌లు గతంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధనా బృందం ఏఐ4భారత్‌తో కలిసి ఏఐ నమూనాలను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్నారు. ప్రతిఒక్కరికీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఏఐ-మొదటి దేశంగా భారత్ పరివర్తన చెందడానికి సాధికారత కల్పిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా & దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అన్నారు. సర్వం ఏఐతో సహకారం ద్వారా స్వదేశీ ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి, వారి భాష, నేపథ్యంతో సంబంధం లేకుండా వాయిస్-ఆధారిత ఏఐ సొల్యూషన్ల శక్తి నుంచి ప్రయోజనం పొందగల భవిష్యత్తును తాము ప్రోత్సహిస్తున్నామని చందోక్ చెప్పారు. భారతీయ భాషలలో ఉత్పాదక ఏఐ అప్లికేషన్ల కోసం వాయిస్ అత్యంత సహజమైన ఇంటర్‌ఫేస్‌లలో ఒకటి. విద్య, ఆర్థికం, ఆరోగ్య సంరక్షణ, కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో దీన్ని వర్తింపజేయొచ్చు. సర్వం ఏఐ ఇండిక్ వాయిస్ ఎల్ఎల్ఎంను అజూర్‌లో అందుబాటులోకి తేవడం ద్వారా భారత్-కేంద్రీకృతంగా మరిన్ని ఆవిష్కరణలు రూపొందించడానికి మైక్రోసాఫ్ట్ పునాదులు వేస్తోంది. -
సర్వం పరమేశ్వరుడే
జగ్గంపేట : సర్వం పరమేశ్వరుడని ఈశ్వర ప్రతిష్ఠాపన సందర్భంగా వర్షం పడడం శుభసూచకమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీ అన్నారు. ఇర్రిపాక గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం ఘనంగా జరిగింది. ఉదయం 11.22 గంటలకు స్వరూపానంద స్వామిజీ శివాలయంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠకు నవధాన్యాలు వేసి పూజచేసి యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ కాశీలో లింగ ప్రతిష్ఠకు వెళ్లాల్సి ఉందని, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆహ్వానంతో ఇర్రిపాక వచ్చానన్నారు. స్వామిజీకి అన్నవరం వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం ఆయన కాశీ వెళ్లేందుకు బయలుదేరారు. ఎమ్మెల్యే నెహ్రూ, మణి దంపతులు, వారి కుమారుడు జెడ్పీటీసీ సభ్యుడు నవీన్ దంపతులు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ తోట నరసింహం, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


